వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాలిబన్లకు అడ్డంకిగా పంజ్ షీర్-సర్కార్ ఏర్పాటు ఆలస్యం-చర్చల పురోగతిపై భారత్ హ్యాపీ

|
Google Oneindia TeluguNews

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం నుంచి అధికారం హస్తగతం చేసుకున్నాక కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆప్ఘనిస్తాన్ ను మొత్తం ఆక్రమించినా పంజ్ షీర్ లోయలో తిరుగుబాటుదారులు మాత్రం తాలిబన్లకు సవాళ్లు విసురుతున్నారు. దీంతో పంజ్ షీర్ ను ఆక్రమించకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సమస్యలు తప్పవని వారు భావిస్తున్నారు. అదే సమయంలో భారత్ తాజాగా తాలిబన్లతో జరిగిన చర్చలు ఆశాజనకంగా ఉన్నాయని ప్రకటించింది.

రాష్ట్రంలో రహదారులు మృత్యుద్వారాలుగా మారాయి - అంటూ జనసేన సైన్యం పోరాటం ,ఆంధ్ర ప్రదేశ్ రోడ్స్ క్యాంపెయిన్ గురించి పవన్ కళ్యాణ్ (ఫొటోస్)

తాలిబన్ సర్కార్ ఏర్పాటు పాయిదా

తాలిబన్ సర్కార్ ఏర్పాటు పాయిదా

ఆప్ఘనిస్తాన్ లో కొత్త తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం కానుంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియ అంతా సిద్ధమైనా ఓ కీలక సమస్య వారిని వేధిస్తోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందే ఆ సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్న తాలిబన్లు.. ప్రభుత్వ ఏర్పాటుకు తొందరపడటం లేదు. ఆప్గనిస్తాన్ లో తాజా పరిస్ధితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటున్న తాలిబన్లు.. ఇందుకోసం పాకిస్తాన్ సాయం కూడా తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పరిస్ధితులు తమ నియంత్రణలోకి రాగానే ప్రభుత్వ ఏర్పాటును తాలిబన్లు అధికారికంగా ప్రకటించే అవకాశముంది. దీంతో మరికొన్ని రోజులు ఈ ఉత్కంఠ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాలిబన్లకు చిక్కని పంజ్ షీర్

తాలిబన్లకు చిక్కని పంజ్ షీర్


అష్రఫ్ ఘనీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేతుల్లో ఉన్న ఆప్ఘనిస్తాన్ ను సొంత చేసుకున్న తాలిబన్లు.. తమ భూభూగంలోనే ఉన్న పంజ్ షీర్ లోయను మాత్రం చేజిక్కించుకోలేకపోతున్నారు. ఇప్పటికే పంజ్ షీర్ తాలిబన్ల వశమైందని వార్తలు వస్తున్నా వారు మాత్రం దీన్ని అధికారికంగా ప్రకటించడం లేదు. మరోవైపు పంజ్ షీర్ లోయలో తిరుగుబాటుదారులతో తాలిబన్లు జరుపుతున్న పోరులో ఇరువర్గాలకూ భారీగా ప్రాణనష్టం వాటిల్లుతోంది. అయినా ఇరువురిలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గేందుకు ఇష్టపడటం లేదు. దీంతో మొత్తం ఆఫ్గనిస్తాన్ పోరు ఓ ఎత్తయితే పంజ్ షీర్ పోరు ఓ ఎత్తుగా మారిపోయింది. పంజ్ షీర్ ను చేజిక్కించుకోకుండా ఆప్ఘనిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటు చేస్తే సమస్యలు తప్పవని తాలిబన్లు భావిస్తున్నారు.

పంజ్ షీర్ దక్కకుండా

పంజ్ షీర్ దక్కకుండా

తాలిబన్లకూ, వారిపై తిరుగుబాటుదారులకూ మధ్య పంజ్ షీర్ లో జరుగుతున్న పోరు ఇప్పుడు అంతర్జాతీయంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఈ పోరులో వందలాది మంది తాలిబన్లు చనిపోతున్నారన్న వార్తలు కూడా అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తరుణంలో తాలిబన్లు పంజ్ షీర్ ను చేజిక్కించుకోవడంలో విఫలమైతే మాత్రం అంతర్జాతీయంగా కూడా వారికి ఇబ్బందులు తప్పేలా లేవు. సొంత భూభాగాన్ని తిరుగుబాటుదారుల నుంచి దక్కించుకోవడంలో విఫలమైన తాలిబన్లకు అంతర్జాతీయ మద్దతు లభించడం కూడా కష్టమవుతుంది. దీంతో ఇప్పుడు పంజ్ షీర్ పై తాలిబన్ ఫైటర్లు పూర్తిస్ధాయిలో దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. రేపోమాపో పంజ్ షీర్ స్వాధీన ప్రకటన వెలువడుతుందని పాకిస్తాన్ తో పాటు తాలిబన్లకు మద్దతిస్తున్న మిగతా దేశాలు కూడా ఆశాజనకంగా ఎదురుచూస్తున్నాయి.

తాలిబన్లతో జోరుగా భారత్ చర్చలు

తాలిబన్లతో జోరుగా భారత్ చర్చలు

మరోవైపు ఆప్ఘనిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతున్నప్పటికీ వ్యూహాత్మక ప్రాంతమైన ఈ దేశంలో తమ పట్టు కొనసాగాలంటే తాలిబన్లతో అవగాహన అవసరమని భారత్ భావిస్తోంది. దీంతో వారితో వీలైనన్ని మార్గాల్లో చర్చలు జరుపుతోంది. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ అధికారికంగానే ప్రకటిస్తోంది. తాజాగా దోహాలో జరిగిన చర్చల సారాంశాన్ని కూడా విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా వెల్లడించారు. దీంతో భారత్-తాలిబన్ చర్చలు జోరుగా సాగుతున్నట్లు అర్దమవుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందే తాలిబన్లతో భారత్ జరుపుతున్న చర్చలు అంతర్జాతీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

భారత్-తాలిబన్ చర్చల సారాంశమిదే

భారత్-తాలిబన్ చర్చల సారాంశమిదే

భారత్ తటస్ధ వేదికలపై తాలిబన్లతో జరుపుతున్న చర్చలు ఆశాజనకంగా ఉన్నాయని, భరోసా ఇచ్చేలా ఉన్నాయని తాజాగా విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా వెల్లడించారు. దోహాలో భారత ప్రభుత్వం తాలిబన్లతో చర్చలు జరిపినట్లు ప్రకటించిన నాలుగు రోజుల తరువాత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ఈ ప్రకటన చేయడం విశేషం. కాబూల్ లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో తమ చర్చలు కొనసాగుతాయని కూడా ఆయన వెల్లడించారు. దీంతో తాలిబన్లతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందే భారత్ ఓ అవగాహనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆఫ్ఘన్ లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన భారత్... ఇకపైనా అదే సహకారాన్ని కొనసాగించేందుకు అంగీకరిస్తే తాలిబన్లు మన దేశం విషయంలో మెతక వైఖరి అవలంబించే అవకాశాలు లేకపోలేదు.

 భారత్ పై తాలిబన్ల వ్యూహమిదే ?

భారత్ పై తాలిబన్ల వ్యూహమిదే ?


ఇప్పటికే అమెరికాతో పాటు పాశ్చాత్యదేశాలతో అవగాహనా ఒప్పందాల ద్వారా అధికారం హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. ఇప్పుడు దాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం 2001కి ముందు తాము చేసిన తప్పిదాలు పునరావృతం కాకూడదని ఆశిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటులోనూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఆప్ఘన్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్ విషయంలో తాలిబన్లు ఆశావహ దృక్పధంతో ఉండటం కాస్త ఊరటనిస్తోంది. భవిష్యత్తులో ఆప్ఘనిస్తాన్ లో భారీ పెట్టుబడులకు చైనా సిద్దమవుతున్న నేపథ్యంలో బారత్ తో సంబంధాలు కూడా కొనసాగేలా చూసుకోవాలని తాలిబన్లు పట్టుదలగా ఉన్నారు. దీంతో భారత విదేశాంగశాఖ పంపుతున్న ప్రతినిధులతో వారి కమాండర్లు చర్చలు జరుపుతున్నారు. ఓవైపు చైనా, పాకిస్తాన్ ను దువ్వుతూనే మరోవైపు భారత్ ను కూడా వదులుకోరాదనే వ్యూహంతో తాలిబన్లు ముందుకెళ్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

English summary
new government formation in afghansitan will be delayed with fight between taliban fighters and resistance forces in panjshir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X