మూడోస్సారి: కిమ్ చైనా పర్యటన వెనక అజెండా ఏంటి..?
చైనా: సింగపూర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన కొద్ది రోజులకే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసేందుకు చైనా రావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల పాటు ఆయన చైనాలో పర్యటించనున్నారు. ఈ ఏడాది మార్చి నెల నుంచి కిమ్.. జిన్‌పింగ్‌తో సమావేశమవడం ఇది మూడో సారి.
అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో కిమ్ చైనా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్నందునే కిమ్ చైనాకు వెళ్లారని బీజింగ్‌లోని రెన్‌మిన్ యూనివర్శిటీలో పనిచేస్తున్న కొరియా నిపుణులు ఒకరు తెలిపారు. అయితే సింగపూర్ సమావేశం తర్వాత కిమ్ చైనాతో రాయబారం నడుపుతున్నారా అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

మార్చిలో తన తొలి చైనా పర్యటన సందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ రైళ్లో బీజింగ్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత మేలో రెండో సారి చైనా పర్యటనలో తీర ప్రాంత నగరమైన దాలియన్‌ను సందర్శించి అక్కడ ఇరుదేశాధ్యక్షులు పలు అంశాలపై చర్చించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications