ఘోర విషాదం.. మయన్మార్‌లో భారీ భూకంపానికి 20 మంది మృతి.. శిథిలాల కింద 43 మంది..?
భారీ భూకంపం మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలను తీరని విషాదంలో నింపుతోంది. ఈరోజు 12గం.50ని సమయంలో మయన్మార్‌లో తొలుత భూమి భారీగా కంపించింది. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే మరోసారి కంపించింది. మొదటిసారి రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో.. రెండోసారి 6.4 తీవ్రత నమోదైంది. అలానే థాయ్‌లాండ్ ఉత్తర భాగం మొత్తం భూకంపంతో వణికిపోయింది. రాజధాని బ్యాంకాక్‌లో 7.3 తీవ్రతతో భూమి కంపించడంతో భవనాలు ఊగిపోయాయి. భూకంపం ధాటికి జనం ప్రాణ భయంతో హాహాకారాలు చేస్తూ రోడ్ల మీదకు పరుగులు పెడుతున్నారు. బిల్డింగులు కూలిపోయిన వీడియోలు, జనాలు పరుగులు పెడుతున్న దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
భూ ప్రకంపనల ధాటికి భారీ బిల్డింగులు సైతం ఊగిపోయి కుప్పకూలగా.. భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా మరోసారి భూకంపం వచ్చే అనుమానంతో అధికారులు భవనాల నుంచి జనాల్ని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక మయన్మార్ లోని స్థానిక మీడియా సమాచారం మేరకు భూకంపం ధాటికి ఇప్పటివరకు 20మంది మృతిచెందినట్లు పేర్కొంది.

మయన్మార్ లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం పేకమేడలా కూలిన దృశ్యాలు బయటికొచ్చాయి. ప్రమాదం సమయంలో ఆ భవనంలో ఎవరైనా కార్మికులు ఉన్నారా? శిథిలాల కింద ఎంతమంది చిక్కుకుపోయారు ? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది . అయితే 43 మంది కార్మికులు చిక్కుకున్నట్లు పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరోవైపు బ్యాంకాక్‌లో ఓ భవనం కూలిపోవడంతో ఇద్దరు మృతిచెందగా.. ఏడుగురిని కాపాడినట్లు ఎమర్జెన్సీ రెస్పాండర్ మీడియాకు తెలిపారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో థాయ్‌లాండ్‌లో ప్రధాని షినవత్ర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
Pray for Myanmar 🇲🇲 🙏🏻
— Adv Jony Verma 🇮🇳 (@TheJonyVerma) March 28, 2025
Many buildings were reportedly destroyed in the 7.7 magnitude earthquake in Myanmar.
Video showing people being rescued from the rubles of the collapsed buildings.#Myanmar #earthquake #แผ่นดินไหว #earthquakemyanmar pic.twitter.com/FbA7gn0LuI
భూకంప ఘటనపై ప్రధాని మోదీ ద్రిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మయన్మార్‌ను ఆదుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. అందరి భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భూకంపం ప్రభావం నేపథ్యంలో మయన్మార్, థాయిలాండ్ దేశాలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది.
Concerned by the situation in the wake of the Earthquake in Myanmar and Thailand. Praying for the safety and wellbeing of everyone. India stands ready to offer all possible assistance. In this regard, asked our authorities to be on standby. Also asked the MEA to remain in touch…
— Narendra Modi (@narendramodi) March 28, 2025
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications