ఆఫ్ఘనిస్థాన్ పార్లమెంటుపై ఆత్మాహుతి దాడి(వీడియో)

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా దేశ పార్లమెంటుపైనే ఆత్మహుతి దాడికి తెగబడ్డారు. మొదట పలువురు సాయుధులైన ఉగ్రవాది తుపాకులతో భవనంపై కాల్పులు జరిపారు. పార్లమెంటు భవనానికి సమీపంలో ఉన్న భవనాల నుంచి కాల్పులకు తెగబడ్డారు.

అనంతరం పలువురు ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడినట్లు అక్కడి మీడియాలు కథనాలు వెల్లడిస్తున్నాయి. పార్లమెంటు దిగువసభ వోలేసి జిర్గాలో ఈ బాంబు పేలుడు సంభవించినట్లు పేర్కొన్నాయి.

పార్లమెంటు ఆవరణలో మొత్తం 9 బాంబులు పేలినట్లు అక్కడి మీడియా పేర్కొంది. పార్లమెంటు భవనం వద్ద ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు వెల్లడించాయి. పార్లమెంటు సభ్యులను భద్రతా బలగాలు సురక్షితంగా బయటికి తరలించాయి. పలువురు సభ్యులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది.

Afghanistan: Parliament in Kabul under attack as explosions and gunfire reported

కాగా, ఆఫ్ఘనిస్థాన్ పార్లమెంటు టీవీలో ఆ భవనంలో దట్టమైన పొగలు అలుముకున్న దృశ్యాలు ప్రసారమయ్యాయి. బాంబు పేలుళ్లు జరగడంతో పార్లమెంటు టీవీ ఒక్కసారిగా కంపించింది. అంతర్గత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి సేదిఖ్ సిదిఖి.. బాంబు పేలుళ్ల ఘటనను ధృవీకరించారు. భద్రతా బలగాలు ఉగ్రవాదులను తరిమికొడుతున్నాయని చెప్పారు.

భద్రతా బలగాల ఎదురుదాడిలో ఏడురురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆపరేషన్ ముగిసిందని చెప్పారు. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు సాధారణ పౌరులు కూడా మృతి చెందినట్లు చెప్పారు. ఉగ్రవాదుల దాడిలో 21మంది గాయపడగా, ఎంపీలందరూ సురక్షితంగా బయటపడ్డారు. కాగా, పార్లమెంటుపై దాడికి పాల్పడింది తామేనని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజామిద్ ప్రకటించారు. అఫ్ఘాన్ పోలీసులు కూడా తాలిబన్లే దాడికి పాల్పడ్డారని ధృవీకరించారు.

భారతీయులు సురక్షితం

పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో స్పందించిన ఆఫ్ఘనిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయులంతా సురక్షితంగానే ఉన్నారని ప్రకటించింది. ఆఫ్ఘనిస్థాన్‌లో భారత రాయబారి అమర్‌ సిన్హా మాట్లాడుతూ... ఉగ్రవాదుల దాడిలో భారతీయులెవరూ గాయపడలేదని... అందరూ సురక్షితంగానే ఉన్నారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+