పాకిస్థానీ హిందూ వైద్యుడిని కాల్చి చంపేశారు: నెలలో రెండో ఘటన

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో మైనార్టీలైన హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ ప్రముఖ వైద్యుడిని దారుణంగా హత్య చేశారు. డాక్టర్ బీర్బల్ జెనానీని కరాచీలోని సింద్ లియారీ ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో దుండగులు కాల్చి చంపారు. ఈయన గతంలో కరాచీ మున్సిపల్ కార్పొరేషన్ డైరెక్టర్‌‌గా కూడా పనిచేశారు.

దుండగుల కాల్పుల్లో మరో మహిళా డాక్టర్ కూడా గాయపడ్డారు. ఏఆర్‌వై న్యూస్ ప్రకారం.. గార్డెన్ లియారీ ఎక్స్‌ప్రెస్‌‌వేపై గుర్తు తెలియని దుండగులు బీర్బల్ జెనానీ ప్రయాణిస్తున్న వాహనంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బీర్బల్ మరణించగా.. ఆయనతోపాటు ఉన్న మరో వైద్యురాలు ఖురతుల్ ఐన్ గాయపడ్డారు.

A Hindu Doctor Shot Dead In Karachi, Pakistan, Murder Caught On Camera

దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీర్బల్ జెనానీని లక్ష్యంగా చేసుకుని దుండుగలు ఈ కాల్పులు జరిపినట్లు గుర్తించారు. ఈ దాడి వార్తను పాకిస్థానీ జర్నలిస్ట్ యుస్రా అస్కారీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.బీర్బల్ మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కాగా, కాల్పుల్లో ఖురతుల్ ఐన్ అనే మహిళా వైద్యురాలు భుజానికి బుల్లెట్ తగిలింది. ఆమెను చికిత్స నిమిత్తం సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం డాక్టర్ జెనానీ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

కాగా, ఈ నెలలో పాకిస్థాన్లో హిందూ వైద్యుడిపై దాడి జరగడం ఇది రెండోసారి.
ఇంతకుముందు పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌కు చెందిన వైద్యుడిని ఆయన ఇంట్లోనే అతని డ్రైవర్ హత్య చేశాడు. డాక్టర్ ధరమ్ దేవ్ రాఠి గొంతుకోసి హత్య చేశాడు డ్రైవర్. దీంతో నిందితుడైన డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+