వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మా పార్లమెంటుపై దాడిలో పాక్ అధికారి ప్రమేయం’

|
Google Oneindia TeluguNews

కాబూల్: తమ దేశ పార్లమెంటుపై తాలిబన్లు చేసిన దాడిలో పాకిస్థాన్‌ నిఘా సంస్థకు చెందిన ఓ అధికారి ప్రమేయముందని ఆఫ్ఘనిస్థాన్‌ ఆరోపించింది. అఫ్గాన్‌ అధికార ప్రతినిధి హస్సిబ్‌ సిద్ధిఖి మాట్లాడుతూ.. పార్లమెంటుపై తాలిబన్లు జరిపిన దాడిలో పాకిస్థాన్‌ నిఘా సంస్థకు చెందిన ఓ అధికారి ప్రమేయం ఉందని తెలిపారు.

అయితే అతని పేరు వెల్లడించేందుకు సిద్ధిఖి సుముఖత వ్యక్తం చేయలేదు. పార్లమెంటుపై దాడి జరుగుతుందని నిఘా సంస్థకు జూన్‌ 10న సమాచారం అందిందని తెలిపారు. అందుకే ఆ పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని అని చెప్పారు.

Afghanistan: Pakistan officer involved in parliament attack

సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఉపయోగించిన కారు బాంబు పాకిస్థాన్‌లోని పెషావర్‌లో తయారైందని ఆయన తెలిపారు. కాగా, ఈ వ్యాఖ్యలకు పాక్‌ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.

నాలుగు రోజుల క్రితం తాలిబన్ ఉగ్రవాదులు అఫ్గాన్ పార్లమెంటుపై దాడి చేసి ఇద్దరు పౌరులను బలి తీసుకున్న విషయం తెలిసిందే. అఫ్గాన్ భద్రతా దళాలు జరిపిన ఎదురు దాడిలో దాడికి పాల్పడిన ఏడుగురు ఉగ్రవాదులు మృతి చెందారు.

English summary
Afghanistan's intelligence service on Wednesday said a Pakistani intelligence officer helped the Taliban carry out an attack on the parliament in Kabul earlier this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X