• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా విలయం: 17 ఏళ్ల అమ్మాయికి 78ఏళ్ల వృద్ధుడితో వివాహం -22రోజులకే విడాకులు -వైరల్

|

బాల్యవివాహం అనే దురాచారం ఇంకా కొనసాగుతోన్న దేశాల జాబితాలో ఇండోనేషియా టాప్-8వ స్థానంలో ఉంది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ లెక్కల ప్రకారం ఆదేశంలోని బాలికల్లో 15 శాతం మందికి 18 ఏళ్లలోపే పెళ్లిళ్లవుతున్నాయి. ఏటా దాదాపు 14.59లక్షల మంది ఆడపిల్లలు చిన్నవయసులోనే భార్యలుగా మారుతున్నారు. అసలే పేద దేశమైన ఇండోనేషియా.. ప్రస్తుత కరోనా విలయ కాలంలో ఇంకా దిగజాదిపోయింది..

ట్రంప్ ఓడినా చరిత్రే: అత్యధిక రేటింగ్ -28ఏళ్ల తర్వాత ఆయనే -అమెరికాను వీడిపోతారా?

 పెరిగిన బాల్యవివాహాలు..

పెరిగిన బాల్యవివాహాలు..

ఇండోనేషియాలో కరోనా లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో పేదరికం ఇంకా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెంచలేక ఎలాగోలా పెళ్లిళ్లు చేసి పంపేస్తున్నారు. కరోనా విలయ కాలంలో బాల్య వివాహాలు భారీగా పెరిగాయని, 2030నాటికి అదనంగా 130 మిలియన్ల బాల్యవివాహాలు జరగొచ్చని ఐరాస అంచనా వేస్తోంది. దీన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేస్తున్నా ఫలితాలు రావడంలేదు. తాజాగా ఇండోనేషియాకే చెందిన 17 ఏళ్ల అమ్మాయి నోని నావితా గాథ ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది.

17ఏళ్ల వధువు.. 78ఏళ్ల వరుడు..

17ఏళ్ల వధువు.. 78ఏళ్ల వరుడు..

ఇండోనేషియా రాజధాని జకార్తాకు చెందిన 78 ఏళ్ల అబా శర్నా అనే వృద్ధుడు.. తన మనవరాలి వయస్సు ఉండే 17 ఏళ్ల నోనీ నావితాను పెళ్లి చేసుకున్నాడు. వధువరులతోపాటు ఇరు కుటుంబాలూ అంగీకరించాకే పెళ్లి జరిగిందని చెబుతున్నారు. వరకట్నం కింద నోనీ కుటుంబం ఆ వృద్ధుడికి 50 వేలు రూపియాలతోపాటు ఒక మొటార్ సైకిల్, పరుపు, సోఫా సెట్ తదితర వస్తువులను సమర్పించుకున్నారు. కాగా..

 నెల తిరక్కముందే విడాకులు..

నెల తిరక్కముందే విడాకులు..

17 ఏళ్ల నోనీతో పెళ్లయిన 22 రోజులకే ఆమెతో సంసారం చేయడం ఇష్టం లేదంటూ శర్నా విడాకుల పత్రాలు పంపించాడు. అవి చూడగానే నోనీ కుటుంబ సభ్యులు షాకయ్యారు. విడాకులకు తగిన కారణం కూడా చెప్పలేదని వారు వాపోయారు. పెళ్లికి ముందే నోనీ గర్భవతి అని తెలిశాక అతను విడాకులిచ్చాడని స్థానికంగా ప్రచారంజరిగింది. కానీ..

ముసలోడిపై విమర్శల వర్షం..

ముసలోడిపై విమర్శల వర్షం..

నోనీ సోదరి ఇయాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లికి ముందే గర్భం ఆరోపణలను కొట్టిపారేశారు. శర్నా ఇంటి సభ్యులు కూడా ఎలాంటి గొడవ చేయలేదని, విడాకులు అడగటానికి కారణమేంటో తెలియదని చెప్పారు. ఈ ఘటన వైరల్ కావడంతో నెటిజన్లు వృద్ధ వరుడు శర్నాను తిట్టిపోస్తున్నారు. ఇండోనేషియాలో బాల్యవివాహాల దురాచారం రూపుమాసిపోవాలని నినాదాలు చేస్తున్నారు.

నిమ్మగడ్డ రహస్యభేటీ లీకైందిలా -హరీశ్ సాల్వే ఉచిత వాదన -కొత్త దేవుడిలా జగన్: ఎంపీ రఘురామ

English summary
just about a month ago, a particular 78-year-old man got happily married to a young 17-year-old girl. This story occurred in Subang, West Java, Indonesia and it went viral all over the world. Unfortunately, the couple got divorced on the 30th of October 2020 after only 22 days of marriage. Abah Sarna, 78 and Noni Navita, 17 were married last month and they attracted a lot of attention because of their vast age difference.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X