గగనతలంలో ఉల్లంఘనలు: వైట్‌హౌస్ ఖాళీకి ఆదేశాలు, అరగంటలో..

వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీ ప్రాంత గగనతలంలో ఉల్లంఘనలు జరిగినట్లు సమాచారం రావడంతో యూనైటెడ్ స్టేట్ అధ్యక్ష భవనం వైట్ హౌస్ మూసివేసినట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

గగనతలంలో ఉల్లంఘనల నేపథ్యంలో పలు యుద్ధ విమానాలు ఆ ప్రాంత గగనతలంలో విహరించాయి. ఈ క్రమంలో అమెరికా రాజధాని నగరంలోని కార్యాలయాలను ఖాళీ చేసినట్లు తెలిసింది. కాగా, మంగళవారం ఓ చిన్న విమానం నిషేధిత ప్రాంతంలో సంచరించిందని అధికారులు తెలిపారు.

 Air space violation, white House lock down

ఆ విమానం గగనతల నిబంధనలను ఉల్లంఘించిందని వెల్లడించారు. కాగా, కేవలం అరగంటలోనే ఆ భవనాలను ఖాళీ చేయాలనే ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. ఆ సమయంలో యూఎస్ సీక్రెట్ సర్వీస్ పర్సనల్స్.. సిబ్బంది స్థానంలో ఉండాలని సూచనలు వచ్చినట్లు సమాచారం.

మంగళవారం ఉదయం 8.30గంటల ప్రాంతంలో క్యాపిటల్ పోలీసులు ఓ హెచ్చరికను జారీ చేసినట్లు తెలిసింది. వెంటనే కార్యాలయాల ఖాళీకి ఆదేశాలు జారీ అయ్యాయి. అరగంట తర్వాత మళ్లీ వారిని కార్యాలయాలకు అనుమతించడం జరిగిందని అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+