Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యువతిపై మరిగేనీళ్లు పోసి, వెయిటర్ దాడి(వీడియో)

బీజింగ్: ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేసే ఓ యువకుడు అక్కడి సర్వీసు బాగాలేదని ఫిర్యాదు చేసిన ఓ యువతిపై మరిగే నీళ్లు పోసి తన పైశాచికాన్ని చాటుకున్నాడు. అంతేగాక, ఆమెపై దాడి చేశాడు. చైనాలోని జీజాంగ్‌ ప్రావిన్స్‌లోని వెన్జూ ప్రాంతంలో ఉన్న మిస్టర్‌ హాట్‌పాట్‌ అనే రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రస్తుతం ఆమె ఇంటెన్సివ్‌కేర్‌లో చికిత్స పొందుతుండగా, అతను జైలుపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. లిన్(29)అనే యువతి కుటుంబంతో కలిసి ఆ రెస్టారెంట్‌కి భోజనానికి వెళ్లింది.

భోజనం ఆర్డర్‌ చేసిన అనంతరం తాగడానికి నీళ్లు తగినన్ని లేవని ఓ వెయిటర్‌కి ఫిర్యాదు చేసింది. ఆ విషయమై ఇద్దరికీ మాటా మాటా పెరిగింది. హోటల్‌లో సర్వీసు బాగా లేదని మిగిలిన కస్టమర్లకు విన్పించేలా ఆమె గట్టిగా రెస్టారెంట్‌ సిబ్బందికి ఫిర్యాదు చేసింది.

అంతేగాక, అప్పటికప్పుడు అక్కడి సామాజిక మాధ్యమం వైబోలో ఆ విషయాన్నంతా పోస్ట్‌ చేసింది. రెస్టారెంట్‌, వెయిటర్‌ పేర్లనూ అందులో పేర్కొంది.

దీంతో ఆగ్రహానికి గురైన 17ఏళ్ల ఆ వెయిటర్ వేడి వేడి నీళ్లు తెచ్చి లిన్‌పై కుమ్మరించాడు. అంతటితో ఆగకుండా, ఆమెను కింద పడేసి చితకబాదాడు.

అనంతరం పారిపోయే ప్రయత్నం చేస్తుండగా వెయిటర్‌ని ఇతర కస్టమర్లు దొరకబట్టి చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. కాగా, లిన్‌కి 40 శాతం కాలిన గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+