వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Aliens calling: పాలపుంతకు అవతలి వైపు నుొంచి భూమికి అంతుచిక్కని సంకేతాలు:

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అంతరిక్షం ఎప్పుడూ మిస్టరీనే. అంతుచిక్కని బ్రహ్మపదార్థమే. ఎన్నేళ్లయినా, ఎన్నాళ్లయినా, ఎన్ని ప్రయోగాలు చేస్తోన్నా ఆ మిస్టరీ వీడేది కాదు. ఈ అనంత విశ్వంలో మన స్థానం కేవలం సూది మొన మోపినంతే అనేది ఖగోళ శాస్త్రవేత్తల అభిప్రాయం. మన భూగోళం ఉంటోన్న పాలపుంతకు అవతల అర్థం కాని, మన విజ్ఞానానికి అందని ఓ సరికొత్త ప్రపంచం ఉందనేది సుస్పష్టం. దాన్ని ఛేదించడానికి దశాబ్దాలుగా చేస్తోన్న ప్రయత్నాలు మాత్రం కొలిక్కి రావట్లేదు. మరో జీవం కోసం కొనసాగిస్తోన్న అన్వేషణకు పుల్ స్టాప్ పడట్లేదు.

కోడిగుడ్డులో ఉండే బ్యాక్టీరియా గురించి తెలుసా: తెల్లసొన తినడం వల్ల లాభమా? నష్టమా?కోడిగుడ్డులో ఉండే బ్యాక్టీరియా గురించి తెలుసా: తెల్లసొన తినడం వల్ల లాభమా? నష్టమా?

మిస్టరీ సంకేతాలను గ్రహించిన టెలిస్కోప్స్..

మిస్టరీ సంకేతాలను గ్రహించిన టెలిస్కోప్స్..

భూమి అనేది ఒకటి ఉందని, అక్కడ మనుషులు జీవిస్తున్నారని తెలియజేస్తూ.. మన ఉనికిని చాటుకోవడానికి శాస్త్రవేత్తలు, పరిశోధకులు దశాబ్దాలుగా అంతరిక్షంలోకి పంపిస్తోన్న సంకేతాలకు అంతు లేకుండా పోతోందే తప్ప.. ఇప్పటిదాకా ఎలాంటి ప్రతి స్పందనలు రాలేదనే విషయం మనకు తెలుసు. తాజాగా- ఈ నిరీక్షణకు బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది. మన పాలపుంతకు సంబంధం లేని గెలాక్సీ నుంచి భూమిపైకి కొన్ని అర్థం కాని సంకేతాలు అందుతున్నాయని అంతరిక్ష పరిశోధకులు వెల్లడించారు.

సౌర వ్యవస్థకు అవతలి వైపు నుంచి..

సౌర వ్యవస్థకు అవతలి వైపు నుంచి..

నెదర్లాండ్స్‌లోని లో-ఫ్రీక్వెన్సీ ఆర్రే (లోఫర్) ఈ రేడియో సంకేతాలను గ్రహించింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రేడియో యాంటెన్నా ఇది. ఈ యాంటెన్నా కొన్ని రకాల సిగ్నళ్లను అందుకుంది. ఇప్పటిదాకా ఇలాంటి సిగ్నళ్లను ఈ యాంటెన్నా రిసీవ్ చేసుకోలేదు. ఇలాంటి లో-ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలను రిసీవ్ చేసుకోవడం ఇదే తొలిసారి. యూనిర్శిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్ ప్రొఫెసర్ డాక్టర్ బెంజమిన్ పోప్ సారథ్యంలోని పరిశోధకుల బృందం.. ఈ తరంగాలను గుర్తించింది. డచ్ జాతీయ అబ్జర్వేటరీ అస్ట్రాన్‌లో దీన్ని డీకోడ్ చేస్తోంది.

 రేడియో ఆస్ట్రానమీ..

రేడియో ఆస్ట్రానమీ..

పాలపుంతకు అవతలి వైపు నుంచి ఈ రేడియో సంకేతాలు అందినట్లు బెంజమిన్ పోప్ నిర్ధారించారు. భూమికి కోటాను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే 19 రెడ్ డ్వార్ఫ్‌ల నుంచి ఇవి వెలువడినట్లు గుర్తించామని అన్నారు. సౌర వ్యవస్థలో ఉండే ప్లానెట్ల నుంచి తరచూ శక్తిమంతమైన రేడియో సంకేతాలు వెలువడుతుంటాయని, ఇప్పడు తాజాగా అందిన సిగ్నళ్లు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. రేడియో ఆస్ట్రానమీలో కొత్త తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఈ సంకేతాలను గుర్తించినట్లు చెప్పారు. ఈ మేరకు నేచర్ ఆస్ట్రానమిలో ఓ జర్నల్‌ను ప్రచురించారు.

 ఇప్పటిదాకా చూడలే..

ఇప్పటిదాకా చూడలే..

ఇప్పటిదాకా చూడని నక్షత్రాలు, ప్లానెట్ నుంచి ఇవి వెలువడ్డాయని బెంజమిన్ పోప్ తెలిపారు. సౌర కుటుంబంలో అతి పెద్దదైన గురు గ్రహం చంద్రుడు ఐఓ (Io) నుంచి వెలువడే సంకేతాలను పోలి ఉన్నట్లు చెప్పారు. పాలపుంతలో ఏర్పడే శక్తిమంతమైన అయస్కాంత ప్రభావాల వల్ల అరోరాలు ఏర్పడుతుంటాయని, ఉత్తర, దక్షిణ ధృవాల్లో అవి సాధారణ కంటికి కనిపిస్తుంటాయని చెప్పారు. అలాంటి అయాస్కాంత ప్రభావాల ద్వారా ఏర్పడిన రేడియో సంకేతాలు పాలపుంతకు అవతలి వైపు నుంచి అందాయని అన్నారు. మరో జీవం ఉందనడానికి ఇది బలమైన సాక్ష్యాధారంగా నిలుస్తోందని విశ్లేషించారు.

ఏలియన్ల ఉనికికి సంకేతాలుగా..

ఏలియన్ల ఉనికికి సంకేతాలుగా..

మన సోలార్ సిస్టమ్‌లో ఏర్పడే అరోరాల కంటే ఇవి శక్తిమంతమైనవిగా ప్రాథమికంగా నిర్ధారించామని బెంజమిన్ చెప్పారు. ఈ విశ్వంలో ఎక్కడో ఓ చోట బుద్ధిజీవులు ఉండే అవకాశం లేకపోలేదనే తమ అంచనాలకు అనుగుణంగా ఈ సంకేతాలు ఉన్నాయని అన్నారు. ఏలియన్ల ఉనికిని చాటుతున్నాయని పేర్కొన్నారు. ఆ సంకేతాలను పంపిస్తున్నది ఎవరు? ఆ సంకేతాల అర్థమేంటీ? వారి ఉద్దేశమేంటీ? అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

English summary
As per the scientists, distant stars have been blasting radio signals, which were caught on the Earth, receives by Low-Frequency Array (LOFAR) in the Netherlands, which is the world’s most powerful radio antenna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X