వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video: వామ్మో ఈ బుడతడు చూడు.. 8 ఏళ్ల ప్రాయంలోనే SUV నడిపేశాడు.. ఎక్కడ అంటే..?

|
Google Oneindia TeluguNews

డ్రైవింగ్.. అంటే యూత్‌కి క్రేజీ.. టూ వీలర్ లేదంటే కారు అంటే ఇష్టం. డ్రైవ్ చేస్తూ మజా పొందుతారు. కారును చిన్న పిల్లలు డ్రైవ్ చేస్తే.. రికార్డే అవుతుంది. ఎందుకంటే నిర్దేశిత వయస్సు వరకు వాహనం నడిపేందుకు పర్మిషన్ ఉండదు. కానీ కొందరు నేర్చుకుంటున్నారు.. అయినా ఓకే.. కానీ యూ ట్యూబ్‌లలో వీడియోలు షేర్ చేస్తున్నారు. అలా దయాది దేశం పాకిస్థాన్‌లో ఓ బుడతడు డ్రైవ్ చేశాడు. అయితే అతనికి 8 ఏళ్లే కావడం విశేషం. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. పదండి.

ఏకంగా SUV నడిపేశాడు

ఏకంగా SUV నడిపేశాడు

కార్లలో కూడా రకాలు ఉంటాయి. బేసిక్ చిన్న కారు అయితే ఓకే.. అదీ కూడా ఎస్‌యూవీ నడపడం అంటే వేరు.. అవును పాకిస్థాన్‌కు చెందిన ఆయాన్ పెద్ద వాహనమే నడిపాడు.అదీ కూడా టయోట పార్చ్యూనర్ వెహికిల్ నడిపి ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే ఆ బుడతడు ఆరేళ్లప్రాయం నుంచే కారు నడుపుతున్నాడనే విషయాన్ని వీడియోలో తెలియజేశాడు. ఆ చిన్నోడితో అతని పదేళ్ల సోదరి కూడా ఉంది. ఆ వీడియోలో చిన్నారి.. తాను, తన సోదరుడి గురించి వివరించారు.

హైవే, గల్లీలో కూడా డ్రైవ్

హైవే, గల్లీలో కూడా డ్రైవ్

వారు స్వగ్రామానికి విచ్చేశాం అంటూ వీడియో షేర్ చేసింది. తన సోదరుడు కారు ఎలా నడుపుతున్నారో చూడండి అని కోరింది. అతను గ్రౌండ్, హైవే, గల్లీలో కూడా ఏ తడపాటు లేకుండా కారు నడిపేశాడు. ఈ వీడియోను ఆయాన్ అండ్ ఆరీబా షో అనే యూట్యూబ్ చానెల్‌లో వీడియో పోస్ట్ చేశారు. మూడు వారాల క్రితం పోస్ట్ చేయగా.. వాటికి తెగ లైకులు వస్తున్నాయి. తన తమ్ముడి కారు డ్రైవ్ చేసే వీడియో చూడాలని కోరింది. అందుకు జనం కూడా స్పందించారు. వావ్ అంటూ కీర్తించారు.

వావ్ అంటూ ప్రశంసలు

ఇప్పటికే ఆ వీడియోను వేలాదిసార్లు వీక్షించారు. చాలామంది అతని డ్రైవింగ్ స్కిల్స్ కొనియాడారు. మరికొందరు కాస్త విమర్శలు చేశారు. అయితే అదే ఇండియాలో అయితే చిన్నారి తండ్రిని అరెస్ట్ చేసేవారని మరొకరు కామెంట్ చేశారు. చాలా మంది బాగుందని ప్రశంసించారు.

సీటు చివరన.. పిల్లో వేసుకుని మరీ

సీటు చివరన.. పిల్లో వేసుకుని మరీ

ఆయాన్ చిన్నవాడు కావడంతో.. సీటు చివరన.. అదీ కూడా పిల్లో వేసుకొని మరీ కూర్చున్నాడు. అప్పుడే అతను గేర్, బ్రేక్, ఎక్స్ లేటర్ అందుకోగలిగాడు. కారు నడిపే సమయంలో కూడా అతను చిరునవ్వు చిందించాడు. అయితే పాకిస్థాన్‌లో డ్రైవింగ్ చేయడానికి కనీస వయస్సు 18 ఏళ్లు అని నిర్ధారించారు. అప్పటివరకు డ్రైవింగ్ చేయడానికి వీలు లేదు.. చేసినా అదీ నేరమే అవుతుంది. ఎందుకంటే సదరు వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండు కాబట్టి.. కానీ ఆయన్‌కు అలాంటి భయమేమీ లేదు. ఏం చక్కా కారు నడిపేశాడు.

English summary
8 year old boy seen in the video with his sister. girl introduces herself and her brother, saying they have arrived in their village and that they would show how his brother drives the car with ease.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X