Viral Video: ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి.. అన్నదాత కష్టమేంటో తెలుస్తుంది..

మనం ఇల్లు లేకున్నా ఉండొచ్చు.. బట్టలు లేకున్నా ఉండొచ్చు.. కానీ ఆహారం లేకుండా ఉండలేం. మనిషికి అన్నింటి కన్నా ముఖ్యం తిండి. మనం తినే ఆహారం ఎక్కడో ఓ రైతు కష్టపడి పండించిన పంటే. ఆ రైతే లేకుంటే మనకు బతుకే లేదు. అన్నదాత ఆరుగాలం శ్రమించి పంట పండించడం వల్లే మనకు ఈ రోజు తిండి దొరుకుతుంది. మనకు ఆహారం దొరకడం కోసం రైతు పడుతున్న శ్రమ ఆమోగం..

తాజాగా ఓ రైతులు తన పంటను రక్షించుకోవడానికి పెద్ద సాహసమే చేశారు. భారీ రష్యన్ షెల్లింగ్ నుంచి ఉక్రెనియన్ రైతులు తమ పంటలను ఎలా రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారో చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తోంది.

A video of a farmer trying to save his crop is going viral on social media

ఇందులో భాగంగా రైతులు తమ కుటుంబాన్ని, దేశాన్ని పోషించడానికి పండించే పంటలను కూడా నాశనం చేస్తోంది. ఈ వీడియోను ఉక్రెయిన్ మాజీ దౌత్యవేత్త ఒలెగ్జాండర్ షెర్బా ట్విట్టర్‌లో షేర్ చేశారు. "మైకోలైవ్‌లో రోజువారీ షెల్లింగ్ తర్వాత పంటను కాపాడుకోవడానికి ఉక్రేనియన్ రైతులు ప్రయత్నిస్తున్నారు" అని అతను క్యాప్షన్‌లో రాశాడు.

ఒక రైతు ట్రాక్టర్‌పై కూర్చొని నీటి పైపును ఉపయోగించి రష్యా షెల్లింగ్ కారణంగా కాలిపోతున్న పంటలను కాపాడుతున్నాడు. మరో వ్యక్తి మంటలు వ్యాపించకుండా నిరోధించడం వీడియోలో కనిపిస్తుంది. రష్యా షెల్లింగ్, క్షిపణులు అనేక వ్యవసాయ భూములలో నిలబడి ఉన్న పంటలకు నిప్పు పెట్టడంతో, రైతులు తమ పంటను రక్షించుకోవడానికి అత్యవసర ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది.

ఈ వీడియోకు ఇప్పటి వరకు 65,000 వ్యూస్ రాగా 1,500 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. వీడియోకు అనేక కామెంంట్లు, రీ-ట్వీట్లు వస్తున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని ఒక పట్టణంపై రష్యా సోమవారం జరిపిన షెల్లింగ్‌లో ఆరుగురు వ్యక్తులు మరణించారు. బ్రస్సెల్స్‌లో సమావేశమైన EU మంత్రులు మాస్కోపై పాశ్చాత్య ఆంక్షల ఒత్తిడి పనిచేస్తోందని పునరుద్ఘాటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+