మావో లేఖ విలువ రూ. 6.50 కోట్లు
లండన్: చైనా కమ్యూనిస్టు వ్యవస్థాపక నాయకుడు మావో జెడాంగ్ రాసిన లేఖ రికార్డు స్థాయిలో వేలంలో అమ్ముడు పోయింది. చైనాకే చెందిన ఓ వ్యాపారవేత్త వేలంలో రూ. 6.50 కోట్లకు మావో జెడాంగ్ లేఖను సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
మావో జడాంగ్ 1937లో బ్రిటన్ లేబర్ పార్టీ నాయకుడు క్లెమెంట్ అట్లీకి రాసిన అరుదైన లేఖను లండన్ లో వేలంలో పెట్టారు. ఈ వేలం పాటలో ప్రపంచ దేశాలకు చెందిన అనేక మంది వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలు పాల్గోన్నారు.
అయితే చైనాకు చెందిన ఓ వ్యాపారవేత్త ( వేలం నిర్వహకులు పేరు వెల్లడించలేదు) అధిక మొత్తంలో రూ.6.50 కోట్లు చెల్లించి ఆ లేఖను సొంతం చేసుకున్నారు. చైనా దేశానికి చెందిన నాయకుడి లేఖను అదే దేశానికి చెందిన వ్యాపారి దక్కించుకున్నాడు.

చైనాపై దురాక్రమణకు వచ్చిన జపాన్ సైన్యాన్ని తిప్పికొట్టడానికి కావలసిన సహాయం అందించాల్సిందిగా, ఆ దిశగా బ్రిటన్ సైన్యాన్ని ఒప్పించాలని ఆ లేఖలో మావో జెడాంగ్ బ్రిటన్ లేబర్ పార్టీ నాయకుడు క్లమెంటన్ ను కోరారు. మావో అందులో స్వయంగా సంతకం చేశారు.
అంతర్జాతీయ దౌత్యానికి సంబంధించి మావో రెండు లేఖల మీద మాత్రం అధికారికంగా సంతకాలు చేశారు. ఆ రెండు లేఖల్లో ఇప్పుడు వేలంలో అమ్ముడుపోయిన లేఖ ఒకటి. ఈ లేఖకు తాము రూ. 1.50 కోట్లు వస్తుందని ఆశించామని, అయితే బారీగా స్పందన వచ్చిందని వేలం సంస్థ నిర్వహకులు తెలిపారు. ఈ లేఖను సొంతం చేసుకోవడానికి జపాన్ వ్యాపారవేత్తలు పోటీ పడి చివరికి వెనక్కి తగ్గారు.












Click it and Unblock the Notifications