• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హాలీవుడ్ నటుడి సంచలనం: ట్రంప్‌ నా భార్యను కొట్టాడు.. తన హెలికాప్టర్‌లో అట్లాంటాకు రమ్మన్నాడు..

By Ramesh Babu
|

లండన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై నటుడు బిల్లీ బాల్డ్‌విన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పార్టీలో ట్రంప్‌ తన భార్యపై చెయ్యి చేసుకున్నాడని, తన హెలికాప్టర్‌లో అట్లాంటాకు రావాలంటూ ఆమెను పిలిచాడని బెల్లీ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

డెమొక్రటిక్‌ పార్టీ సెనేటర్‌ అల్‌ ఫ్రాంకెన్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై ట్రంప్‌ కొడుకు ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించాడు. ఆ వెంటనే బిల్లీ దానికి రీ-ట్వీట్‌ చేయటం విశేషం. మన్‌హట్టన్‌ హోటల్‌లో సుమారు రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ బిల్లీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.'

''లైంగిక దాడులలో మీ నాన్నకు(ట్రంప్‌ను ఉద్దేశించి) బ్లాక్‌ బెల్ట్‌ ఇవ్వొచ్చు. ప్లాజా హోటల్‌లో ఓసారి నేను ఇచ్చిన పార్టీకి పిలవకపోయినా మీ నాన్న వచ్చాడు. కారణం లేకుండానే నా భార్యపై చెయ్యి చేసుకున్నాడు. తన హెలికాప్టర్‌లో అట్లాంటాకు రావాలంటూ పిలిచాడు..'' అంటూ నటుడు బిల్లీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

54 ఏళ్ల బిల్లీ బాల్డ్‌విన్.. చైన్నా ఫిలిప్స్‌ను వివాహం చేసుకున్నారు. గతంలో ట్రంప్‌తో స్నేహంగా ఉన్నప్పటికీ.. తర్వాత ఎందుకనో వారిద్దరి మధ్య వైరం మొదలైంది. అధ్యక్ష ఎన్నిక ప్రచారం నుంచే బిల్లీ.. ట్రంప్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాడు. ఇక బిల్లీ సోదరుడు, నటుడు అయిన అలెక్‌ బాల్డ్‌విన్‌ కూడా ట్రంప్‌ మీద ఓ సెటైరిక్‌ టీవీ షో నిర్వహిస్తున్నాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actor Billy Baldwin snapped back at a tweet about Sen. Al Franken (D-Minn.) on Thursday, saying that President Donald Trump once “hit on my wife” at a Manhattan hotel. Baldwin also slammed the president as a “5th degree black belt when it comes to sexual impropriety allegations.” Baldwin jumped into the fray after the president’s son Donald Trump Jr. tweeted about new allegations against Franken. He was referring to a HuffPost report published Wednesday in which two other women stepped forward saying Franken inappropriately touched them on the butt. That makes the third and fourth such allegations against Franken in the past week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more