ట్యునీషియాలో రైలు, ట్రక్ ఢీకొని 15 మంది దుర్మరణం
ట్యునిస్: వేగంగా వెళుతున్న రైలు, పెద్ద ట్రక్ ఢీకొనడంతో 15 మంది ప్రయాణికులు దుర్మరణం చెందిన సంఘటన ట్యునిషియా రాజధాని ట్యునిస్ సమీపంలో జరిగింది. ట్యునిషియా దేశంలోనే ఇంత పెద్ద రైలు ప్రమాదం ఎప్పుడు జరగలేదని స్థానిక మంత్రి అంటున్నారు.
మంత్రి తెలిపిన కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మంగళవారం ట్యునిస్ నుండి గఫొర్ నగరానికి రైలు బయలుదేరింది. రైలులో ప్రయాణికులు రద్ది ఎక్కువగా ఉంది. ట్యునిస్ నుండి బయలుదేరిన రైలు 60 కిలో మీటర్ల దూరం వెళ్లింది.

ఆ సమయంలో అటువైపు వెళుతున్న లాంగ్ ట్రక్ వేగంగా వెళ్లి రైలును డీకొనింది. ఈ ప్రమాదంలో 14 మంది రైలు ప్రయాణికులు సంఘటనా స్థలంలో, ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మరో ప్రయాణికుడు దుర్మరణం చెందారని అధికారులు తెలిపారు.
రైలు వేగంగా వెళుతున్నదని, ట్రక్ డ్రైవర్ వాహనం వేగంగా నడిపాడని అధికారులు అన్నారు. ఈ ప్రమాదంలో సుమారు 70 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలైనాయి. అందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications