Weaponising Coronaviruses: 2015లోనే చైనా సైంటిస్టుల రీసెర్చ్ డాక్యుమెంట్: మూడో ప్రపంచయుద్ధంగా
వాషింగ్టన్: నిజం నిలకడ మీద తేలుతుందంటుంటారు. ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి పుట్టుక విషయంలో ఇది మరోసారి రుజువు అవుతోంది. చైనా గుట్టు రట్టవుతోంది. చైనాలో వుహాన్ ల్యాబొరేటరీలో కరోనా వైరస్‌ను సృష్టించారనడానికి మరో కీలక సాక్ష్యాధారాలు వెలుగులోకి వచ్చినట్లు పలు విదేశీ మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. ఈ మహమ్మారిని కృత్రిమంగా సృష్టించారంటూ ఇదివరకు వెల్లువెత్తిన ఆరోపణలు, అనుమానాలకు మరింత బలాన్ని కలిగించేలా ఉన్నాయవి.
Recommended Video

2015లో డాక్యుమెంట్
భవిష్యత్తులో యుద్ధాలు చేయాల్సి వస్తే కరోనా వంటి భయానక వైరస్‌లను సృష్టించి, వాటిని జీవాయుధాలుగా మార్చుకోవాల్సి ఉంటుందనే విషయంపై చైనా సైంటిస్టులు భావించారు. దీనిపై ఓ సమగ్ర డాక్యుమెంట్‌ను రూపొందించారు. న్యూ ఎరా ఆఫ్ జెనెటిక్స్ వెపన్స్ అనే అంశంపై వారు ఈ రీసెర్చ్ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. మనుషులకు తీవ్ర అనారోగ్యానికి గురి చేసే వైరస్‌లను కృత్రిమంగా సృష్టించాల్సి ఉంటుందని చైనా మిలటరీ సైంటిస్టులు స్పష్టం చేసినట్లు వీకెండ్ ఆస్ట్రేలియా ప్రచురించింది. సార్స్ కరోనా వైరస్ రూపంలో బయో వెపన్ తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

అన్ నేచురల్ బయో వెపన్
అన్ నేచురల్ ఆరిజిన్ ఆఫ్ సార్స్ అండ్ న్యూ స్పీసిస్ ఆఫ్ మ్యాన్ మేడ్ వైరసెస్ యాజ్ జెెనెటిక్స్ బయోవెపన్స్ పేరుతో ఈ రీసెర్చ డాక్యుమెంట్‌ను చైనా సైంటిస్టులు రూపొందించారని ఆస్ట్రేలియాలకే చెందిన మరో న్యూస్ పోర్టల్ పేర్కొంది. ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీటర్ జెన్నింగ్స్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిపింది. చైనా సైంటిస్టులు కృత్రిమంగా కరోనా వైరస్‌ను సృష్టించారనేది తేలిపోయిందని పేర్కొన్నారు. కరోనా పుట్టుకపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి కొన్ని అంతర్జాతీయ సంస్థలు వుహాన్‌లో దర్యాప్తు చేపట్టడానికి చైనా అంగీకరించకపోవడానికి ఇదే ప్రధాన కారణమని అన్నారు.

2003 నాటి సార్స్ తరహాలో
2003లో చైనాను వణికించిన సార్స్ తరహా వైరస్‌ను కృత్రిమంగా సృష్టించాల్సి ఉంటుందనే విషయాన్ని రీసెర్చ్ డాక్యుమెంట్‌లో పొందుపరిచినట్లు వీకెండ్ ఆస్ట్రేలియన్ తెలిపింది. గతంలో ఎప్పుడూ లేనంత శక్తిమంతంగా వైరస్‌ను సృష్టించడం ద్వారా జీవాయుధాల్లో కొత్త కొత్త శకానికి నాంది పలికినట్టవుతుందనే విషయాన్ని చైనా సైంటిస్టులు ఇందులో ప్రధానంగా ప్రస్తావించారని పేర్కొంది. దీన్ని ల్యాబుల్లో కృత్రిమంగా మానిప్యులేట్ చేయవచ్చని, భౌగోళికంగా వుహాన్‌లోని ప్రభుత్వ ల్యాబొరేటరీని వినియోగించుకోవచ్చని చైనా సైంటిస్టులు అభిప్రాయపడినట్లు స్పష్టం చేసింది.

డాక్యుమెంట్లు ఫేక్ కాదంటూ..
ఆస్ట్రేలియన్ ప్రచురంచిన డాక్యుమెంట్లు నకిలీవి కాదంటూ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ రాబర్ట్ పాట్టేరి ధృవీకరించారు.. వాటిని తాను అన్ని కోణాల్లోనూ విశ్లేషించానని, అవి ఫేక్ డాక్యుమెంట్స్ కావని నిర్దారనకు వచ్చినట్లు తెలిపారు. ఈ డాక్యుమెంట్లను ధ్వంసం చేయడానికి చైనా ప్రయత్నించి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. వైరస్ పుట్టుకొచ్చిన తరువాత.. చైనా వ్యవహరించిన తీరు సైతం ప్రపంచ దేశాలకు అనేక అనుమానాలను రేకెత్తించిందని చెప్పారు. విదేశీ నిపుణులను వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీని సందర్శించడానికి చైనా అంగీకరించకపోవడం ఓ ప్రధాన కారణహని చెప్పారు.
ఈ ఇన్‌స్టిట్యూట్‌కు సమీపంలో ఉండే హ్యూనన్ సీ ఫుడ్ మార్కెట్ ద్వారా వ్యాప్తి చేయాలని ముందే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందని అన్నారు.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications