దట్టమైన అడవులు, ప్రతికూల వాతావరణం: ఇరాన్ కీలక ప్రకటన
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ పెను ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఎంతమంది మరణించారనేది ఇంకా తెలియరాలేదు. రైసీ- ప్రాణాలో ఉన్నారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కావట్లేదు. ఈ ఘటనతో ఇరాన్ ఉలిక్కి పడింది. ఆయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటోన్నట్లు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు సందేశాలు పంపించారు.
ఇరాన్- అజర్‌బైజాన్ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఓ డ్యామ్ ప్రారంభోత్సంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇబ్రహీం రైసీ. డ్యామ్ ప్రారంభోత్సవం ముగిసిన తరువాత హెలికాప్టర్‌లో రాజధాని టెహ్రాన్‌కు తిరుగుముఖం పట్టారు.

ఈస్ట్ అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని వర్జాఖాన్- జోల్ఫా మధ్య విస్తరించి ఉన్న దట్టమైన డిజ్మర్ అడవుల మీదుగా హెలికాప్టర్ ప్రయాణిస్తోన్న సమయంలో అది కుప్పకూలింది. ఆ సమయంలో హెలికాప్టర్‌లో ఇబ్రహీం రైసీతో పాటు, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హొస్సైన్ అమీరబ్దుల్లాహియాన్, ఈస్ట్ అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, వారి భద్రత సిబ్బంది ఉన్నారు.
దట్టమైన పొగమంచు వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ఇరాన్ హోం మంత్రి అహ్మద్ వహీదీ తెలిపారు. పొగమంచు, ప్రతికూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పైలెట్.. హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎంతమంది జీవించి ఉన్నారనేది ఇప్పుడే వెల్లడించలేమని చెప్పారు.
ఇరాన్-అజర్‌బైజాన్ సరిహద్దుల్లో విసర్తించి ఉన్న డిజ్మర్ అడవుల మధ్య ప్రమాదం సంభవించడం వల్ల సహాయక, భద్రత సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకోలేకపోతున్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన స్థలాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. ఫలితంగా సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం నెలకొంది.
Akinci UAV identifies source of heat suspected to be wreckage of helicopter carrying Iranian President Raisi and shares its coordinates with Iranian authorities pic.twitter.com/0tZtMc5oaP
— Anadolu English (@anadoluagency) May 20, 2024
మొత్తంగా 40 రెస్క్యూ టీమ్‌లను డిజ్మర్ అడవుల్లో హెలికాప్టర్ ఆచూకీ కోసం పంపించినట్లు ఇరాన్ రెడ్ క్రీసెంట్ సొసైటీ అధ్యక్షుడు పిర్ హొస్సైన్ కౌలివాండ్ తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, హెలికాప్టర్ ప్రమాదానికి గురైన స్థలాన్ని అంచనా వేయలేకపోవడం వల్ల సహాయక చర్యల్లో జాప్యం నెలకొంటోందని పేర్కొన్నారు.
ఈ దుర్ఘటనపై అటు టర్కీ స్పందించింది. యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ టీమ్‌ను ఇరాన్‌కు పంపించింది. డ్రోన్లతో హెలికాప్టర్ గాలింపు చర్యలు చేపట్టింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమర్చిన డ్రోన్లు అవి. డిజ్మర్ అడవుల నుంచి పొగ, మంటలు రావడాన్ని ఈ డ్రోన్లు గుర్తించినట్లు టర్కీకి చెందిన అనడోలు న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.












Click it and Unblock the Notifications