వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు బంగారం టాయిలెట్ బహుకరించాలని గుగ్గెనైమ్ మ్యూజియం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు న్యూయార్క్ లోని గుగ్గెన్హైమ్ మ్యూజియం నిర్వాహకులు గోల్డెన్‌ టాయిలెట్‌నే బహుకరించనున్నారు.అధ్యక్షుడు, తొలి మహిళ తాము నివసించే ప్రైవేట్‌ గదిలో 19వ శతాబ్దపు విన్సెంట్ వాన్ గోగ్ అనే పేయింటర్‌ చిత్రీకరించిన ''ల్యాండ్‌స్కేప్‌ విత్‌ స్నో'' పేయింటింగ్‌ను పెట్టుకోవాలని ఆశించారు.ఆ పెయింటింగ్‌కు బదులుగా గొల్డెన్ టాయిలెట్‌ను ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ ఈ కథనాన్ని ప్రచురించింది. మ్యూజియం చీఫ్‌ క్యూరేటర్‌ ఈ టాయిలెట్‌ను అందిస్తున్నారని, ఇప్పటి వరకు ఈ టాయిలెట్‌ను వేలాది మంది సందర్శకులు వాడారని తెలిసింది.

A golden idea? Museum offered 18-karat gold toilet to Trump: report

దీనిపై గుగ్గెన్హైమ్ మ్యూజియం అధికార ప్రతినిధి కానీ వైట్‌హౌజ్‌ అధికారులు కానీ స్పందించడానికి నిరాకరించారు. అయితే ఆర్థిక అసమానతలను రూపుమాపడమే ఇతివృత్తంగా మారాజియో కాటలెన్‌ అనే కళాకారుడు 18 క్యారెట్ బంగారంతో ఈ టాయిలెట్‌ను రూపొందించారు. విలాసవంతమైన రూపం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతోనే దీన్నిమ్యూజియం లోని యూనిసెక్స్ బాత్రూంలో 2016లో ఏర్పాటు చేశారు.

English summary
New York’s Guggenheim Museum offered to lend an 18-karat gold toilet to President Donald Trump after the White House asked to borrow a painting by Vincent Van Gogh, the Washington Post reported on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X