బేర్ గ్రిల్స్ ఈజ్ బ్యాక్: తేనేటీగల దాడి తర్వాత ఈ సాహసికుడు ఎలా ఉన్నాడో చూడండి..!
బేర్ గ్రిల్స్... ఒక సాహసికుడు. ప్రధాని నరేంద్ర మోడీని ఒక సాహసయాత్రకు తీసుకెళ్లిన వ్యక్తి. ఆ సమయంలో ప్రధాని మోడీ అంతరంగాన్ని ఆయన ఆవిష్కరించారు. దీంతో ఒక్కసారిగా బేర్ గ్రిల్స్ అంటే ఎవరో ప్రతి భారతీయుడికి తెలిసింది. ఈ మధ్యే బేర్ గ్రిల్స్ ఓ సాహసం చేస్తున్న సందర్భంలో ఆయన్ను తేనెటీగలు కుట్టాయి. దీంతో ఆయనకు ఎలర్జీ వచ్చింది. ప్రాణాల నుంచి తృటిలో తప్పించుకున్న బేర్ గ్రిల్స్ వెనకడుగు వేయలేదు. తిరిగి తన సాహస యాత్రను కొనసాగించాడు.

రియాలటీ షో చేస్తుండగా తేనెటీగలు దాడి
తేనెటీగలు కుట్టిన సమయంలో ఆయన కొందరిని తనతో పాటు ఓ ద్వీపంలో ఉన్నాడు. అది పసఫిక్ ప్రాంతంలోని ఓ మారుమూల ద్వీపం. ఆ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో తేనెటీగలు అతనిపై దాడి చేశాయి. దీన్ని కూడా షూట్ చేద్దామని భావించిన బేర్‌గ్రిల్స్ తన పరిస్థితి దారుణంగా తయారవడంతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇక తేనెటీగలు దాడి చేయడంతో శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చిందని అది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉన్నట్లు బేర్ గ్రిల్స్‌కు ట్రీట్‌మెంట్ చేసిన వైద్యులు తెలిపారు. ఇక తేనెటీగలు కుట్టడంతో వాటినుంచి విడుదలైన విషం లాంటి ద్రవంను కౌంటర్ చేసేందుకు డాక్టర్లు ఎపిపెన్ అనే ఇంజెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు.

ప్రమాదాలతో ఆడుకోవడం అంటే గ్రిల్స్‌కు మహాసరదా
ఇక బేర్ గ్రిల్స్ తేనెటీగల దాడి నుంచి తప్పించుకోవడం ఇది తొలిసారి కాదు. 2016లో కూడా ఓ సర్వైవర్ సిరీస్ కోసం షూట్ చేస్తున్న సమయంలో తేనె కోసం తేనెతట్టును కదిపాడు. ఆ సమయంలో బేర్ గ్రిల్స్ కళ్లపై స్వెల్లింగ్ వచ్చేసింది. దీంతో తన ఫోటోను చూసిన చాలామంది బేర్ గ్రిల్స్ కాస్త ప్రముఖ నటుడు బెనిడిక్ట్ కంబర్ బ్యాచ్‌లా ఉన్నాడంటూ కామెంట్ చేశారు. బేర్ గ్రిల్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ సెప్టెంబర్‌లోనే టెలికాస్ట్ కానుంది. ఇదొక రియాలటీ షో. ఇందులో ప్రిన్స్ ఫిలిప్ బంధువైన ఓ 75 ఏళ్ల బామ్మ కూడా పాల్గొంటున్నారు.

ఆసక్తికరంగా మారిన ట్రెజర్ ఐలాండ్ రియాలటీ షో
ఇక ఈ షో పేరు ట్రెజర్ ఐలాండ్ విత్ బేర్ గ్రిల్స్ అని పెట్టారు నిర్వాహకులు. ఈ రియాలటీ షోలో 12 మంది పోటీదారులు ఉంటారు. వీరంతా లక్ష పౌండ్ల స్టెర్లింగ్‌ల కోసం పోటీపడుతున్నారు. ఇందులో డజను మంది పోటీదారులు ఒక ద్వీపం పై 35 రోజుల పాటు ఉంటారు. ఇక వారంతా ఈ 35 రోజులు సొంతంగా ఆహారం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఉండేందుకు సొంత గూడును నిర్మించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు తాగునీరు కూడా సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ ద్వీపంపై ప్రైజ్ మనీని ఓ చోట ఉంచారు. అది ఎక్కడుందో కనుగొనాల్సి ఉంటుంది. అయితే పోటీ నుంచి మధ్యలోనే నిష్క్రమిస్తే వారికి ఎలాంటి బహుమతి ఉండదు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications