ప్రపంచ మేటి నటుడు.. లెజండరీ యాక్టర్.. ఇక లేరు

బ్రిటీష్ సీనియర్ నటుడు, ప్రపంచ ఐకానిక్ యాక్టర్ గా పేరొందిన సర్ జాన్ హర్ట్ (77) కన్నుమూశారు.

లాస్ ఏంజిల్స్: బ్రిటీష్ సీనియర్ నటుడు, ప్రపంచ ఐకానిక్ యాక్టర్ గా పేరొందిన సర్ జాన్ హర్ట్ (77) కన్నుమూశారు. కొంతకాలంగా పాంక్రియాస్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు.

అనేక ప్రత్యేక సినిమాల్లో ఐకానిక్ పాత్రలతో తనదైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న జాన్ హర్ట్ లెజండరీ నటుడిగా పేరు ప్రఖ్యాతులు పొందారు.

Acclaimed actor John Hurt dies at 77 following battle with cancer

ముఖ్యంగా ది మిడ్ నైట్ ఎక్స్ ప్రెస్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ఎలిఫెంట్ మ్యాన్, ఏలియన్, హ్యారీ పాటర్ సిరీస్, హెర్క్యులెస్ తదితర ప్రఖ్యాత సినిమాల ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకులకు ఈయన సుపరిచితులే. సుమారు ఆరు దశాబ్దాలపాటు ఆయన సినీరంగానికి ఎనలేని సేవలు అందించారు.

అనేక రివార్డులు, అవార్డులు, లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుతోపాటు, 2015లో బ్రిటీష్ రాణి చేతులమీదుగా 'సర్' సత్కారాన్ని కూడా జాన్ హర్ట్ అందుకున్నారు. రెండుసార్లు ఆస్కార్ కు కూడా నామినేట్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+