నా వెనుక భాగాన్ని తడిమాడు, బూతు జోక్ చెప్పాడు: సీనియర్ బుష్‌పై నటి సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu
  Today TOP 10 Trending News ఈరోజు టాప్ 10 న్యూస్ | Oneindia Telugu

  వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్ హెచ్‌డబ్ల్యు బుష్ (సీనియర్) పైన ప్రముఖ నటి హెథేర్ లిండ్ సంచలన ఆరోపణలు చేశారు.

  బుష్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఆ సమయంలో ఆయన భార్య కూడా పక్కనే ఉన్నారని చెప్పింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పేర్కొంది.

  తాను నటించిన ఓ చారిత్రక టీవీ కార్యక్రమం ప్రొమోషన్‌ కోసం వెళ్లినప్పుడు ఆయన తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'మీ టూ' హ్యాష్‌ ట్యాగ్‌తో జోడించింది.

  నా వీపు భాగం తడిమాడు, బూతు జోక్ చెప్పాడు

  నా వీపు భాగం తడిమాడు, బూతు జోక్ చెప్పాడు

  తాను నటించిన ఓ టీవీ కార్యక్రమం ప్రొమోషన్‌లో భాగంగా బుష్‌ను కలిసే అవకాశం వచ్చిందని, ఆయనతో ఫొటో దిగాలని మేమంతా దగ్గరకు వెళ్లామని, ఆ సమయంలో ఆయన పక్కనే నిలబడ్డానని, ఆయన తనతో కరచాలనం చేయలేదని, తన వీల్‌చైర్‌ పైనుంచి తన వెనుక భాగాన్ని తడిమారని చెప్పింది.

  బుష్ భార్య ఉన్నా ఏం చేయలేకపోయారు

  బుష్ భార్య ఉన్నా ఏం చేయలేకపోయారు

  ఆ సమయంలో పక్కనే ఆయన సతీమణి బార్బారా బుష్‌ కూడా ఉన్నారని, ఆయన ప్రవర్తనను గమనించినప్పటికీ ఆమె ఏమీ చేయలేకపోయారని, బుష్‌ తనకు ఓ బూతు జోక్‌ కూడా చెప్పారని పేర్కొంది.

  ఫోటోలు పోస్ట్ చేసింది

  ఫోటోలు పోస్ట్ చేసింది

  లిండ్ వయస్సు 34 ఏళ్లు. 2014 మార్చిలో ఈ చేదు అనుభవం ఎదురయిందని పేర్కొంది. ఆ సమయంలో ఆయనతో తీసుకున్న ఫొటోలను సైతం ఆమె పోస్ట్‌ చేశారు.

  సెక్యూరిటీకి చెప్తే ఇలా

  సెక్యూరిటీకి చెప్తే ఇలా

  బుష్ ప్రవర్తనపై అప్పుడే తాను సెక్యూరిటీకి ఫిర్యాదు చేశానని, మరు అనవసరంగా ఆయన వద్దకు వెళ్లారని వాళ్లు సమాధానం ఇచ్చారని చెప్పింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  An AMC actress claims that former President George H.W. Bush groped her from his wheelchair during a screening.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి