Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

SCO సదస్సు నుంచి అజిత్ దోవల్ వాకౌట్..!!

SCO Summit 2025:ప్రస్తుతం ప్రపంచ అగ్రదేశాల కళ్లు చైనాలో జరుగుతోన్న షాంఘై సహకార(SCO) సదస్సుపై పడ్డాయి. ఇందుకు కారణం మూడు అగ్రదేశాలైన భారత్, చైనా, రష్యా ప్రధానులు మరో 7 దేశాధినేతలతో కలిసి సదస్సులో పాల్గొంటున్నారు. భారత్, రష్యాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధిస్తున్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య భేటీ జరగగా ఇరుదేశాలు ద్వైపాక్షిక బలోపేతంపై దృష్టి సారిస్తున్నట్లు ప్రకటించాయి.ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా ప్రధాని భేటీ అయ్యారు. ఇక ఎస్‌సీఓ సమ్మిట్‌ నుంచి అజిత్ దోవల్ వాకౌట్ చేశారు.. కంగారు పడకండి. అది తాజాగా జరుగుతున్న సమావేశంలో కాదు. 2020లో జరిగిన సందర్భంగా అజిత్ దోవల్ షాంఘై సహకార సదస్సు నుంచి వాకౌట్ చేశారు.. అలా ఎందుకు చేశారు.. కారణమేంటి..?

రెచ్చగొట్టే చర్యకు దిగిన పాకిస్తాన్
అది సెప్టెంబర్ 2020. కోవిడ్-19 మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న సమయం. దౌత్యపరమైన సమావేశాలు కూడా వర్చువల్‌గా జరుగుతున్నాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) దేశాల జాతీయ భద్రతా సలహాదారుల (NSA) సమావేశం జరుగుతోంది. అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో, పాకిస్థాన్ ప్రతినిధి డాక్టర్ మొయిద్ యూసుఫ్ చేసిన ఒక పని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

ajit-dovals-diplomatic-masterstroke-why-he-walked-out-of-a-virtual-sco-meeting

తన ప్రసంగం సందర్భంగా యూసుఫ్ కొత్తగా రూపొందించిన పాకిస్థాన్ పొలిటికల్ మ్యాప్‌ను తెరపై ప్రదర్శించారు.ఆ మ్యాప్‌లో భారత్‌లో అంతర్భాగంగా ఉన్న జమ్మూ-కశ్మీర్ మరియు జునాగఢ్‌లను పాకిస్థాన్‌లో భాగంగా చూపించాడు. బహుళపక్ష వేదికలలో ద్వైపాక్షిక వివాదాలను చర్చించకూడదనే ఎస్‌సీఓ నిబంధనను ఇది పూర్తిగా ఉల్లంఘించింది.ఈ చర్యతో సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న రష్యా,పాకిస్థాన్‌ను ఆ మ్యాప్‌ను తొలగించమని పదే పదే కోరినా,పాకిస్థాన్ ప్రతినిధి పట్టించుకోలేదు.సరిగ్గా అదే సమయంలో, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వర్చువల్ మీటింగ్ నుంచి బయటకు వచ్చేశారు.

దోవల్ బలమైన సందేశం
ఇది కేవలం ఒక చిన్న నిరసన కాదు.తన దేశ సార్వభౌమత్వం,ప్రాదేశిక సమగ్రతను ఏ వేదికపైనా ప్రశ్నించడానికి భారత్ అనుమతించదని ప్రపంచానికి అజిత్ దోవల్ బలంగా ఇచ్చిన సందేశం.ఈ సంఘటనను ఒక నమ్మకమైన వర్గం "ఎస్‌సీఓ నిబంధనలను,సభ్య దేశాల సార్వభౌమత్వాన్ని కాపాడే విధానాలను పాకిస్థాన్ పూర్తిగా ఉల్లంఘించింది"అని అభివర్ణించింది.తర్వాత రష్యా కూడా పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యకు తమ మద్దతు లేదని స్పష్టం చేసింది.రష్యన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి నికోలాయ్ పట్రుషెవ్,అజిత్ దోవల్ వాకౌట్‌ను ప్రశంసించారు.

తెర వెనుక సూపర్ స్పై
అజిత్ దోవల్ జీవితం ఒక స్పై థ్రిల్లర్‌ను తలపిస్తుంది.1971 నుంచి 1978 మధ్య కాలంలో 'సూపర్ స్పై'గా ప్రసిద్ధి చెందిన దోవల్,ఒక ముస్లిం మత గురువు వేషంలో పాకిస్థాన్‌లో అజ్ఞాతంగా ఆరేళ్లపాటు గడిపారు. 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో పాకిస్థాన్ సైనిక ప్రణాళికల గురించి కీలక సమాచారాన్ని సేకరించి, భారత్ వ్యూహాత్మక నిర్ణయాలకు ఎంతో సహాయపడ్డారు.దేశంలో తిరుగుబాట్లను అదుపు చేయడంలో కూడా దోవల్ కీలక పాత్ర పోషించారు.

  • 1986లో మిజో శాంతి ఒప్పందం: మిజో తిరుగుబాటు నాయకులతో సంప్రదింపులు జరిపి, 1986లో మిజో శాంతి ఒప్పందం కుదిరేలా దోవల్ కృషి చేశారు.
  • ఆపరేషన్ బ్లాక్ థండర్ (1988): 1988లో అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో ఉగ్రవాదుల కదలికలను తెలుసుకోవడానికి ఐఎస్ఐ ఏజెంట్‌గా వేషం వేసుకుని లోపలికి చొరబడ్డారు.
  • కందహార్ విమాన హైజాకింగ్ (1999): 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ అయినప్పుడు, ప్రయాణికుల విడుదల కోసం తాలిబాన్‌తో చర్చలు జరిపిన బృందంలో దోవల్ సభ్యుడు.
  • నలుగురు నర్సుల రక్షణ (2014): 2014లో ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదులు బంధించిన 46 మంది భారతీయ నర్సులను సురక్షితంగా రక్షించడంలో కీలక పాత్ర పోషించారు.
  • సర్జికల్ స్ట్రైక్స్ (2016): 2016లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్‌లపై భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌కు వ్యూహ రచనలో ఆయన ప్రధానంగా పాలుపంచుకున్నారు.

నిజమైన హీరోకు సరైన నిర్వచనం అజిత్ దోవల్. భారతదేశ భద్రతకు, సార్వభౌమత్వానికి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+