వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ద నేరస్తుడెవరు ? దాన్ని ఎవరు నిర్ధారించాలి ? పుతిన్ పై యుద్ధ నేరాల విచారణ సాధ్యమేనా ?

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభమై మూడు వారాలు దాటిపోయింది. అయినా ఇప్పటికీ రష్యాగెలిచిందీ లేదు ఉక్రెయిన్ ఓడిందీ లేదు. కానీ ఓ యుద్ధంలో ఎంత నష్టం జరగాలో అంతకంటే ఎక్కువగానే జరిగిపోయింది. ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. రేపు యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో తర్వాత.. ఈ యుద్ధానికి, ఇంతమంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారకులెవరు ? యుద్దనేరస్తులుగా ప్రకటించాలంటే ఎవరిని ప్రకటించాలి, ఎవరు దాన్ని నిర్ధారించాలన్న దానిపై స్పష్టమైన విధానాలు ఉన్నాయి.

యుద్ధ నేరస్తుల గుర్తింపు

యుద్ధ నేరస్తుల గుర్తింపు

రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో వేలాది మంది అమాయక పౌరులు చనిపోతున్నారు. వీరికి యుద్ధంతో కానీ, అధినేతల నిర్ణయాలతో కానీ ఎలాంటి సంబంధం లేదు. వీరు కేవలం భౌగోళికంగా ఆ ప్రాంతంలో నివసిస్తున్నారనే ఏకైక కారణంతో అకారణంగా అసువులు బాసాల్సిన పరిస్ధితి. దీన్ని నివారించేందుకు ఏ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలియదు కానీ ఇందుకు కారకుల్ని మాత్రం చరిత్ర క్షమించేలా లేదు. దీంతో యుద్ధ నేరస్తుల్ని గుర్తించి శిక్షించాలన్న డిమాండ్లు అంతర్జాతీయంగా ఊపందుకుంటున్నాయి.

పుతిన్ ను యుద్ధనేరస్తుడంటున్న యూఎస్

పుతిన్ ను యుద్ధనేరస్తుడంటున్న యూఎస్

ఉక్రెయిన్ లో ఆసుపత్రులు, ప్రసూతి వార్డుల్ని సైతం వదిలిపెట్టకుండా బాంబు దాడులు చేస్తున్న రష్యాపై యూఎస్ మండిపడుతోంది. తాజాగా అమెరికా సెనేట్ లో యుద్ధానికి కారకుడైన రష్యా అధినేత పుతిన్ ను యుద్ధ నేరస్తుడిగా గుర్తిస్తూ ఓ ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా పుతిన్‌ను "యుద్ధ నేరస్థుడిగా అభివర్ణిస్తున్నారు. కానీ ఒకరిని యుద్ధ నేరస్థుడిగా ప్రకటించడం కేవలం మాటలు చెప్పినంత సులభం కాదు. ఎవరు యుద్ధ నేరస్థుడో, వారిని ఎలా శిక్షించాలో నిర్ణయించడానికి నిర్వచనాలు, ప్రక్రియలు ఉన్నాయి.

యుద్ధ నేరస్తుడిగా గుర్తించాలంటే

యుద్ధ నేరస్తుడిగా గుర్తించాలంటే


ఓ వ్యక్తిని యుద్ధనేరస్తుడిగా గుర్తించేందుకు గతంలో ప్రపంచ నేతలు చేసుకున్న ఓ అవగాహనా ఒప్పందం ఆధారంగా అమల్లో ఉన్న ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. ఇందులో సాయుధ యుద్ధం సందర్భంగా సదరు వ్యక్తుల వ్యవహరించిన తీరుపై విచారణ జరుగుతుంది. ఆ తర్వాత ఆరోపణలు రుజువైతే యుద్ధ నేరస్తుడిగా నిర్ణయిస్తారు. ఆ తర్వాత తదుపరి శిక్షల ఖరారు,అమలువంటి చర్యలు తీసుకుంటారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ నేరస్తుల గుర్తింపు, విచారణ, శిక్షలు ఖరారు అవుతున్నాయి. డాక్టర్లు, నర్సులు, గాయపడిన సైనికులు, యుద్ధ ఖైదీల వంటి పౌరులతో సహా పోరాటంలో పాల్గొనని, ఇకపై పోరాడలేని వ్యక్తులను రక్షించడం ఈ నియమాల లక్ష్యం. ఒప్పందాలు, ప్రోటోకాల్‌లు ఎవరిని ఏ ఆయుధాలతో లక్ష్యంగా చేసుకోవచ్చో తెలియజేస్తాయి. రసాయన లేదా జీవసంబంధమైన ఏజెంట్లతో సహా కొన్ని ఆయుధాలు ఇందులో నిషేధించారు.

యుద్ధనేరాలు ఇవే

యుద్ధనేరాలు ఇవే

అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ మానవాళికి వ్యతిరేకంగా చేసిన నేరాలను కూడా ఏ పౌర జనాభాపైనా విస్తృతంగా లేదా క్రమబద్ధమైన దాడికి గురిచేస్తుందనే సందర్భంలో విచారణ చేస్తుంది. యుద్ధాల సమయంలో జరిగే హత్య, నిర్మూలన, బలవంతంగా బదిలీ, హింస, అత్యాచారం, లైంగిక బానిసత్వం వంటి వాటిని యుద్ధ నేరాలుగా గుర్తించారు.

 యుద్ధ నేరస్తుడిగా గుర్తించాలంటే

యుద్ధ నేరస్తుడిగా గుర్తించాలంటే


పుతిన్ యుద్ధ నేరస్థుడిగా చిత్రీకరించడానికి ఉన్న ఏకైక మార్గం యుద్ధంలో కమాండ్ బాధ్యత. అంటే యుద్ధంలో కమాండ్ ఇచ్చే ఆదేశాలు, వాటి అమలు ఆధారంగా పుతిన్ ను యుద్ధ నేరస్తుడిగా గుర్తించవచ్చు. కమాండర్లు ఆదేశిస్తే లేదా తెలిసినా లేదా నేరాల గురించి తెలుసుకునే స్థితిలో ఉంటే, వాటిని నిరోధించడానికి ఏమీ చేయకపోతే, వారు చట్టబద్ధంగా యుద్ధానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

యుద్ధ నేరాల విచారణ ఇలా...

యుద్ధ నేరాల విచారణ ఇలా...

సాధారణంగా, ప్రతిదానికి పరిమితులు ఉన్నప్పటికీ, యుద్ధ నేరాలను పరిశోధించడానికి, గుర్తించడానికి నాలుగు మార్గాలు ఉన్నాయి. ఒకటి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ద్వారా నేరుగా గుర్తించవచ్చు. రెండోది పుతిన్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి ఐక్యరాజ్యసమితి తమ విచారణ కమిషన్ ను మించిన హైబ్రిడ్ అంతర్జాతీయ యుద్ధ నేరాల ట్రైబ్యునల్ కు పంపడం జరుగుతుంది. మూడో విధానంలో నాటో, ఈయూ, యూఎస్ వంటి సంస్ధలు, దేశాలు కలిసి పుతిన్ విచారణకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేయడం. గతంలో జర్మనీ నాజీ నేతలకు వ్యతిరేకంగా ఇలా ఏర్పాటు చేసారు చివరిగా కొన్ని దేశాలు యుద్ధ నేరాలను విచారించడానికి వారి స్వంత చట్టాలను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు జర్మనీ ఇప్పటికే పుతిన్‌పై విచారణ జరుపుతోంది. యూఎస్ లో అలాంటి చట్టం లేదు, కానీ న్యాయ శాఖలో అంతర్జాతీయ మారణహోమం, హింస, బాల సైనికుల నియామకం స్త్రీ జననేంద్రియ వికృతీకరణ వంటి చర్యలపై దృష్టి సారించే ప్రత్యేక విభాగం ఉంది. ఇది కూడా విచారణ జరవచ్చు.

Recommended Video

Russia Ukraine Conflict : I'm Not Hiding In A Bunker Like Putin - Zelenskyy | Oneindia Telugu
 పుతిన్ ను రప్పించగలరా ?

పుతిన్ ను రప్పించగలరా ?

అలాగే పుతిన్ ను యుద్ధ నేరస్తుడిగా ఆయా దేశాలు, సంస్ధలు గుర్తించినప్పటికీ.. ఆయన్ను అంతర్జాతీయో కోర్టుకు విచారణకు పిలిపించే అవకాశాలు ఉండవు. ఎందుకంటే అంతర్జాతీయ కోర్టు పరిధిని రష్యా ఇప్పటివరకూ గుర్తించలేదు. అలాగే హేగ్ లోని అంతర్జాతీయ కోర్టుకు అనుమానితుల్ని రష్యా పంపదు. అలాగే యూఎస్ కోర్టు పరిధిని కూడా రష్యా గుర్తించలేదు. అటువంటప్పుడు ఐరాస ఎంపిక చేసిన దేశంలో లేదా సంబంధిత దేశాల కన్సార్టియం ద్వారా పుతిన్ విచారించే అవకాశం ఉంటుంది. దానికి కూడా పుతిన్ వెళ్లడం అనుమానమే.
ఓ వ్యక్తిని యుద్ధ నేరస్తుడిగా గుర్తించేందుకు

English summary
after us senate's delacation of russian president vladimir putin as war criminal, now questions arised on who is war criminal and how one shold decide it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X