వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూమికి అతి సమీపంలో తిరుగుతున్న భారీ రాతి ముక్క.. ఇది చంద్రుడిదేనా? మరి ఎర్రగా ఎందుకు ఉంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చంద్రుడి నుంచి విరిగిన ఆస్టరాయిడ్

భూమికి అతి సమీపంలో ఉన్న ఓ ఆస్టరాయిడ్.. నిజానికి చంద్రుడి నుంచి వేరైన ఓ రాతి ముక్క కావచ్చునని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

కామో ఓలేవా అని పేరు పెట్టిన ఆ ఆస్టరాయిడ్.. భూమికి సమీపంగా ఉండి, కక్ష్యలో సూర్యుడి చుట్టూ తిరుగుతోంది.

అయితే ఇది భూమికి రెండో చందమామ అనేంత పెద్దది కాదు. కానీ ఇది భూమి వెంట విశ్వంలో ప్రయాణించే తీరును బట్టి దీనిని పాక్షిక ఉపగ్రహంగా కూడా పరిగణిస్తున్నారు.

భూమికి ఐదు పాక్షిక ఉపగ్రహాలున్నాయి. కానీ వాటిలో కామో ఓలేవా భిన్నమైనది. ఇది చంద్రుడి ఉపరితలం నుంచి విరిగిన ముక్క అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఎరుపు రంగులో ఎందుకు ఉంది?

చంద్రుడి రాయి మామూలుగా తెల్లగా కనిపిస్తుంది. కానీ ఈ ఆస్టరాయిడ్‌ అనూహ్యంగా ఎరుపు రంగులో ఉన్నట్లు దీనిని పరిశీలిస్తున్న నిపుణులు గుర్తించారు.

''ఇది మిగతా ఆస్టరాయిడ్‌ల లాగా కనిపించటం లేదు’’ అని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా శాస్త్రవేత్త బెంజమిన్ షార్కీ చెప్పారు.

''ఇది చంద్రుడి నుంచి వచ్చినట్లు మేం భావిస్తున్నాం’’ అని అదే యూనివర్సిటీకి చెందిన డాక్టర్ విష్ణు రెడ్డి తెలిపారు.

ఆస్టరాయిడ్లు ఎరుపు రంగులో ఉండటం అసాధారణమేమీ కాదు. ఆ రంగులో ఉంటే అందులో లోహం ఉన్నట్లు అర్థం.

కానీ కామో ఓలేవాకు సంబంధించిన టెలిస్కోప్ ఫొటోలను విశ్లేషించినపుడు.. 1970లలో అపోలో మిషన్ల ద్వారా చంద్రుడి మీద నుంచి తెచ్చిన రాతి నమూనాలు మాత్రమే అంతరిక్షంలో ఈ తరహా రాయితిని పోలి ఉన్నట్లు పరిశోధక బృందం గుర్తించింది.

ఆరిజోనాలోని లోవెల్ అబ్జర్వేటరీలో గల శక్తిమంతమైన టెలిస్కోప్‌ను పరిశోధకులు ఉపయోగించారు

90 లక్షల మైళ్ల దూరంలో...

ఈ ఆస్టరాయిడ్ భూమిని అనుసరిస్తూ ప్రస్తుత కక్ష్యలో మరో 300 సంవత్సరాల పాటు కొనసాగుతుందని భావిస్తున్నారు.

భూమికి సుమారు 90 లక్షల మైళ్ల దూరంలో ఉన్న ఈ ఆస్టరాయిడ్.. భూమి నుంచి 2,39,000 మైళ్ల దూరంలోని చంద్రుడి కన్నా చాలా దూరంగా ఉన్నప్పటికీ.. అంతరిక్ష పరంగా చూస్తే చాలా దగ్గరగా ఉన్నట్లే. అయినప్పటికీ కామో ఓలేవాను సరిగా విశ్లేషించటం శాస్త్రవేత్తలకు కష్టంగానే ఉంది.

ఈ అంతరిక్ష శిల దాదాపు ఓ భారీ జెయింట్ వీల్ పరిమాణంలో ఉంది. రాత్రి ఆకాశంలో చాలా అస్పష్టంగా కనిపిస్తుంది. అతి సూక్ష్మంగా కనిపించే నక్షత్రం కన్నా దాదాపు 40 లక్షల రెట్లు నల్లగా కనిపిస్తుంది.

కామో ఓలేవా అంటే అర్థమేమిటి?

కామో ఓలేవా అనేది ఓ హవాయీ పదం. 'ఊగిసలాడే అంతరిక్షపు తునక’ అని దీనికి అర్థంగా చెప్పొచ్చు.

ఈ ఆస్టరాయిడ్‌ను వీక్షించటానికి శాస్త్రవేత్తలు ఆరిజోనాలో గల రెండు శక్తిమంతమైన టెలిస్కోపులను ఉపయోగించారు. ఇది ప్రతి ఏప్రిల్ నెలలో కొన్ని వారాల పాటు మాత్రమే కనిపిస్తుంది.

ఈ ప్రాజెక్టు 2016లో మొదలైంది. కానీ కరోనావైరస్ ఆంక్షల కారణంగా 2020లో ఈ ఆస్టరాయిడ్‌ను పరిశీలించే అవకాశం శాస్త్రవేత్తలకు లభించలేదు.

ఇప్పుడు మరింత పరిశోధన అనంతరం.. ఈ అంతరిక్ష శిల నిజానికి చంద్రుడి నుంచి విరిగిపోయిన ముక్క అని కొంత రూఢిగా చెప్పగలిగారు.

''మా అంచనాలపై మాకే సందేహాలుండేవి’’ అని డాక్టర్ రెడ్డి చెప్పారు. ''ఈ వసంత కాలంలో అవసరమైన పరిశోధనలు చాలా చేశాం. 'వావ్.. మేం అనుకున్నది నిజమే’ అని ఆశ్చర్యపోయాం’’ అని షార్కీ వివరించారు.

''ఇది చంద్రుడి నుంచి ఎప్పుడు విడిపోయింది, చంద్రుడిలో ఏ ప్రాంతం నుంచి విరిగిపోయింది అనేది గుర్తించటం చాలా పెద్ద పని. ఈ శిల నుంచి ఒక శాంపిల్‌ను తెస్తేనే ఆ పని చేయగలం’’ అని డాక్టర్ రెడ్డి తెలిపారు.

ఈ ఆస్టరాయిడ్ మీదకు.. 2020 దశకం మధ్య నాటికి ఒక మిషన్‌ను పంపాలని చైనా అంతరిక్ష సంస్థ ప్రణాళిక రచించింది.

జవాబు దొరకాల్సిన మరో ప్రశ్న కూడా ఉంది: ముందసలు ఈ ఆస్టరాయిడ్ చంద్రుడి నుంచి ఎందుకు విరిగిపోయింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
A huge piece of rock orbiting very close to the earth .. Is it the moon? Why is it so red?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X