నేపాల్ భూకంపంలో 7,912 మంది దుర్మరణం: 2.97 లక్షల ఇండ్లు ధ్వంసం

కాఠ్మండు: నేపాల్ భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. నేపాల్ భూకంపంలో మరణించినవారిలో ఇప్పటి వరకు 7,912 మందిమృతదేహాలు బయటకు తీశామని శనివారం నేపాల్ హోం శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు.

ఏప్రిల్ 25వ తేదిన శనివారం సంభవించిన భూకంపం వలన నేపాల్ అస్తవ్యస్థం అయ్యింది. ఎన్నడు లేని విధంగా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఈ భూకంపం వలన ఇప్పటి వరకు 7,912 మంది మరణించారు. 17,871 మందికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స అందించారు.

A total of 2,97,266 houses were fully damaged in Nepal

2,97,266 మంది శాశ్వతంగా ఇండ్లు కోల్పోయి నడి రోడ్డు మీద నిరాశ్రులయ్యారు. వారికి పునరావాసం కల్పించడానికి శక్తి వంచన లేకుండ కృషి చేస్తున్నామని నేపాల్ ప్రభుత్వం అంటున్నది. నేపాల్ ప్రభుత్వానికి చెందిన 10,803 కార్యాలయాలు నేలమట్టం అయ్యాయి.

ఏప్రిల్ 25 సంభవించిన ఈ భూకంపం వలన ఇంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని, 264 మంది నేపాలీలు, 111 మంది విదేశీయులు గల్లంతు అయ్యారని నేపాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. గల్లంతు అయిన 375 మంది కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+