పోలీస్‌ శిక్షణ కేంద్రంపై ఆత్మాహుతి దాడి, 61 మంది మృతి.. 160 మందికి గాయాలు

అఫ్గానిస్తాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పక్తియా ప్రావిన్స్ లోని గార్డెజ్ ప్రాంతంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోని పోలీస్ శిక్షణ కేంద్రంపై ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 61మంది మ

కాబూల్: అఫ్గానిస్తాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పక్తియా ప్రావిన్స్ లోని గార్డెజ్ ప్రాంతంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోని పోలీస్ శిక్షణ కేంద్రంపై ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు.

ఈ దాడిలో 61మంది మృతిచెందగా, మరో 160 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో పోలీసులతో పాటు మహిళలు, విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయని.. ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయని, మిగిలిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.

Afghanistan Terror Attack: At Least 61 Killed, 160 Injured

మంగళవారం ఉదయం భద్రతావలయాన్ని దాటుకుని వచ్చిన ఉగ్రవాదులు ఈ శిక్షణ కేంద్రంలోకి చొరబడ్డారు. రెండు కార్లతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అనంతరం మరికొందరు ముష్కరులు పోలీసులపైకి కాల్పులు జరిపారు.

మరోవైపు ఘటనకు పాల్పడింది తామేనంటూ తాలిబన్‌ ఉగ్రవాద సంస్థ ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+