ఆ ఇంట్లో బయటపడ్డ వందల గోల్డ్ కాయిన్స్.. అసలేంటి మ్యాటర్..?

ఇల్లు రిపేరు చేయాలని భావించిన ఓ జంట, ఇంటిని రిపేర్ చేస్తున్న క్రమంలో వారి జీవితాన్ని మార్చేసిన సంఘటన జరిగింది. బ్రిటన్లోని జంటకు వంటగది ఫ్లోర్ క్రింద నిధి బయటపడింది. వంటగదిలో తవ్వి చూస్తే ఏకంగా 264 బంగారు నాణేలు కనిపించడంతో ఒక్కసారిగా ఆ జంట ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే నార్త్ యార్క్‌షైర్ కు చెందిన ఈ జంట ఎల్లెర్బీ గ్రామంలో ఉన్న తమ పాత ఇంటిని రిపేరు చేయాలనుకున్నారు.

వంటగది తవ్వి చూస్తే .. పట్టరాని ఆనందం

వంటగది తవ్వి చూస్తే .. పట్టరాని ఆనందం


గత పది సంవత్సరాలుగా అదే ఇంట్లో జీవనం ఉంటున్న ఈ జంట, ఇంటి ఆధునీకరణ పనులలో భాగంగా కిచెన్లో ఫ్లోర్ బోర్డు తొలగించగా ఒక ఐరన్ క్యాన్ లో భద్రంగా ఉన్న బంగారు నాణాలు కనిపించాయి. దీంతో వారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. మొదటి గట్టిగా తగలడంతో ఏదైనా విద్యుత్ వైర్ అయి ఉంటుందని దంపతులు భావించారు. అయితే మరికాస్త తప్పుగా అందులో ఒక ఐరన్ క్యాన్ అనిపించింది. ఆశ్చర్యపోయిన దంపతులు ఆ క్యాన్ లో ఏముందో తెరిచి చూడగా వారికి బంగారు నాణాలు దర్శనమిచ్చాయి. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

2.3 కోట్ల రూపాయల విలువైన 400ఏళ్ళ కాలంనాటి బంగారు నాణేలు

2.3 కోట్ల రూపాయల విలువైన 400ఏళ్ళ కాలంనాటి బంగారు నాణేలు


దంపతులు 250,000 పౌండ్ల విలువచేసే, భారతీయ కరెన్సీలో 2.3 కోట్ల రూపాయల విలువైన ఈ పురాతన బంగారు నాణేలను విక్రయించాలని నిర్ణయించుకున్నారు. 400 సంవత్సరాల కంటే పాతదిగా నివేదించబడిన ఈ నాణేలు వేలం ద్వారా విక్రయించబడతాయని చెప్తున్నారు. ఇక ఈ వేలం పాటను నిర్వహించడానికి వారు ఓ వేలం నిర్వహణా సంస్థను కూడా సంప్రదించారు. దీంతో స్పింక్ & సన్ సంస్థ వేలం నిర్వహిస్తుంది.

నాణేలు ఒకటో జేమ్స్, ఒకటో చార్లెస్ కాలం నాటివని అంచనా

నాణేలు ఒకటో జేమ్స్, ఒకటో చార్లెస్ కాలం నాటివని అంచనా

ఇక ఈ నాణేలపై 1610- 1727 నాటి ముద్రలు ఉండటంతో ఇవి 18 వ శతాబ్దానికి చెందిన నాణాలు గా భావిస్తున్నారు. ఈ నాణేలు ఒకటో జేమ్స్ , ఒకటో చార్లెస్ కాలం నాటివని అంచనా వేస్తున్నారు. అప్పట్లో ఎవరైనా వాణిజ్య ప్రముఖుడి కుటుంబానికి సంబంధించిన నాణేలు అయి ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నాణేలు బయటపడడం అరుదైన సంఘటనగా స్థానికులు భావిస్తున్నారు. ఇక 18 వ శతాబ్దం నాటి బంగారు నాణేలు వేలానికి రావడం కూడా అరుదని చెబుతున్నారు.

తాజాగా మధ్యప్రదేశ్ లోనూ పాత ఇల్లు కూలుస్తుంటే బయటపడ్డ బంగారునాణేలు

తాజాగా మధ్యప్రదేశ్ లోనూ పాత ఇల్లు కూలుస్తుంటే బయటపడ్డ బంగారునాణేలు

ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆగస్టులో మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో 86 బంగారు నాణేలు బయటపడ్డాయి. మధ్యప్రదేశ్‌లో పాత ఇంటిని కూల్చివేస్తున్న సమయంలో ఎనిమిది మంది కూలీలు తమకు దొరికిన సుమారు 60 లక్షల రూపాయల విలువైన 86 బంగారు నాణేలను గుట్టు చప్పుడు కాకుండా పంచుకున్నారు .కార్మికులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పురావస్తు ప్రాముఖ్యత కలిగిన బంగారు నాణేలను తమలో తాము పంచుకున్నారు. ఈ విషయం బయటకు రావడంతో ఆ తర్వాత వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి దాదాపు కిలో బరువున్న బంగారు నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+