ఐదు మంది భార్యలు, 49 మంది గర్ల్ ఫ్రెండ్స్, ఆరో పెళ్లికి సర్వం సిద్దం చేశాడు
ఒకటి కాదు రెండు కాదు ఐదు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి విలాసవంతమైన జీవితానికి ఏమీ తక్కువ కాకుండా చూసుకున్నాడు. చేతిలో పని లేదు కాని పెళ్లిళ్లకు ఏమాత్రం కొదవలేదు. అయితే విలాసవంతమైన కారులో తిరగడం, వీలు చూసుకుని దుబాయ్ టూర్ కు వెళ్లడం మామూలుగా చేస్తున్నాడు. అందమైన అమాయకులైన యువతులను పెళ్లి పేరుతో మోసం చేస్తున్న వ్యక్తి మరో పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడు.
సత్యజిత్ మన్ గోవింద్ సామల్ అలియాస్ సత్యజిత్ (36) అనే నిందితుడు చివరికి పోలీసులకు చిక్కిపోయాడు. మ్యాట్రిమోనీతో పాటు పలు వెబ్ సైట్లలో అమాయకులైన అందమైన మహిళలను వెతికి వారిని బుట్టలో వేసుకునేవాడు. తర్వాత పెళ్లి చేసుకుంటానని వారిని నమ్మించాడు. అయితే పెళ్లి అయ్యాక పెళ్లి చేసుకున్న మహిళ ఖాతాలో ఉన్న డబ్బు, ఆమె తల్లిదండ్రుల సొమ్మును లాక్కొని దుబాయ్ ట్రిప్ వెళ్లాడు.

ఐదుగురు మహిళలను మోసం చేసిన భువనేశ్వర్ కు చెందిన సత్యజిత్ మనగోవింద్ ఇప్పుడు పోలీసులకు చిక్కిపోయాడు.
మ్యాట్రిమోనీ ద్వారా ధనవంతులైన మహిళలను టార్గెట్ చేసిన సత్యజిత్ మొదటి భార్య నుంచి ఏకంగా రూ. 36 లక్షలు, లగ్జరీ కారు తీసుకుని మోసం చేశాడు. రెండో భార్య నుంచి రూ. 8 లక్షల రూపాయలు, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ తీసుకుని ఆమెను కూడా మోసం చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు.
మూడవ, నాల్గవ, ఐదవ భార్యల విషయంలో కూడా ఇదే పరిస్థితి అని పోలీసులు తెలిపారు.
సత్యజిత్ ఇలా మోసం చేసి వివాహం చేసుకున్నాడని ఇద్దరు భార్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా సత్యజిత్ కోసం పోలీసులు గాలించారు. ఆరో పెళ్లికి సిద్ధమవుతున్న సత్యజిత్‌ను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సత్యజిత్ గురించి సంచలన విషయాలు వెలుగు చూశాయని పోలీసు అధికారులు తెలిపారు.

మ్యాట్రిమోనీ ద్వారా ఇప్పటికీ 49 మంది అమ్మాయిలతో సత్యజిత్ చాటింగ్ చేస్తున్నాడు. అందరికి పెళ్లి చేసుకుంటానని సత్యజిత్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
యువతులతో కబుర్లు చెబుతూ నమ్మకం పెంచుకుంటూ డబ్బు డిమాండ్ చేస్తూ వారిని మోసం చేసేవాడని పోలీసులు అన్నారు. అయితే వాళ్లను అవసరమైనప్పుడే సత్యజిత్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని పలువురిని డబ్బులు తీసుకుని మోసం చేశాడని పోలీసులు తెలిపారు.
పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన హామీ ద్వారా వచ్చిన లక్షల రూపాయల డబ్బుతో సత్యజిత్ దుబాయ్ వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసి మళ్లీ భారత్ వచ్చి ఇంకో అమ్మాయికి వలవేసేశాడని పోలీసులు అన్నారు. నెల రోజులుగా సత్యజిత్ దుబాయ్‌లో ఉన్నాడు. బ్యాంకు ఖాతాలో డబ్బులు ఖాళీ కావడంతో మళ్లీ మరో మహిళను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను మోసం చేసేవాడు. సత్యజిత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి రూ. 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సత్యజిత్ బ్యాంకు ఖాతాలో ఉన్న లక్ష రూపాయలను సీజ్ చేశారు. సత్యజిత్ కు చెందిన బుల్లెట్ వాహనంతో సహా మరికొన్ని కార్లు సీజ్ చేశామని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications