భార్య కోసం సెక్స్‌టాయ్స్: మహిళ సెక్రటరీతో కొనుగోలు చేయించిన మంత్రి, దర్యాప్తు

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్: మహిళా సెక్రటరీ చేత సెక్స్‌టాయ్స్ కొనుగోలు చేయించడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిటన్‌ మంత్రి మార్క్ గార్నియర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. గార్నియర్‌కు సెక్రటరీగా పనిచేసిన ఓ మహిళ తాను ఎదుర్కొన్న వేధింపులను మీ టూ క్యాంపెయిన్‌లో రాసింది. దీంతో ఈ వ్యవహరం బ్రిటన్ పార్లమెంట్‌ను కుదిపేసింది.

బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రస్తుతం ఈ వ్యవహరం హట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం లైంగిక వేధింపులపై మీ టూ (#metoo) క్యాంపెయిన్ సాగుతోంది. ఏ రకంగా మహిళలు తాము లైంగిక వేధింపులకు గురైందో ఈ క్యాంపెయిన్ ద్వారా వివరిస్తున్నారు.

ఈ క్యాంపెయిన్ ద్వారా ఒక్కొక్కరి బండారం బయటపడుతోంది. ఉన్నత పదవుల్లో ఉన్నవారు కూడ తాము లైంగిక వేధింపులకు గురైన విషయాన్ని ఈ క్యాంపెయిన్‌లో వెల్లడిస్తున్నారు.

సెక్రటరీతో సెక్స్‌టాయ్స్ కొనుగోలు చేయించిన మంత్రి

సెక్రటరీతో సెక్స్‌టాయ్స్ కొనుగోలు చేయించిన మంత్రి

మహిళా సెక్రటరీ చేత బ్రిటన్‌ మంత్రి మార్క్ గార్నియర్‌ సెక్స్‌ టాయ్స్‌ కొనిపించారు. అంతేకాదు ఆమెను లైంగికంగా వేధించిన వ్యవహారం ప్రస్తుతం బ్రిటన్‌ను కుదిపేస్తోంది. థెరిసా మే కేబినెట్‌లో అత్యంత కీలకమైన ‘బ్రెగ్జిట్‌' మంత్రిగా కొనసాగుతున్న మార్క్‌ గార్నియర్‌పై ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు బ్రిటిష్‌ కేబినెట్‌ కార్యాలయం ప్రకటించింది. ప్రపంచాన్ని కుదిపేస్తోన్న ‘మీ టూ(metoo) క్యాంపెయిన్‌లో భాగంగా బాధితురాలు కరోలిన్‌ ఎడ్మండ్‌సన్‌ తన చేదు అనుభవాన్ని వెల్లడించారు.

భార్య కోసం వైబ్రేటర్ తేవాలన్న మంత్రి

భార్య కోసం వైబ్రేటర్ తేవాలన్న మంత్రి

మార్క్‌ గార్నియర్‌ తొలిసారి బ్రిటన్‌ పార్లమెంట్‌ మెంబర్‌గా 2010లో ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఆయనకు సెక్రటరీగా కరోలిన్‌ ఎడ్మండ్‌సన్‌ పనిచేశారు. ''ఓసారి నన్నొక షాప్‌ దగ్గరికి తీసుకెళ్లిన మంత్రి చేతిలో బలవంతంగా డబ్బులు పెట్టి ‘లోపలికెళ్లి రెండు వైబ్రేటర్లు కొనుక్కురా, ఒకటి మా ఆవిడకి, రెండోది నా నియోజకవర్గంలోని ఆఫీసులో ఉండే మహిళకి'' అంటూ చెప్పారని ఆమె గుర్తుచేసుకొన్నారు. అయితే మంత్రి ఆదేశాల మేరకు రెండు సెక్స్‌టాయ్స్‌ను కొనుగోలు చేసి ఆయనకిచ్చినట్టు ఆమె చెప్పారు. ఓ పార్టీలో అందరి ఎదుటే తనను లైంగికదుర్భాషలాడినట్టు ఆమె చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అతని వద్ద ఉద్యోగం మానేశానని అని కరోలిన్‌ గుర్తు చేసుకొన్నారు.

సెక్స్ టాయ్స్ తీసుకురావాలని చెప్పాను

సెక్స్ టాయ్స్ తీసుకురావాలని చెప్పాను

తన వద్ద మహిళా సెక్రటరీగా పనిచేసిన కరోలినాతో సెక్స్ టాయ్స్ తీసుకురమ్మని చెప్పిన మాట వాస్తవమేనని మంత్రి గార్నియర్ ప్రకటించారు. ఆమె చెప్పిన విషయం అబద్ధంకాదంటూనే తాను సచ్ఛీలుడినని మంత్రి ప్రకటించారు. అవును. షాప్‌ నుంచి సెక్స్‌టాయ్స్‌ తెమ్మని ఆమెను పురమాయించిన మాట నిజమే. అయితే ఆమె పట్ల నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. నిజానికి నేనప్పుడు ఆమెతో ప్రమాదరహితంగానే ప్రవర్తించానని ఆయన వివరణ ఇచ్చారు.

కరోలినా ఆరోపణలతో మంత్రిపై విచారణ

కరోలినా ఆరోపణలతో మంత్రిపై విచారణ

బ్రిటన్ మంత్రి గార్నియర్‌పై కరోలిన్‌ వెల్లడించిన విషయాలు బ్రిటన్‌ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తన కేబినెట్‌ మంత్రే కావడంతో ప్రధాని థెరిసా మే తక్షణం స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని బ్రిటన్‌ కేబినెట్‌ కార్యాలయాన్ని ఆదేశించారు. నాటి ఘటనలో మార్క్‌ గార్నియర్‌.. పార్లమెంట్‌ సభ్యుడిగా పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘించారని నిర్ధారణ అయితే గనుక పదవిని కోల్పోయే అవకాశం ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After a Christmastime lunch in 2010, then-British Parliament member Mark Garnier handed his secretary cash and took her to a sex shop in the west end of London. He told her that he wanted her to go inside and purchase two vibrators, one for his wife and another for a woman in his constituency office.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి