షాక్: కొడుకు, కూతురితో వివాహం, లైంగిక సంబంధాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమ్మను మించిన దైవం లేదని ఓ కవి చెప్పాడు. అయితే మాతృత్వానికి మచ్చ తెచ్చే పనికి అమెరికాకు చెందిన ఓ మహిళ పాల్పడింది. కొడుకు, కూతురును వివాహం చేసుకొంది. బాలల హక్కుల కార్యకర్త ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగు చూసింది.

మాతృత్వానికి మచ్చ తెచ్చేలా అమెరికాకు చెందిన మహిళ పాట్రికా స్పాన్ వ్యవహరించింది. వావి వరసులు మరిచి శారీరక సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా వారితో వివాహం చేసుకోవడం కూడ సభ్య సమాజం తలదించుకొనేలా వ్యవహరించింది. బాలల హక్కుల కార్యకర్త ఫిర్యాదుతో ఈ కేసులో నిందితురాలు జైలు ఊచలు లెక్కిస్తోంది.

పిల్లలు పుట్టగానే భర్తతో విడాకులు

పిల్లలు పుట్టగానే భర్తతో విడాకులు

అమెరికా ఓక్లహమాలోని డంకన్‌లో పాట్రికాస్పాన్ మాతృత్వానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించింది.పాట్రికా స్పాన్‌ దాదాపు రెండున్నర దశాబ్దాల కింద ఓ వ్యక్తిని వివాహం చేసుకోగా ఓ కూతురు, ఇద్దరు కుమారులు సంతానం కలిగారు. పిల్లలకు ఊహ తెలియని వయసులోనే భర్త నుంచి పాట్రికా విడాకులు తీసుకోగా.. ఆ పిల్లల ను నానమ్మ ముగ్గురిని దత్తత తీసుకుని వారిని పోషిస్తోంది.

కొడుకుతో రహస్య వివాహం

కొడుకుతో రహస్య వివాహం

ఆరేళ్ల కిందట 18 ఏళ్లున్న తన పెద్ద కొడుకును రహస్యంగా పాట్రికా వివాహం చేసుకుంది. మ్యారేజ్ లైసెన్స్‌లో వరుడు కుమారుడును పేరును పెట్టింది. అయితే ఆ సమయంలో వరుడు తనకు కొడుకు అవుతాడనే విషయాన్ని పాట్రికా దాచేసింది. కుమారుడితో వివాహం అనంతరం శారీరక సంబంధం పెట్టుకున్న పాట్రికా.. కొంతకాలం తర్వాత అతడికి దూరంగా ఉంటోంది.

కూతురితో శారీరక సంబంధాలు

కూతురితో శారీరక సంబంధాలు

ఓక్లహామాలోని డంకన్‌లో పాట్రికా స్పాన్ (44), తన కూతురు మిస్టీ స్పాన్ తో కలిసి జీవిస్తోంది. కానీ వీరి సంబంధంపై స్థానికులు బాలల హక్కుల కార్యకర్తకు గతేడాది సెప్టెంబర్‌లో సమాచారం అందించారు. ఆ కార్యకర్త దీనిపై ఆరాతీయగా.. 2016 మార్చి నెలలో తల్లి పాట్రికా, కూతురు మిస్టీని ఒప్పించి వివాహం చేసుకున్నట్లు తెలిసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తల్లీకూతురును అరెస్ట్ చేశారు. తొలుత తల్లీకూతురు వివాహం కేసులో వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష పడింది. ఇందులో తన తప్పులేదని కోర్టుకు విన్నవించుకోవడంతో కూతురు మిస్టీని రెండేళ్లపాటు కస్టడీకి ఆదేశించింది.

చట్టానికి లోబడే వివాహం

చట్టానికి లోబడే వివాహం

పాట్రికాపై నమోదైన కేసులపై 2018 జనవరిలో కోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. అయితే కూతురు మిస్టీతో చట్టానికి లోబడే వివాహం చేసుకున్నానని నిందితురాలు పాట్రికా వాదిస్తోంది. కూతురు, తల్లి వివాహం చేసుకొన్న ఘటనపై విచారణ చేస్తున్న సమయంలోనే అంతకుముందే కొడుకుతో వివాహం చేసుకొని శారీరక సంబంధాన్ని పాట్రికా కొనసాగించిన విషయం పోలీసులు గుర్తించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Patricia and Misty Spann were married on March 26, 2016.Court records say Patricia Spann had convinced Misty Spann that their marriage was legal — even though they’re biologically related. Patricia, 44, is Misty’s mother.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి