జర్మన్ రైల్లో తెగబడిన అఫ్గాన్ కుర్రాడు: ఒకరి మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

బెర్లిన్: జర్మనీ రైల్లో ఓ అఫ్ఘానిస్తాన్ కుర్రాడు జర్మనీ రైల్లో బీభత్సం సృష్టించాడు. మంగళవారంనాడు ఈ ఘటన జరిగింది. రైల్లోని ప్రయాణికులపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఒకరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు.

విషయం తెలుసుకన్న జర్మనీ భద్రతా సిబ్బంది రంగంలోకి దిగింది. యువకుడిని కాల్చి చంపాయి. దాడికి పాల్పడిన యువకుడిని 17 ఏళ్ల అఫ్షాన్ శరణార్థిగా గుర్తించారు. ఈ దాడితో ఐసిస్ ఉగ్రవాదులకు ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Afghan teen attacks German train, passengers wounded; attacker killed

దాడిలో గాయపడిన ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం అర్థరాత్రి రైలు ట్రూచెన్‌జెన్ నుంచి పువర్జ్‌బర్గ్‌ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దిగ్భ్రాంతికి గురైన 14 మందికి చికిత్స అందించారు.

జర్మనీలోకి నిరుడు దాదాపు పది లక్షల మంది వలస వచ్చారు. వీరిలో లక్షా యాభై వేల మంది అఫ్ఘానిస్తాన్ పౌరులు ఉన్నారు. దాడికి పాల్పడిన యువకుడు వలసవచ్చినవారిలో ఒక్కడై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ దాడికి కారణమేమిటనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడుతూ అతను అల్లా హో అక్బర్ అని నినదించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A teenage Afghan migrant armed with an axe and a knife attacked passengers aboard a regional train in southern Germany on Monday night, injuring four people before he was shot and killed by police as he fled, authorities said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి