వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

X.com: కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌ రూటు మార్చారు. ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్‌, ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా అధిపతిగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్‌ ఇప్పుడు సొంతంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు పోటీగా దీన్ని తీసుకుని రానున్నారనే ప్రచారం కార్పొరేట్ సెగ్మంట్‌లో విస్తృతంగా వినిపిస్తోంది.

ట్విట్టర్ దెబ్బకు..

ట్విట్టర్ దెబ్బకు..

ఇప్పటికే ఆర్థికపరమైన ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారాయన. ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి టెస్లాలో తనకు ఉన్న వాటాల్లో కొంత మొత్తాన్ని అమ్ముకున్నారు. ట్విట్టర్‌తో న్యాయపోరాటం చేయాల్సి వచ్చినందున దానికి అయ్యే ఖర్చుల కోసమే ఈ షేర్లను విక్రయించినట్లు ఎలాన్ మస్క్ చెప్పారు. 6.9 బిలియన్ డాలర్ల విలువ చేసే టెస్లా షేర్లను విక్రయించారు. టెస్లాలో మొత్తంగా ఎలాన్ మస్క్‌కు 155.04 మిలియన్ల షేర్లు ఉన్నాయి.

ఎదురుదాడితో..

ఎదురుదాడితో..

టెస్లా షేర్లను అమ్ముకోవడం ఇది రెండోసారి. ఇదివరకూ ఆయన తన స్టేక్స్‌ను అమ్మాడు. దీనితో ఇప్పటివరకు టెస్లాలో తనకు ఉన్న వాటా విలువ 32 బిలియన్ డాలర్ల మేర తగ్గించుకున్నట్టయింది. 44 బిలియన్ డాలర్ల విలువ చేసే ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాలను ఎలాన్ మస్క్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ట్విట్టర్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించినప్పటి నుంచీ ఎలాన్ మస్క్ దాని మీద అనేక రకాల కొర్రీలు పెడుతూ వచ్చారు. ఈ డీల్ రద్దయిన తరువాత- ట్విట్టర్ యాజమాన్యం ఎలాన్ మస్క్‌పై ఎదురుదాడికి దిగింది.

Recommended Video

అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కి సినిమా కష్టాలు *Inernational | Telugu OneIndia
కొత్త ప్లాట్‌ఫామ్..

కొత్త ప్లాట్‌ఫామ్..

ఈ పరిణామాల మధ్య ట్విట్టర్‌కు పోటీగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకుని రావాలని భావిస్తోన్నట్లు చెబుతున్నారు. దీనికి ఎక్స్ డాట్ కామ్ (X.com) అనే పేరును కూడా ఖరారు చేశారని తెలుస్తోంది. `టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ` అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి అడిగిన ప్రశ్నకు ఎలాన్ మస్క్ సమాధానం ఇచ్చాడు. ట్విట్టర్ డీల్ కార్యరూపాన్ని దాల్చలేకపోయినందున సొంతంగా ఏదైనా మరో సోషల్ మీడియాను అందుబాటులోకి తీసుకుని వచ్చే ఆలోచన ఉందా? అంటూ యూజర్లు ఆయనను ప్రశ్నించారు.

అలాంటి మీడియానా?

అలాంటి మీడియానా?

దీనికి ఎక్స్ డాట్ కామ్ అంటూ తన రిప్లైని పోస్ట్ చేశాడు ఎలాన్ మస్క్. సాధారణంగా `ఎక్స్` అనే పదాన్ని పోర్న్ సంబంధిత విషయాల కోసం వాడుతుంటారు. ఎలాన్ మస్క్‌కూ అలాంటి వివాదాలూ ఉన్నాయి. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ భార్యతో అక్రమ సంబంధాలను కొనసాగించాడనే ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు. దీన్ని ఆయన తోసిపుచ్చినప్పటికీ.. ఈ వివాదం మాత్రం సద్దుమణగలేదు. ఇప్పుడు X.com అనే పేరుతో సోషల్ మీడియాను తీసుకుని వచ్చే ఉద్దేశం ఉందంటూ చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

English summary
Ahead of legal battle with Twitter, Is Elon Musk coming up with new social media platform X.com.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X