ఆ హోటల్‌లో సింహాలు, మొసళ్లు మధ్య టీ తాగాల్సి ఉంటుంది
Recommended Video

అది ఇస్తాంబుల్‌లోని ఓ హోటల్. ఇప్పుడు ఇస్తాంబుల్ ఎందుకు... అందులోని హోటల్ ఎందుకు అనుకోకండి... ఆ హోటల్‌కు ఓ ప్రత్యేకత ఉంది. స్పెషాలిటీ అంటే తినే తిండిలోనో లేకుంటే తాగే ఛాయ్‌లోనే కాదు... ఆ కేఫ్‌లో కూర్చుంటే చాలు అనుకునేవారు చాలామంది ఉన్నారు. ఇంతా చెబుతున్నారు... అసలు ఈ హోటల్ స్పెషాలిటీ ఏమిటనేగా మీ డౌటు.. అక్కడికే వస్తున్నాం....
ఇస్తాంబుల్‌లోని ఓ హోటల్ ఎప్పుడూ హౌజ్‌ఫుల్‌గానే దర్శనమిస్తుంది. అక్కడి కస్టమర్లు ఒక్కసారి హోటల్‌లోకి ఎంటర్ అయ్యారంటే చాలు..ఇక బయటకు వెళ్లేందుకు ఇష్టపడరు. ఇందుకు కారణం... ఆ హోటల్‌లో తిరిగే సింహమే. ఏంటి... షాకయ్యారా... ఇది నిజం. కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు ఆ హోటల్ యాజమాన్యం ఓ చిన్న సింహం పిల్లను తీసుకొచ్చి ఓ గ్లాసు కేబిన్‌లో ఉంచింది. ఇక అక్కడికి వచ్చే కస్టమర్లు సింహాన్ని చూస్తూ టిఫిన్, టీ గట్రా లాగించేస్తుంటారు. అంతేకాదు కొందరు కేవలం ఆ సింహాన్ని చూసేందుకే అక్కడికొచ్చి టీలు తెగతాగేస్తుంటారు. దీంతో ఆ హోటల్ యజమానికి లాభాలే లాభాలట.
ఇక ఆ సింహం కస్టమర్లను చూసి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అయితే అది నడిచేందుకు స్థలం పెద్దగా లేకపోవడంతో దానికి చిర్రెత్తుకొచ్చే అవకాశం లేకపోలేదు. ఇది చిన్న సింహం కాబట్టి కస్టమర్లు కూడా పెద్దగా భయపడరని యజమాని చెబుతున్నాడు. కాల క్రమేణా అది పెద్దదైతే అప్పుడు కస్టమర్లకు తిప్పలు తప్పవని కొందరు కస్టమర్లు చెబుతున్నారు. సింహం ఎప్పుడో పెద్దది అవుతుందికదా అని ఇప్పుడు వచ్చే లాభాలను వదులుకోలేము కదా అని హోటల్ యాజమాన్యం చెబుతోంది.

ఇలా మూగజంతువును బంధించడంపై పలువురు జంతుప్రేమికులు అభ్యతరం కూడా తెలిపారు. దాదాపు 2700 మంది అభ్యంతరం తెలపుతూ పిటిషన్‌పై సంతకాలు కూడా చేశారు. అయితే కేఫ్ యాజమాన్యం మాత్రం ఇందుకు లైసెన్స్ తీసుకున్నట్లు చెబుతోంది. జంతువుల సంరక్షణ కేంద్రం అని కూడా చెబుతోంది. ఎందుకంటే ఇందులో ఆ బుల్లి సింహంతో పాటు 35 కుందేళ్లు, ఫ్లెమింగోలు, నాలుగు పాములు, నాలుగు గుర్రాలు, రెండు చిలకలు, రెండు మొసళ్లు ఆ హోటల్‌లో ఉన్నాయి.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications