సర్వింగ్ బౌల్ గా న్యూడ్ మహిళ..! ఓ రెస్టారెంట్ స్పెషాలిటీ

Subscribe to Oneindia Telugu

జపాన్ : హోటల్ బిజినెస్.. ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న రంగం. పోటీని తట్టుకుని నిలబడడం కూడా కష్టమే. అందుకే ఒక్క మెనూ విషయంలో మాత్రమే కాదు.. జనాన్ని ఆకర్షించడానికి తమదైన ప్రయత్నాలేవో చేస్తూనే ఉంటాయి హోటల్ యాజమాన్యాలు. ఇదే తరహాలో రక రకాల థీమ్ లతో కొత్త కొత్త రెస్టారెంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

A variety restaurant serving food on Nude doll for customers

జపాన్ లోను ఓ వెరైటీ థీమ్ తో ఏర్పాటైన రెస్టారెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫుడ్ కు న్యూడిటీని జోడించి సర్వ్ చేయడమే ఆ రెస్టారెంట్ స్పెషాలిటీ. అయితే ఇక్కడ న్యూడ్ గా ఉండేది మనుషులు కాదు. కేవలం ఒక బొమ్మ మాత్రమే. కస్టమర్ ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలన్నింటిని ఓ న్యూడ్ డాల్ పై పేర్చి వడ్డించడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత.

జపాన్ రెస్టారెంట్ వాళ్లకు వచ్చిన ఈ వెరైటీ ఐడియా కాసులు కురిపిస్తోందని చెబుతున్నారు నిర్వాహకులు. మొత్తానికి హోటల్ అంటే రుచికరమైన వంటలే కాదు.. జనాన్ని రెస్టారెంట్ కు క్యూ కట్టించే మంత్రమేదో ఉండాలన్నది నేటి హోటల్ యాజమాన్యాలు ఫాలో అవుతోన్న ట్రెండ్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A variety restaurant in japan attracting every one with their special theam. serving food on Nude doll for customers is their speciality

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి