Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం..
ఇండోనేషియాలోని బాలి, లాంబాక్ దీవులకు ఉత్తరాన సముద్రంలో మంగళవారం తెల్లవారుజామున 7.0 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. భూకంపంతో ప్రజలు భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రం ఇండోనేషియాలోని మాతరానికి ఉత్తరంగా 203 కి.మీ (126 మైళ్లు) దూరంలో, భూమి ఉపరితలం నుండి 516 కి.మీ దిగువన చాలా లోతుగా ఉందని EMSC తెలిపింది.
ఇండోనేషియా, యుఎస్ జియోలాజికల్ ఏజెన్సీలు సునామీ ముప్పు లేదని పేర్కొన్నాయి. భూకంప తీవ్రతన్ 7.1గా పేర్కొన్నాయి. ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ ప్రకారం, బాలి, లాంబాక్‌లోని తీర ప్రాంతాలలో తెల్లవారుజామున 4 గంటలకు (2000 GMT) భూకంపం సంభవించింది.దాని తర్వాత 6.1 మరియు 6.5 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి. బాలి మెర్క్యూర్ కుటా బాలిలోని పర్యాటకులు కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు అనుభవించిన తర్వాత వారి గదుల నుంచి బయటకు పరుగులు తీశారని ఓ హోటల్ మేనేజర్ సుయాది ఫోన్ ద్వారా రాయిటర్స్‌తో చెప్పారు.

"చాలా మంది పర్యాటకులు తమ గదులను విడిచిపెట్టారు కానీ హోటల్ ప్రాంతంలోనే ఉన్నారు" అని అతను చెప్పాడు. భూకంపం అనంతరం వారు తిరిగి వచ్చారని పేర్కొన్నాడు. భవనానికి ఎటువంటి నష్టం జరగలేదని వివరించాడు. భూకంపం వల్ల ఆస్తి నష్టం పై సమాచారం లేదని ఇండోనేషియా విపత్తు ఏజెన్సీ BNPB తెలిపింది. "భూకంపం లోతుగా ఉంది కాబట్టి ఇది విధ్వంసం కాకూడదు" అని BNPB ప్రతినిధి అబ్దుల్ ముహారి అన్నారు.
అయితే ఇండోనేషియాలో తరుచూ భూకంపాలు వస్తుంటాయి. రెండు వారాల క్రితం కూడా అక్కడ భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని మలుకు ప్రావిన్స్‌లోని టువల్ అనే నగరానికి 142 కి.మీ దూరంలో భూకంపం సంభవించింది. 270 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా కలిగిన ఇండోనేషియాలో అగ్నిపర్వతాలు, సునామీలు, భూకంపాలు వంటి విపత్తులు తరచూ వస్తుంటాయి.












Click it and Unblock the Notifications