భగత్ సింగ్ నిర్దోషా?.. అన్యాయంగా ఉరితీశారా? లాహోర్ కోర్టులో పాక్ లాయర్ పోరాటం!

Posted By:
Subscribe to Oneindia Telugu

ఇస్లామాబాద్: భారతీయుల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే స్వాతంత్ర్య సమరయోధుల్లో భగత్ సింగ్ ఒకరు. దేశం కోసం 23 ఏళ్ల వయసులోనే ప్రాణాలు అర్పించిన వీరుడాయన. పోలీస్ అధికారి శాండర్స్‌ను కాల్చి చంపాడనే ఆరోపణలతో నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను ఉరి తీసింది.

ఈ శిక్ష అమలైన 86 ఏళ్ల తర్వాత.. భగత్ సింగ్ నిర్దోషి అంటూ ఓ పాకిస్తానీ లాయర్ లాహోర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్‌ను నడుపుతున్న ఇంతియాజ్ రషీద్ ఖురేషీ అనే లాయర్ సెప్టెంబర్ 11న లాహోర్ హైకోర్టులో ఈ పిటీషన్ వేశారు.

86 years after Bhagat Singh’s hanging, Pakistani lawyer seeks to establish his innocence

ఒకసారి భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలోకి వెళితే... సైమన్ కమిషన్ రాకను వ్యతిరేకిస్తూ.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు లాలా లజపతిరాయ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో పోలీసులు లాఠీలతో కొట్టడంతో భగత్ సింగ్ కళ్ల ముందే లజపతిరాయ్ ప్రాణాలు వదిలారు.

దీంతో లాలా లజపతిరాయ్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని భగత్ సింగ్ భావించాడు. సుఖ్‌దేవ్, రాజ్‌గురులతో కలిసి పోలీస్ అధికారి జాన్ శాండర్స్‌ను కాల్చి చంపాడు. ప్రభుత్వ వ్యతిరేక కుట్ర ఆరోపణలతో భగత్ సింగ్‌పై కేసు నమోదు చేసిన బ్రిటీష్ ప్రభుత్వం 1931 మార్చి 23న ఆయన్ను ఉరి తీసింది.

1928లో శాండర్స్ హత్యకు గురికాగా.. అదే ఏడాది డిసెంబర్ 17న ఎఫ్ఐఆర్ నమోదైంది. అనార్కలీ పోలీస్ స్టేషన్‌‌లో ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీలను లాహోర్ పోలీసులు 2014లో గుర్తించారు.

ఉర్దూలో రాసి ఉన్న ఆ ఎఫ్ఐఆర్ కాపీలనే ఇప్పుడు లాయర్ ఖురేషీ సంపాదించారు. సాయుధులైన గుర్తు తెలియని వ్యక్తి శాండర్స్‌ను హత్య చేసినట్లు ఆ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. భగత్ సింగ్ పేరును అందులో ఎక్కడా ప్రస్తావించలేదు.

ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేనప్పటికీ, 450 మంది సాక్షులను విచారించకుండానే .. నాటి ధర్మాసనం భగత్ సింగ్‌కు ఉరి శిక్ష విధించిందని ఖురేషీ చెబుతున్నారు. ఈ కేసులో భగత్ సింగ్ తరఫు న్యాయవాదుల వాదనలు న్యాయస్థానం అసలు వినలేదని ఆయన ఆరోపించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Eighty-six years after revolutionary Bhagat Singh was hanged for the murder of a British police officer, a Pakistani lawyer is fighting to prove the legendry Indian freedom fighter’s innocence in a Lahore court.Advocate Imtiaz Rashid Qureshi filed a fresh petition on Monday in the Lahore High Court for the early hearing of his case to prove Singh’s innocence.The division bench of the Lahore High Court had in February last year asked the chief justice of Pakistan to constitute a larger bench to hear the petition by Qureshi, who runs the Lahore-based Bhagat Singh Memorial Foundation. But no action has been taken yet.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి