వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమీర్‌పై మాట్లాడితే చంపేస్తామని ఫోన్లు: ముతాలిక్

|
Google Oneindia TeluguNews

హుబ్బలి (కర్ణాటక): బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ గురించి మాట్లాడితే నిన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారని శ్రీరామ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ ఆరోపించారు. తనకు ఫోన్ లు చేసి ఈ విదంగా బెదిరిస్తున్నారని చెప్పారు.

కర్ణాటకలోని హుబ్బలిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మనం దేశం విడిచి వెళ్లిపోదామని తన భార్య చెప్పిందని అమీర్ ఖాన్ చెప్పడంలో అర్థం లేదేని విమర్శించారు. ఇప్పటి వరకు భారతదేశంలో సంపాధించిన సొమ్ముతో మీరు విదేశాలకు వెళ్లినా ఇక్కడి వారికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.

అమీర్ ఖాన్ గురించి, ఇస్లామిక్ చట్టం గురించి మీరు మీడియాతో మాట్లాడినా, విమర్శలు చేసినా చంపేస్తామని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ప్రమోద్ ముతాలిక్ ఆరోపించారు. అయితే ఇలాంటి బెదిరింపులు తనకు కొత్తకాదని అన్నారు.

 Aamir Khan, Sri Ram Sene Chief Pramod Muthalik

ఇలాంటి బుడ్డబెదిరింపులకు శ్రీరామ సేన కార్యకర్తలు భయపడరని చెప్పారు. దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరుతో పాటు పలు నగరాలలో అర్దరాత్రి దాటిన తరువాత పబ్ లలో ఉన్న యువతులపై శ్రీరామ సేన కార్యాకర్తలు దాడులు చేశారు.

ప్రమోద్ ముతాలిక్ నిత్యం వార్తలలో ఉంటారు. గోవాలో శ్రీరామ సేనను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. అంతే కాకుండ గోవాలో ముతాలిక్ అడుగు పెట్టరాదని గోవా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరు నగరంలో ముతాలిక్ ముఖం మీద మసి పూసి నిరసన వ్యక్తం చేసిన సందర్బాలు ఉన్నాయి.

తాను నమ్మిన సిద్దాంతాలను పాటిస్తానని, హిందూ ధర్మం కోసం ప్రాణాలైనా అర్పించడానికి తాను సిద్దంగా ఉన్నానని ప్రమోద్ ముతాలిక్ అంటున్నారు. అమీర్ ఖాన్ నటించే చిత్రాలను కర్ణాటకలో విడుదల కానివ్వకుండా తాము అడ్డుకుంటామని పలు హిందూ సంఘ సంస్థలు అంటున్నాయి.

English summary
I received a phone call threatening me not to speak on Aamir Khan and Islam, said Sri Ram Sene Chief Pramod Muthalik in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X