ఆఫ్ఘాన్‌లో భూకంపం కల్లోలం: 2వేల మందికిపైగా మృతి, వేల ఇళ్లు నేలమట్టం
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చింది. ఆఫ్ఘాన్ పశ్చిమ ప్రాంతాన్ని కుదిపేసిన భూకంపం ధాటికి మృతుల సంఖ్య మరింతగా పెరిగింది. భూకంప విధ్వంసంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు వేలు దాటింది. తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
వేలాది మంది తీవ్ర గాయాలపాలనైట్లు ఐక్యరాజ్య సమితి వర్గాలు వెల్లడించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. శనివారం మధ్యాహ్నం హెరాత్ నగరానికి వాయువ్య దిశగా.. 40 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. ఆ తర్వాత కూడా 6.3, 5.9, 5.5 తీవ్రతతో పాటు పలుమార్లు చిన్న భూప్రకంపనలు వచ్చాయి.

ఈ భూకంపం ధాటికి పశ్చిమ అఫ్గానిస్థాన్‌లో వేల ఇళ్లు నేలమట్టమయ్యాయని.. వందల మంది ప్రజలు మరణించారని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఆరు గ్రామాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయని.. వందలాది మంది పౌరులు శిథిలాల కింద చిక్కుకుని చనిపోయారని అఫ్గాన్ సాంస్కృతిక శాఖ మంత్రి అబ్దుల్ వాహిద్ రయాన్ వెల్లడించారు.
తక్షణ సహాయం కోసం ముందుకు రావాలని సంపన్న దేశాలను ఆయన అభ్యర్థించారు. అయితే ప్రస్తుతం నమోదైన లెక్కల కంటే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందని మంత్రి అబ్దుల్ వాహిద్ చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. వేలాది మంది క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications