వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్ లో ముగిసిన రాణిశకం-కొత్త రాజుగా ఛార్లెస్ 3 ప్రకటన- తన బాధ్యతలు తెలుసని వెల్లడి

|
Google Oneindia TeluguNews

బ్రిటన్ రాణి ఎలిజబెత్ కన్నుమూసిన నేపథ్యంలో పాలనా పగ్గాల్ని ఆమె కుమారుడు, కింగ్ ఛార్లెస్ 3 ఇవాళ చేపట్టారు. ఈ మేరకు శనివారం లండన్ లో జరిగిన అక్సెషన్ కౌన్సిల్ వేడుకలో చార్లెస్ III ను బ్రిటన్ రాజుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా తనకు సార్వభౌమాధికార విధులు గురుతర బాధ్యతల గురించి లోతుగా తెలుసని ఛార్లెస్ తెలిపారు.

73 ఏళ్ల దేశాధినేత ఛార్లెస్ 3 .. సీనియర్ రాజకీయ, మత సలహాదారుల ప్రవేశ మండలిలో తన తల్లి క్వీన్ ఎలిజబెత్ II యొక్క స్ఫూర్తిదాయకమైన మోడల్ ను అనుసరించడానికి ప్రయత్నిస్తానని ప్రకటించారు. సెయింట్ జేమ్స్ ప్యాలెస్ సింహాసన గదిలో రాజ సింహాసనం ముందు నిలబడి కొత్త చక్రవర్తి తన తల్లి మరణంతో తనకు, తన కుటుంబానికి, యునైటెడ్ కింగ్‌డమ్, కామన్వెల్త్, మొత్తం ప్రపంచానికి కోలుకోలేని నష్టం జరిగిందని వెల్లడించారు.

after proclamation, king charles III said deeply aware of duties and responsibilities

"నాకు, నా సోదరి, సోదరులకు చాలా మంది సానుభూతి తెలపడం గొప్ప ఓదార్పునిస్తుందని కింగ్ ఛార్లెస్ పేర్కొన్నారు. ఈ అపారమైన ఆప్యాయత, మద్దతు తమకు జరిగిన నష్టానికి మా కుటుంబానికి లభించాలన్నారు. తన తల్లి పాలన, వ్యవధి, అంకితభావం, భక్తిలో అసమానమైనదని కింగ్ ఛార్లెస్ తెలిపారు. తాము దుఃఖిస్తున్నప్పటికీ, ఈ అత్యంత నమ్మకమైన జీవితానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఛార్లెస్ తన ప్రసంగంలో వెల్లడించారు.

కింగ్ ఛార్లెస్ ను ఇవాళ బ్రిటన్ తదుపరి రాజుగా అధికారికంగా ప్రకటించినా పూర్తిస్ధాయిలో బాధ్యతలు చేపట్టడానికి మాత్రం మరికొంత సమయం పట్టనుంది. ఇందుకోసం ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. మరోవైపు రెండు వారాల్లో తన తల్లి ఎలిజబెత్ అంత్యక్రియల తర్వాత ఈ ప్రక్రియ ఊపందుకోనుంది. ఆలోపు జరగాల్సిన కార్యక్రమాల్ని ఆయన రాజు హోదాలో పర్యవేక్షించబోతున్నారు.

English summary
after queen elizabeth's demise, king charles III has proclaimed today as king of britain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X