వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ బాల్కనీలో బట్టలు ఆరేస్తే నేరం..20 వేల రూపాయల ఫైన్

|
Google Oneindia TeluguNews

సాధారణంగా ఎక్కడైనా నగరాలలో బట్టలు ఉతికిన తర్వాత వాటిని బాల్కనీలో ఆరేస్తూ ఉంటారు. అలా బాల్కనీలో బట్టలు వేయడం వల్ల నగరం అందం దెబ్బతింటుంది అట.. అందుకోసం ఓ వింతైన నిర్ణయం తీసుకున్నారు ఓ దేశంలోని మునిసిపాలిటీ అధికారులు. ఏకంగా బాల్కనీ లో బట్టలు ఆరేసే వారికి భారీ జరిమానా విధిస్తామని తేల్చి చెప్పారు. ఇంతకీ ఎక్కడ అంటే.

చైనాలో మరో వైరస్.. నాలుగేళ్ల బాలుడిలో లక్షణాలు: ఏంటీ పరిస్థితి..?చైనాలో మరో వైరస్.. నాలుగేళ్ల బాలుడిలో లక్షణాలు: ఏంటీ పరిస్థితి..?

 బాల్కనీ లో బట్టలు ఆరేసే వారిపై కఠిన చర్యలకు రెడీ: అబుదాబీ మున్సిపాలిటీ

బాల్కనీ లో బట్టలు ఆరేసే వారిపై కఠిన చర్యలకు రెడీ: అబుదాబీ మున్సిపాలిటీ

అరబ్ దేశాలలో సహజంగా చాలా విషయాలలో కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఇక ఎవరైనా ఏదైనా నేరం చేస్తే కూడా శిక్షలు అంతే కఠినంగా ఉంటాయి. రోడ్డుమీద పొరపాటుగా ఉమ్మేసినా జైలుకు వెళ్ళవలసిందే. ఇక ఇటువంటి కఠిన నిబంధనలు ఉండే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబి సిటీలో మునిసిపాలిటీ అధికారులు బాల్కనీ లో బట్టలు ఆరేసే వారిపై కఠిన చర్యలకు రెడీ అయ్యారు.

బాల్కనీలో బట్టలు ఆరేసే వ్యక్తులపై 1000 యూఏఈ దిర్హామ్‌ లు జరిమానా

బాల్కనీలో బట్టలు ఆరేసే వ్యక్తులపై 1000 యూఏఈ దిర్హామ్‌ లు జరిమానా


బాల్కనీలో బట్టలు ఆరబెట్టే వ్యక్తులపై 1000 యూఏఈ దిర్హామ్‌ల జరిమానా విధిస్తామని అబుదాబి సిటీ మున్సిపాలిటీ హెచ్చరించింది. అంటే ఇండియన్ కరెన్సీలో 20000 రూపాయలు అన్నమాట. అపార్ట్‌మెంట్ల బాల్కనీలో లాండ్రీ కోసం వినియోగించటం, కిటికీలకు లేదా రైలింగ్ లకు బట్టలను వేలాడదీయడం వంటివి చెయ్యరాదని మున్సిపాలిటీ నివాసితులను హెచ్చరించింది. దీంతో నగరం రూపురేఖలు తారుమారవుతున్నందున అధికార యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది.

నగరం అందం దెబ్బ తింటుందని అబుదాబీ మున్సిపల్ అధికారుల నిర్ణయం

నగరం అందం దెబ్బ తింటుందని అబుదాబీ మున్సిపల్ అధికారుల నిర్ణయం


అపార్ట్‌మెంట్ బాల్కనీలను లాండ్రీ కోసం ఉపయోగించటం వల్ల అవి భవనం యొక్క అందాన్ని వక్రీకరిస్తుందని, నివాసితులు నగరం అంతటా సౌందర్య రూపాన్ని కాపాడుకోవాలని, వారి అపార్ట్‌మెంట్ బాల్కనీలను దుర్వినియోగం చేయకూడదు అని అథారిటీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఎలక్ట్రానిక్ బట్టల డ్రైయర్‌లు మరియు బట్టలు ఆరబెట్టే రాక్‌లు వంటి ప్రత్యామ్నాయ ఆధునిక లాండ్రీ-ఎండబెట్టే పద్ధతులను అనుసరించాలని ఇది నివాసితులందరినీ కోరింది.

నగరం అందం కాపాడాలని వర్చువల్ అవగాహనా కార్యక్రమం

నగరం అందం కాపాడాలని వర్చువల్ అవగాహనా కార్యక్రమం


నగరం యొక్క సౌందర్య రూపాన్ని నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతపై నివాసితులకు అవగాహన కల్పించడానికి అధికార యంత్రాంగం వర్చువల్ అవగాహన ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. నగరం చూడగానే సుందరంగా కనిపించాలని తేల్చి చెప్పింది. ఎవరైతే బాల్కనీలను బట్టలు ఆరేసేందుకు దుర్వినియోగం చేస్తారో .. వారికి జరిమానాలు విధిస్తామని వెల్లడించారు.

English summary
The Abu Dhabi City Municipality has warned that people who dry clothes on the balcony will be fined 1000 UAE dirhams. That is 20000 rupees in Indian currency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X