ఫలితాల తర్వాత అల్లర్లు : ఆరుగురి మృతి : ఎక్కడంటే ?
జకార్తా : ఇండోనేషియా అధ్యక్ష ఫలితాలు నిరసనకు వేదికయ్యాయి. గత నెల 17న జరిగిన ఎన్నికల ఫలితాలను మంగళవారమే ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం వెల్లడించాల్సి ఉంది. అయితే దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఒకరోజు ముందుగా విడుదల చేశారు. అయినా ఆందోళనకారులు రెచ్చిపోయారు. దాడులకు తెగబడటంతో ఇప్పటివరకు ఆరుగురు మృతిచెందారు.
మిన్నంటిన ఆందోళనలు
ఫలితాలు విడుదలయ్యో లేదో అభ్యంతరాలు మిన్నంటాయి. రాజధానిలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఫలితాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. దీంతో ఆరుగురు చనిపోయారు. మృతుల్లో ఇండోనేషియా నేషనల్ పోలీస్ చీఫ్ టిటో కర్ణవియన్ కూడా ఉన్నట్టు స్థానిక వైద్యులు పేర్కొనడం సంచలనం కలిగిస్తోంది. నిరసనకారుల ఆందోళనలో పోలీస్ బాస్ చనిపోవడం సర్వత్రా విస్మయం కలిగిస్తోంది. మరో 200 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. అల్లర్ల తర్వాత ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. దాదాపు 60 మందిని అదుపులోకి తీసుకున్నట్టు వారు వివరించారు.

తిరిగి ఎన్నిక .. ఎగిసిన జ్వాల
ఇండోనేషియాలో అధ్యక్షుడు జోకో విడోడో తిరిగి ఎన్నికయ్యారు. వాస్తవానికి జోకో విడోడోపై దేశంలో అసంతృప్తి ఉంది. ఆయన ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రజలు నిరసన చేపట్టారు. ఈ ఆందోళనతో ఇండోనేషియా రక్తమోడింది. మరోవైపు జోకో మోసపూరిత విధానాలతో గెలిచారని ఆయన ప్రత్యర్థి ప్రబోవో సూబియాంటో ఆరోపిస్తున్నారు. ఇటు జకర్తా గవర్నర్ అనీస్ బస్వాడెన్ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు.












Click it and Unblock the Notifications