• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'వృద్ధాప్యం ఒక వ్యాధి... దాన్ని నయం చేయవచ్చు' - హార్వర్డ్ శాస్త్రవేత్త డేవిడ్ సింక్లెయిర్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వృద్ధాప్యం

ప్రతి ఒక్కరి జీవితంలో వృద్ధాప్యం అనేది సహజం, అనివార్యం. చాలా మంది ఇలాగే అనుకుంటారు. కానీ, జన్యు శాస్త్రవేత్త డేవిడ్ సింక్లెయిర్ మాత్రం దీన్ని ఒప్పుకోరు.

కొన్ని సాధారణ అలవాట్లతో వృద్ధాప్యాన్ని నెమ్మదించేలా చేసి సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం సుసాధ్యం చేసుకోవచ్చని దాదాపు రెండు దశాబ్దాలకు పైగా తాను చేసిన అధ్యయనాల ఆధారంగా సింక్లెయిర్ చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న మందులతో కూడా వృద్ధాప్యాన్ని నెమ్మదింప చేయడం త్వరలో సాధ్యమవుతుందని సింక్లెయిర్ అభిప్రాయపడ్డారు.

సింక్లెయిర్ ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్, అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పోస్ట్-డాక్టరేట్ పొందారు.

మనుషుల్లో ఎందుకు వృద్ధాప్యం వస్తోందనే అంశంపై హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సింక్లెయిర్‌ జన్యు పరిశోధనలు చేస్తున్నారు.

డెవిడ్

ఈ రంగంలో చేస్తున్న కృషికిగానూ ఈయన డజన్ల కొద్ది అవార్డులు అందుకున్నారు. టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా ఆయన ఎంపికయ్యారు.

సింక్లెయిర్ ఇప్పటికే 35 పేటెంట్లను పొందారు. కొన్ని బయోటెక్నాలజీ కంపెనీలను స్థాపించారు. మరికొన్నిటిలో పరిశోధనల్లో భాగస్వామిగా ఉన్నారు. వాటిలో కొన్ని కంపెనీలు వృద్ధాప్యాన్ని తగ్గించడం లేదా నిరోధించడంపై పరిశోధనలు చేస్తున్నాయి.

2019లో ఈ పరిశ్రమ లక్షా 10 వేల మిలియన్‌ డాలర్ల (దాదాపు 828 లక్షల కోట్ల రూపాయలు) టర్నోవర్ కలిగి ఉందని, 2025 నాటికి అది 6 లక్షల మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 4.5 వేల లక్షల కోట్లు)కు చేరుకుంటుందని మెరిల్ లించ్ బ్యాంక్ అంచనా వేసింది.

"లైఫ్‌ స్పాన్" అనే పుస్తకాన్ని కూడా సింక్లెయిర్ రాశారు. ఇది బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ప్రజలు నమ్ముతున్నట్టు వృద్ధాప్యం అనివార్యం కాదని ఈ పుస్తకంలో పేర్కొన్నారు.

'వృద్ధాప్యాన్ని నయం చేయగల ఒక వ్యాధిగా చూడాలి'

వృద్ధాప్యం గురించి మనం ఆలోచించే విధానాన్ని సమూలంగా మార్చుకోవాలని సింక్లెయిర్ పేర్కొన్నారు.

దీనిని సాధారణమైన, సహజమైన ప్రక్రియగా భావించే బదులు ఒక వ్యాధిగా పరిగణించాలని, చికిత్స చేయగలిగే లేదా నయం చేయదగినదిగా చూడాలన్నారు.

వృద్ధాప్యంపై మన దృక్పథంలో సమూల మార్పుతోనే మానవాళి తన ఆయుష్షును గణనీయంగా పెంచుకోగలుగుతుందని సింక్లెయిర్ చెప్పారు.

ఈ అంశంలో వైద్యపరంగా మెరుగైన ఫలితాలు సాధించడానికి తమకు ఇంకా రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని బీబీసీ బ్రెజిల్‌తో సింక్లెయిర్ చెప్పారు. బీబీసీ ప్రతినిధి అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

Envejecimiento

ప్రశ్న: మనం ఎందుకు ముసలివాళ్లమవుతాం?

డేవిడ్ సింక్లెయిర్: వృద్ధాప్యానికి సంబంధించిన తొమ్మిది ప్రధాన కారణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ కారణాల్లో సమాచార నష్టం అత్యంత ముఖ్యమైన కారణమని గత 25 సంవత్సరాలుగా చేస్తున్న పరిశోధనలో నేను గుర్తించాను.

మన శరీరంలో రెండు రకాల సమాచారం ఉంటుంది. మన తల్లిదండ్రుల నుంచి సంక్రమించే సమాచారం. ఇది సమయం, పర్యావరణ ప్రభావాన్ని బట్టి మారుతుంది.

ఒకటి "డిజిటల్" సమాచారం జన్యు కోడ్ కాగా, మరొకటి అనలాగ్‌. ఎపిజెనోమ్ అనేది కణంలోని వ్యవస్థ. ఇది జన్యువుల ప్రతిస్పందనలను నియంత్రిస్తుంది.

కణంలోని 20,000 జన్యువుల ప్రతిస్పందనలు ఆ కణం చర్యలను నియంత్రిస్తాయి.

కానీ, కాలక్రమేణా, ఎపిజెనోమ్ సమాచారాన్ని కోల్పోతుంది. సీడీల మీద ఏర్పడే గీతల కారణంగా సమాచార లోపం సమస్యలు తలెత్తినట్టే, కణాలలోని జన్యువులు సరైన పని తీరు కనబరచకపోవడం వల్ల కాలక్రమేణా సమాచార నష్టం జరుగుతుంది.

మనం వృద్ధులమవ్వడానికి అదే కారణమని నేను అనుకుంటున్నాను.

Alimentos

ప్రశ్న: వృద్ధాప్యం వద్దని మీరు అంటున్నారు, ఎందుకు?

డేవిడ్ సింక్లెయిర్: జీవశాస్త్రంలో మనం తప్పనిసరిగా వృద్ధులవ్వాలని చెప్పే నిర్ధారణ ఏదీ జరగలేదు. దీన్ని ఎలా ఆపాలో మనకు తెలియదు. కానీ వేగాన్ని తగ్గించడంలో మేము మెరుగ్గా ఉన్నాం.

సీడీల మీద పడే గీతలు సమాచార నష్టం చేసినట్టే, మన రోజూ వారి దినచర్యలు మన జీవితాల మీద ప్రభావం చూపుతాయి. పనులను సరిగ్గా చేయడం వల్ల వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయవచ్చు. నేడు మనం మన జీవిత కాలాన్ని కొలవగలం. దీని కోసం రక్తం, లాలాజల పరీక్షలు చేయాల్సి ఉంటుంది.

ఎలుకలు, చిట్టెలుకలు వంటి జీవుల్లో, తిమింగలాలు, ఏనుగులు, విభిన్న జీవనశైలి ఉన్న జీవుల్లో కూడా వృద్ధాప్యం చాలా భిన్నమైన రేట్లలో సంభవిస్తుందని మేము కనిపెట్టాం. మీ ఆరోగ్యం.. మీరు ఎలా జీవిస్తున్నారనే దానిపై 80% కంటే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. కానీ, డీఎన్‌ఏపై కాదు.

ఎక్కువ కాలం జీవించే వ్యక్తులను పరిశీలించిన తర్వాత శాస్త్రవేత్తలు కొన్ని విషయాలు కనుగొన్నారు. వీటిలో సరైన ఆహారాన్ని తీసుకోవడం, తక్కువ కేలరీలు తీసుకోవడం, శారీరక వ్యాయామం వంటివి ఉన్నాయి.

Mujer haciendo ejercicio.

ప్రశ్న: వృద్ధాప్యం నెమ్మదించడానికి ఇవి ఎలా సహాయపడతాయి?

డేవిడ్ సింక్లెయిర్: శాస్త్రవేత్తలు ఈ జీవనశైలి అలవాట్లను విశ్వసించడానికి కారణం ఏమిటంటే, అవి వృద్ధాప్యానికి వ్యతిరేకంగా శరీర సహజ రక్షణను పెంచుతాయి.

శరీరం సహజ రక్షణల మూలాల్లో కొన్ని జన్యువులు ఉన్నాయి. అవి ఎపిజెనోమ్‌ను నియంత్రించి, ఆకలి ద్వారా లేదా వ్యాయామం ద్వారా రక్షణలను పెంపొందిస్తాయని అధ్యయనంలో కనుగొన్నాము. అందుకే మనం సరైనవి తినడం, ఉపవాసం ఉండటం వల్ల వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయవచ్చని నమ్ముతున్నాము.

గుండె జబ్బులు, అల్జీమర్స్, మధుమేహంవంటి చాలా వ్యాధులకు వృద్ధాప్యం కారణం.

కాబట్టి వృద్ధాప్యాన్ని నెమ్మదించవచ్చనే ఆలోచన మిమ్మల్ని బలంగా చేస్తుంది. ఎక్కువ కాలం జీవించేలా చేస్తుంది.

ప్రశ్న: నేచర్ జర్నల్‌లో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం వానరాల వృద్ధాప్యంలో స్థిరమైన రేటు ఉంది. అంటే ఇది మీ ప్రయోగాలకు వ్యతిరేకంగా ఉంది. మనం వృద్ధాప్యాన్ని నెమ్మదించలేము లేదా ఆపలేమని సూచిస్తుంది కదా?

డేవిడ్ సింక్లెయిర్: గతంతో పోలిస్తే ఎన్నో విషయాల్లో మార్పులు వచ్చాయి. టెక్నాలజీ వచ్చింది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది.

మనం ఉపయోగించే సాంకేతికతతో జీవశాస్త్రాన్ని అధిగమించగలుగుతున్నాము. సమస్యలను టెక్నాలజీ పరిష్కరిస్తుంది. మునుపటి కంటే మెరుగైనదిగా చేస్తుంది.

మనది ఆవిష్కరణ చేసే జాతి. సాంకేతిక పరిజ్ఞానం లేకుండా మనం మనుగడ సాగించలేం.

పది లక్షల ఏళ్లుగా మనం చేస్తున్నది కూడా అదే. దీనిని అధిగమించడానికి సాంకేతికతలను కూడా మేము కనుగొంటాము.

మనం వారసత్వంగా పొందిన మన ఆరోగ్య పరిమితులను అధిగమించడానికి ఇది తదుపరి దశ.

మనం రోజూవారి జీవితంలో దీన్ని చేస్తున్నాము. ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల మన శరీరం రోగ నిరోధక శక్తిని సంపాదిస్తుంది. దుస్తులు ధరించడం వల్ల మన శరీర చర్యలను మార్చగలము.

Mujer enferma

ప్రశ్న: మీరు వృద్ధాప్యానికి భిన్నమైన విధానాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రక్రియకు వ్యాధిలాగా చికిత్స చేయడం ఎందుకు?

డేవిడ్ సింక్లెయిర్: అనారోగ్యం అనేది కాలక్రమేణా సంభవించే ప్రక్రియ. అది వైకల్యం లేదా మరణానికి దారితీస్తుంది. ఇది ముసలితనానికి సమానం.

కానీ ఇక్కడ తేడా ఏమిటంటే.. జీవిత కాలంలో సగం కంటే తక్కువ జనాభా అనారోగ్యానికి గురవుతారని చెప్పడం. ఈ వర్గీకరణ సరికాదు. దీనినే మార్చాలి.

వృద్ధాప్యం ఒక వ్యాధి. ఇది సాధారణం, సహజం అయినంత మాత్రాన అందరికీ ఆమోదయోగ్యం కానవసరం లేదు.

అది క్యాన్సర్ కంటే పెద్దది కాదు. దీనికి చికిత్స చేయగలమని మేము నిరూపిస్తున్నాము. వృద్ధాప్యాన్ని నెమ్మదించేలా లేదా రాకుండా నిరోధించవచ్చు.

వృద్ధాప్యాన్ని వ్యాధిగా గుర్తించకపోవడం అంటే, అనేక సంవత్సరాలుగా ఆరోగ్యకరమైన జీవితాలను ప్రజలకు అందిస్తున్న ఔషధాలను సూచించడానికి వైద్యులు సంకోచించడమే.

అందువల్ల వృద్ధాప్యం అనేది ఒక వ్యాధి లేదా కనీసం చికిత్స చేయగల వైద్య పరిస్థితి అని మనం ప్రకటించాలి.

ప్రశ్న: మన ప్రస్తుత అవగాహనకు ఇది చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వృద్ధాప్యాన్ని మనం అనివార్యంగా చూస్తున్నాం. కానీ, అది అనివార్యం కాదని, దానికి చికిత్స చేసి, ఆలస్యం లేదా రివర్స్ చేయవచ్చని మీరు చెబుతున్నారు. ఇది ఒక ప్రతిపాదన మాత్రమే కదా?

డేవిడ్ సింక్లెయిర్: ఒక విమానాన్ని నడపడం లేదా యాంటీబయాటిక్స్, కంప్యూటర్లను ఉపయోగించడం లాంటి ప్రతిపాదనలు ఎలానో ఇది కూడా అలాంటిదే.

ఇది మానవ జాతి అనుసరించాల్సిన మార్గం.

ఈ రోజు మనం చాలా రకాల వ్యాధులను నయం చేస్తున్నప్పటికీ, ఆయుర్దాయం సగటు మెరుగుదల కేవలం రెండు సంవత్సరాలలోపే ఉంటోంది. మనం వైద్యం, ఎక్కువ రోజులు బతకడంలో గణనీయమైన పురోగతిని సాధించాలనుకుంటే ఈ రంగంలో మనం మరింత కృషి చేయాలి.

Mujeres nadando

ప్రశ్న:ప్రయోగశాలలో మీరు వృద్ధాప్యాన్ని తగ్గించగలరా?

డేవిడ్ సింక్లెయిర్: వృద్ధాప్యాన్ని సురక్షితంగా తిప్పికొట్టగలమా అని తెలుసుకోవడానికి మేము అనేక జన్యువులపై పరీక్షలు చేశాం.

చాలా సంవత్సరాలు మాకు విజయాలు లభించలేదు. మా ప్రయోగశాలలో ఈ కణాలు క్యాన్సర్‌ బారిన పడ్డాయి.

కానీ, కణాలు తమ గుర్తింపును కోల్పోకుండా వృద్ధాప్యాన్ని సురక్షితంగా వెనక్కినెట్టే 'యమనాకా' కారకాలుగా పిలిచే మూడు జన్యువులను మేము గుర్తించాం. ఇది మానవ చర్మ కణాలు, నరాల కణాల్లో జరిగింది.

దెబ్బతిన్న ఆప్టిక్ నరాలతో ఉన్న ఎలుకలపై వాటిని ప్రయోగించాము. ఈ ఎలుకలలో 'యమనాకా' కారకాలను ఉత్తేజితం చేయడం వల్ల వాటికి తిరిగి చూపు తీసుకురాగలిగాము.

ప్రశ్న: భవిష్యత్తులో ఇది మానవులకు వర్తిస్తుందా?

డేవిడ్ సింక్లెయిర్: అది నమ్మే పెట్టుబడిదారులు ఉన్నారు. ఈ ఉదయం నేను వారితో ఫోన్‌లో మాట్లాడాను.

ఎలుకలపై రెండేళ్ల నుంచి చేస్తున్న అధ్యయనాలు ఆశాజనకంగా ఉన్నాయి. మనుషుల్లో అంధత్వాన్ని నయం చేయగలమా లేదా అని పరీక్షించడానికి రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో వారిపై మొదటి క్లినికల్ ట్రయల్స్‌ చేయబోతున్నాం.

Hojas

ప్రశ్న: వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడానికి మందులపై పరిశోధనలు జరుగుతున్నాయి కదా? ఇప్పటివరకు సైన్స్ ఏం కనుగొంది?

డేవిడ్ సింక్లెయిర్: వృద్ధాప్యం నెమ్మదించేలా చేయడం, జంతువుల జీవితాన్ని పొడిగించడంలాంటి వాటిని మానవ అధ్యయనాల్లో నిరూపించే సహజ, కృత్రిమ అణువులు ఉన్నాయి.

కనీసం రెండు మందులు మార్కెట్లో ఉన్నాయి. అందులో ఒకటి మెట్‌ఫార్మిన్‌.

టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఇచ్చే మెట్‌ఫార్మిన్‌తో డయాబెటిస్ లేని వ్యక్తుల కంటే డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువ కాలం జీవిస్తారని మా పరిశోధనలో నమ్మకమైన సంకేతాలు వచ్చాయి.

మెట్‌ఫార్మిన్ తీసుకున్న వేలాది మందిలో క్యాన్సర్, గుండె జబ్బులు అల్జీమర్స్‌ ప్రభావ రేట్ల గణాంకాలను ఇప్పుడు ఒక అధ్యయనం పరిశీలిస్తోంది.

ప్రశ్న:ఈ ప్రయోగాలు దేని కోసం, ఎప్పుడూ బతికి ఉండటానికేనా?

డేవిడ్ సింక్లెయిర్: లేదు (నవ్వుతూ).

ప్రశ్న: వైద్య పరిశోధన ప్రయోజనం ఏంటి? మనకు సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితాలు ఉండేలా చేస్తారా?

డేవిడ్ సింక్లెయిర్: అవును, ఇక్కడ కూడా అదే గమనించవచ్చు. వ్యత్యాసం ఏమిటంటే, ఆ వ్యాధులు సంభవించిన తర్వాత వాటికి గురి కాకుండా, వ్యాధి కారక మూలాల్లోకి వెళ్లి పరిశీలిస్తున్నాం.

మూల కారణాలపై దాడి చేయడం అంటే మొత్తం శరీరంపైనే దీని ప్రభావం ఎక్కువగా పడుతుంది.

మేం కేవలం గుండె వృద్ధాప్యాన్ని నెమ్మదించడమే కాకుండా, మెదడు వృద్ధాప్యాన్ని తగ్గించడం కూడా చేయాలి. అలా చేయకపోతే అల్జీమర్స్ వ్యాధి బారిన పడే వారు పెరుగుతారు.

శరీరంలోని అన్ని భాగాలను ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచే విధానం మనకు అవసరం. అలాంటి విధానాన్నే మేము అనుసరిస్తున్నాం.

Abuelos

ప్రశ్న: సమాజంపై ఈ ఆవిష్కరణల ప్రభావం ఎంత వరకు ఉంటుంది?

డేవిడ్ సింక్లెయిర్: మీరు 90 ఏళ్ల పైబడి ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉండటం వల్ల వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయి. అంతకు మించి మీ మనుమరాళ్లతో ఆడుకోవడం, మీ పిల్లలకు భారం కాకుండా మీ పని మీరే చేసుకోవచ్చు. దీంతోపాటు ఇతర ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి.

నా సహోద్యోగులు, నేను కొంతమంది లండన్ ఆర్థికవేత్తలు వేసుకున్న అంచనా ప్రకారం, యూఎస్‌లో మాత్రమే, కేవలం రెండు సంవత్సరాల జీవితకాలం పొడిగించడం వల్ల రాబోయే కొన్ని దశాబ్దాల్లో ఆర్థిక వ్యవస్థకు 86 బిలియన్ డాలర్ల విలువ జోడించినట్టు అవుతుంది. మనం ఆరోగ్యకరమైన జీవితాలను పది సంవత్సరాలు పొడిగిస్తే, అది 300 బిలియన్ డాలర్లు అవుతుంది.

ప్రజలు అనారోగ్యంతో లేనందున, అమెరికాలో వ్యాధి సంరక్షణ కోసం ఖర్చు చేసే ట్రీలియన్ డాలర్లు మిగులుతాయి. దీన్ని వైద్య సంరక్షణకు మించి చూడాలనుకుంటున్నాను. ఉదాహరణకు, ఈ డబ్బు విద్య కోసం లేదా వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఖర్చు చేస్తే సమాజంలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రశ్న: ఈ పరిశ్రమ త్వరలో వందల మిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని మెరిల్ లించ్ పేర్కొంది. ఎందుకు ఇంతలా పెట్టుబడులు పెడుతున్నారు ఎందుకీ ఆసక్తి?

డేవిడ్ సింక్లెయిర్: ఇది ప్రపంచంలోనే తీర్చలేని గొప్ప అవసరాలలో ఒకటి. ఈ పురోగతుల వల్ల ప్రయోజనం పొందని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరు. ఆఖరికి పిల్లలకు కూడా ప్రయోజనమే.

వ్యాధికి వ్యతిరేకంగా శరీర సహజ రక్షణను పెంచే సామర్థ్యాన్ని పెంపొందించడంతో ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మారుస్తుంది. రాబోయే దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బిలియన్ల డాలర్లను ఆదా చేస్తుంది.

ఇది యాంటీబయాటిక్స్‌కు ముందు ఉన్న ప్రపంచం నుండి ఇప్పటిలాగే భిన్నమైన ప్రపంచాన్ని సృష్టిస్తుంది.

ప్రశ్న: వృద్ధాప్యం నెమ్మదించడంపై కొన్ని సంస్థల భాగస్వామ్యంతో మీరు పరిశోధనలు చేస్తున్నారు. ఎవరైనా కేవలం లాభం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు అనిపించలేదా?

డేవిడ్ సింక్లెయిర్: ప్రజలను ఆరోగ్యవంతులుగా చేయడమే నా లక్ష్యం. ఔషధాలను తయారు చేయడానికి ఏకైక మార్గం వాటిని అభివృద్ధి చేయడానికి బృందాలను ఏర్పాటు చేసి సమిష్టిగా కష్టపడటం. నేను చేస్తున్నది అదే.

ప్రశ్న: మీరు దీనిని వ్యవస్థాపకుడిగా కాకుండా పరిశోధకుడిగా చేయలేరా?

డేవిడ్ సింక్లెయిర్: అలా వీలు కాదు. ఒక్క ఔషధాన్ని తయారు చేయడానికి మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది.

ప్రశ్న: కానీ, కంపెనీల్లో భాగస్వామ్యం కావడం వల్ల మీరు చెబుతున్న సైన్స్‌పై కొంతమందికి అనుమానం వస్తుందని మీరు అనుకోలేదా?

డేవిడ్ సింక్లెయిర్: నా సైన్స్ దానికదే నిలుస్తుంది. ఇది తప్పు అని నిరూపణ కాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
'Aging is a disease, it can be cured' - Harvard scientist David Sinclair
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X