అమెరికా నిఘా విమానానికి దగ్గరగా వచ్చిన చైనా జెట్ ఫైటర్.. వీడియో విడుదల చేసిన యూఎస్..
చైనా, అమెరికా మధ్య మరోసారి విభేదాలు నెలకొన్నాయి. ఒక చైనీస్ ఫైటర్ జెట్ యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ నిఘా విమానం దక్షిణ చైనా సముద్రం మీదుగా ప్రయాణిస్తుండగా చైనాకు చెందిన ఫైటర్ జెట్ఫైటర్ జెట్ ఆరు మీటర్ల (20 అడుగులు) దగ్గరకు వచ్చిందని యూఎస్ మిలిటరీ గురువారం తెలిపింది. డిసెంబర్ 21న, ఒక చైనీస్ J-11 ఫైటర్ పైలట్ US ఎయిర్ ఫోర్స్ RC-135 విమానాన్ని ఢీకొట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించింది.

వీడియో క్లిప్
ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను కూడా విడుదల చేసింది.ఈ వీడియో ఫుటేజీలో చైనీస్ జెట్ ఫైటర్ అమెరికా నిఘా విమానం పక్క నుంచే వెళ్తున్నట్లు కనిపిస్తుంది. యూఎస్ పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఢీకొనే ప్రమాదాన్ని తప్పించినట్లు పేర్కొంది. దక్షిణ చైనా సముద్రంపై అంతర్జాతీయ గగనతలంలో చట్టపరంగానే తాము సాధారణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపింది. దీనిపై చైనా ఇంకా స్పందించలేదు.

అంతర్జాతీయ గగనతలం
"ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని అన్ని దేశాలు అంతర్జాతీయ గగనతలాన్ని సురక్షితంగా మరియు అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉపయోగించాలని మేము ఆశిస్తున్నాము" అని అమెరికా తెలిపింది. ఇటీవలి కాలంలో చైనీస్ యుద్ధ విమాన పైలట్‌లు ఈ ప్రాంతంలోని భౌగోళిక రాజకీయంగా సున్నితమైన ప్రదేశాలలో పెట్రోలింగ్ చేస్తూ, ముఖ్యంగా అనేక US మిత్రదేశాలు, విమానాలకు సమీపంలో ప్రమాదకరంగా ఎగురుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఉత్తర కొరియా
చైనా ఇలాంటి ఘటనలకు ఇంతకుముందు కూడా పాల్పడింది. జూన్‌లో ఉత్తర కొరియా సరిహద్దులో ఐక్యరాజ్యసమితి ఆంక్షల పెట్రోలింగ్‌ను నిర్వహిస్తున్న తమ విమానాలను చైనా వేధించిందని కెనడా ఆరోపించింది. మేలో ఆస్ట్రేలియా సైనిక నిఘా విమానాన్ని చైనా ఫైటర్ జెట్ "ప్రమాదకరంగా" అడ్డగించిందని ఆస్ట్రేలియా ఆరోపించింది.
కృత్రిమ ద్వీపాలు
2016లో దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎలాంటి హక్కు లేదని అంతర్జాతీయ కోర్టు తీర్పునిచ్చినప్పటికీ.. డ్రాగన్ వెనక్కి తగ్గడం లేదు. ఈ ప్రాంతంలో అమెరికా ఈ సముద్రంలో యుద్ధ నౌకలు, విమానాలను మోహరించడంతో చైనాకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. దక్షిణ సముద్రంలో చైనా కృత్రిమ ద్వీపాలను నిర్మించడం వివాదాలకు కారణమవుతున్నాయి. ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం, బ్రూనై మరియు తైవాన్ కూడా దక్షిణ చైనా సముద్రంలోని కొన్ని భాగాలపై హక్కును కలిగి ఉన్నాయి.












Click it and Unblock the Notifications