ఆత్మాహుతి దాడికి పాల్పడగలవా?: ఆల్‌ఖైదా జాబ్ అప్లికేషన్‌లో కాలమ్
న్యూఢిల్లీ: అమెరికా లక్ష్యంగా చేసుకుని దాడులు జరపాలంటూ ఆల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఎప్పుడూ తన సహచరులకు చెబుతుండే వాడని తెలిసింది. లాడెన్ రాసిన పత్రాలు, ఉత్తరాల్లో ఈ అంశాలు బయటపడ్డాయి.
2 మే, 2011న పాకిస్ధాన్‌లో లాడెన్‌ను మట్టుబెట్టిన అనంతరం అతని ఇంట్లో వేల సంఖ్యలో ఉన్న పత్రాలను అమెరికా నేవీ సీల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటిలో వందకు పైగా పత్రాలను అమెరికా బుధవారం మీడియా ముందు ఉంచింది.
ప్రముఖ వార్తా సంస్ధ ఏఎఫ్‌పీ వీటి వివరాలను వెల్లడించింది. ఆల్ ఖైదాలో చేరాలని భావించి దరఖాస్తు నింపాలనుకుంటే ఏదైనా ఆత్మాహుతి దాడికి పాల్పడగలవా? నువ్వు చనిపోతే ఆ సమాచారాన్ని ఎవరికి చేరవేయాలి లాంటి కాలమ్స్ నింపాల్సి ఉంటుంది.
అంతే కాదు "దయచేసి సమాచారాన్ని కరెక్టుగా నిజాయితీగా, స్పష్టంగా ఇవ్వండి" అనే కాలమ్ ఉందట. "అమెరికా ప్రజల్ని, వారి నాయకుల్ని చంపటం, నిరంతరం ఎదుర్కొవటంపైనే దృష్టి పెట్టాలి" అంటూ ఒక లేఖలో లాడెన్ తన సహచరులకు ఒక సందేశంగా ఇచ్చాడు.

అమెరికాపై దాడులను నిరంతరం కొనసాగిస్తేనే ఆ దేశం ముస్లింల జోలికి రాదని పేర్కొన్నాడు. 2010 నుంచి అరబ్ దేశాల్లో వరుసగా తలెత్తిన ఉద్యమాలు లాడెన్‌ను అమితంగా ఆకర్షించాయంట.
అంతే కాదు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముస్లింల యువతును ఏకంచేయాలని ఆయదేశాల్లోని అనుచరులకు ఆదేశాలు జారీ చేశాడు.
వీటితో పాటు ఎలాంటి ప్రమాదాలనైనా ఎదుర్కొన్ని ఆత్మాహుతి దాడులకు పాల్పడే యువతరాన్ని ఆల్‌ఖైదాలోకి ఆకర్షించటం ఎలా అన్నదానిపై లాడెన్ ప్రణాళికలను రచించారంట.
మరికొన్ని పత్రాల్లో లాడెన్ బాగా ఇష్టపడే ఆయన కుమారుడు హమ్జాను పాకిస్దాన్‌కు రహస్యంగా తీసుకువచ్చే అంశంపై కూడా ఆల్‌ఖైదా నేతలు జరిపిన వివరాలు కూడా పత్రాల్లో ఉన్నాయట.












Click it and Unblock the Notifications