9 మంది మృతి: టీవీ టవర్ వద్ద దాడి.. యూఎన్ సాయం
తగ్గేదే లేదని రష్యా అంటోంది. ఉక్రెయిన్‌పై యుద్దం కొనసాగుతోంది. కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటుంది. ఉక్రెయిన్‌లో గల మరియుపోల్ తూర్పున రష్యా దళాలు చేరిన సంగతి తెలిసిందే. దాడులను కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ ఉత్తర ప్రాంతంలో గల రివ్నే వద్ద దాడి చేసింది. టెలివిజన్ టవర్‌పై దాడి చేయడంతో 9 మంది చనిపోయారు. ఈ మేరకు గవర్నర్ విలలీ కొవై తెలిపారు. ఇప్పటికీ జనం బంకర్లలో దాక్కొని ఉంటున్నారు. ఇటు ఐక్యరాజ్యసమితి స్పందించింది. మానవత్వంతో 40 మిలియన్ల డాలర్లను ఉక్రెయిన్‌కు ప్రకటించింది.

యుద్దం వల్ల గత వారం నుంచి ఇక్కడ నిత్యావసరాలు లేకుండా గడుపుతున్నారు. విద్యుత్, గ్యాస్, తాగేందుకు నీరు కూడా లేని పరిస్థితి నెలకొంది. యుద్దం వల్ల 1582 మంది ప్రజలు చనిపోయారు. టర్కీలోని ఉక్రేనియన్ రాయబార కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది, మారియుపోల్‌లోని ఒక మసీదులో ఆశ్రయం పొందిన వారిలో 36 మంది పిల్లలతో సహా 86 మంది టర్కీ జాతీయులు ఉన్నారని పేర్కొంది. శత్రువు ఇజియం ఉత్తర భాగంలో స్థిరపడిందని, దానిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను వదిలిపెట్టదని ఉక్రెయిన్ పేర్కొంది. శత్రువులు మారియుపోల్ యొక్క తూర్పు పొలిమేరను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఉక్రెయిన్‌లో గల కివ్, ఖార్కివ్, చెర్నిహివ్, సుమీ మరియు మారియుపోల్ రష్యన్ బలగాలు చుట్టుముట్టాయి.












Click it and Unblock the Notifications