వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ స్కూల్‌లో విద్యార్థినిలందరూ టీనేజీ తల్లులే...

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
లింకన్ హైస్కూల్

అమెరికాలో గత ఏడాది చివరన మాతృత్వం అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. చిన్న వయసులోనే గర్భం దాల్చి తల్లులవుతున్న వారి కోసం టెక్సాస్‌లో ప్రత్యేకంగా ఒక స్కూల్ నడుపుతున్నారు. ఈ స్కూల్ టీనేజ్ తల్లులకు ఎలా చేయూతనందిస్తుంది. వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూద్దాం.

హెలెన్ 2021 ప్రారంభంలో ఎప్పటి కంటే ఎక్కువగా తినడం మొదలు పెట్టారు.

ఈ 15 ఏళ్ల అమ్మాయికి ఎందుకు తనకింత తినాలనిపిస్తుందో అర్థం కాకపోయేది.

ఎవరికైనా మామూలుగా ఇలా తినాలనిపిస్తుందా? అని తన అక్కని అడిగింది. ''అవుతుండొచ్చు’’ ఆమె సమాధానం చెప్పారు.

హెలెన్ మనసు కూడా ఎప్పుడూ నలతగా, గందరగోళంగా ఉండేది. దాని వల్ల ఆమె తరచూ తన కుటుంబంతో, స్నేహితులతో గొడవలు పడేది.

ఆ తర్వాత ఆమెకు నెలసరి ఆలస్యమైంది.

తన పుట్టిన రోజు నాడు గర్భవతి అని తేలింది. ''నేనసలు దీన్ని నమ్మలేదు’’ అని హెలెన్ చెప్పారు.

ఈ వార్త విని తన స్నేహితులంతా హెలెన్‌ను దూరం పెట్టారు. అబ్బాయిలను ఆమె తన చుట్టూ తిప్పుకునేదనే నిందలు మోయాల్సి వచ్చింది.

తన బిడ్డకు తండ్రైన హెలెన్ క్లాస్‌మేట్ కూడా తనతో మాట్లాడటం మానేశాడు.

''వారితో నేను పోరాడాలనుకోలేదు’’ హెలెన్ చెప్పారు.

నెలలు నిండుతున్న సమయంలో, ఆమె స్కూల్ మారాలని నిర్ణయించుకున్నారు.

లింకన్ హైస్కూల్

బయట నుంచి చూస్తే, అమెరికాలోని ఇతర ఉన్నత పాఠశాల మాదిరిగానే లింకన్ పార్క్ హైస్కూల్ కూడా కనిపించింది. గేట్ ముందట స్కూల్ బస్సులు ఆగి ఉన్నాయి.

మెల్లగా వీస్తున్న గాలికి అమెరికా జాతీయ జెండా రెపరెపలాడుతోంది.

తరగతి గదుల్లోకి వెళ్తున్న బాలికల హడావుడితో పాటు, వారి చేతిలోని పిల్లల ఏడుపులు, అరుపులు వినిపిస్తున్నాయి.

ప్రెగ్నెన్సీ సర్వీసులను, పేరెంటింగ్ క్లాస్‌లను ప్రోత్సహించేలా కాలేజీ గోడలపై పలు పోస్టర్లు కనిపించాయి.

ఈ స్కూల్ ప్రధాన భవంతి పక్కనే పిల్లల్ని చూసుకునే డేకేర్ సెంటర్ కూడా ఉంది.

అమెరికా-మెక్సికో సరిహద్దు పట్టణమైన టెక్సాస్, బ్రౌన్స్‌విల్‌లో ఈ స్కూల్ ఉంది.

చిన్న వయసులోనే తల్లులైన బాలికలకు విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ స్కూల్‌ని నడుపుతుంది యాజమాన్యం.

ప్రత్యేక విద్యా సేవలందిస్తున్న కొన్ని స్కూళ్లలో ఇది ఒకటి.

లింకన్ హైస్కూల్

గత మూడు దశాబ్దాలుగా అమెరికాలో టీనేజ్ పిల్లలు గర్భవతులయ్యే రేటు తగ్గింది. కానీ, ఇతర బాలికలతో పోలిస్తే స్పానిష్ మూలాలున్న పిల్లల్లో ప్రెగ్నెన్సీలు అత్యధికంగా ఉంటున్నాయి.

అమెరికాలో ఇతర వర్గాలతో పోలిస్తే లాటినో బాలికలే అత్యధికంగా చిన్న వయసులోనే గర్భవతులవుతున్నారు.

అమెరికాలో అబార్షన్లకు ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణను తీసివేస్తూ 2022లో సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించడంతో.. చిన్న వయసులోనే గర్భం దాల్చే వారి సంఖ్య మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లింకన్ పార్క్ 2005 నుంచి ప్రత్యేకంగా టీనేజ్ తల్లులకి తన సేవలందిస్తోంది. లింకన్ పార్కులోని విద్యార్థులంతా కూడా దాదాపు 14 నుంచి 19 ఏళ్ల లోపు వారే. వారందరూ కూడా దాదాపు లాటిన్లే.

చాలా మంది సంపాదన అరకొర మాత్రమే. కొంతమంది అమెరికాలో పుట్టిన మెక్సికన్ నివాసితుల పిల్లలు.

అమెరికాలో ఈ ఏడాది అమ్మతనం సంస్కృతి పరంగా, రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో, అనుకోని ఈ జీవన మార్పుల వల్ల బాలికలు అప్పటికే ఎదుర్కొంటోన్న సవాళ్ల నుంచి వారిని బయటపడేసేందుకు లింకన్ పార్క్ స్కూల్ కృషి చేస్తోంది.

నా కోసం, బిడ్డ కోసం మాత్రమే ఆలోచిస్తున్నా..

తన పాపను తీసుకుని కూడా స్కూల్‌కి వెళ్లొచ్చనే కారణంతో హెలెన్ లింకన్ పార్క్ స్కూల్‌లో చేరినట్టు తెలిపారు.

జూన్‌లో బీబీసీతో మాట్లాడిన హెలెన్ ఇంకా బెరుకుగా, దిగాలుగా కనిపించారు.

తన భుజాన పుస్తకాలు, జర్నల్స్‌తో పాటు తన 8 నెలల కూతురు జెనీన్ డైపర్లు, బేబీ బట్టలున్నాయి.

'ఇవెప్పుడూ నా పక్కనే ఉంటాయి. నేను ప్రస్తుతం నా గురించి, నా కూతురి గురించి మాత్రమే ఆలోచిస్తున్నా’ అని హెలెన్ చెప్పారు.

ఈ పాఠశాలలో 70 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ సంఖ్య మారుతూ ఉంటుంది.

ఎందుకంటే కొత్తగా గర్భం దాల్చిన వారు ఈ స్కూల్‌లో చేరడం, కొందరు బిడ్డ పుట్టిన తర్వాత తమ మునపటి స్కూళ్లకు వెళ్లిపోవడం జరుగుతూ ఉంటుంది.

లింకన్ పార్క్‌కి బీబీసీ వెళ్లినప్పుడు, 14 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఏడుగురు సెకండరీ స్కూల్ విద్యార్థులు కూడా దీనిలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

అలాగే, ముగ్గురు విద్యార్థులకైతే అప్పటికే ముగ్గురు చొప్పున పిల్లలున్నారు.

ఇతర పాఠశాల విద్యార్థుల మాదిరిగానే వీరి స్కూల్ సిలబస్ ఉంటుంది.

విద్యార్థులు తమ క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యేలా లింకన్ స్కూల్ యజమాన్యం సహకరిస్తుంది.

విద్యార్థులను తీసుకెళ్లి, తీసుకొచ్చే బస్సులలో పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా సీట్లుంటాయి.

ఉదయం పూట విద్యార్థినులు వారి కోసం, వారి పిల్లల కోసం అల్ఫాహారం తీసుకొస్తుంటారు.

తమ పిల్లలు అక్కడే ఉన్న డేకేర్ సెంటర్‌లో ఉచితంగా చదువుకోవచ్చు. ఎలాంటి ఫీజుల బెడదా ఉండదు.

తమ పిల్లలు ఆరోగ్యం బాగలేనప్పుడు ఆసుపత్రిలో చూపించేందుకు ఆ విద్యార్థులకు అనుమతి కూడా ఉంటుంది. తల్లులకు అవసరమైనప్పుడు పిల్లల వస్త్రాలను అందించేందుకు క్లాస్‌రూమ్‌లో ఒక దగ్గర పెద్ద వార్డ్‌రోబ్ ఉంది.

లింకన్ హైస్కూల్

ఆత్మీయత, అనుబంధం, బాధ, జీవితం

హెలెన్ మాదిరిగానే అలెక్సిస్ కూడా 15 ఏళ్ల వయసులోనే గర్భం దాల్చింది.

ఇంట్లోనే మూడు ప్రెగ్నెన్సీ పరీక్షలు చేసుకుంటే, ఆ మూడింట్లో కూడా పాజిటివ్ వచ్చాయి.

అప్పటికీ నమ్మలేక డాక్టర్‌కి చూపించుకుంటే, తన కడుపులో బేబీ పెరుగుతున్నట్టు ధ్రువీకరించారు.

'ఆ సమయంలో నాకెంతో కష్టంగా అనిపించింది. కానీ, దీని నుంచి తప్పించుకోవాలనుకోలేదు’ అని అలెక్సిస్ అన్నారు.

ఆ తర్వాత కొంత కాలానికి లింకన్ పార్క్ స్కూల్ గురించి తెలిసింది. ప్రస్తుతం తన కొడుకి వయసు ఏడాది.

బయట అసౌకర్యంగా అనిపించిన వీరికి ఈ క్లాస్‌రూమ్‌లలో ఎంతో ఆత్మీయత, అనురాగాలు లభిస్తాయి. అక్కడి విద్యార్థులకు, టీచర్లకు ఇదంతా చాలా సహజం.

మంగళవారం ఉదయం మ్యాథ్స్ తరగతిలో కూర్చున్న అలెక్సిస్, వచ్చే ఏడాది కూడా తాను రిజిస్టర్ చేసుకున్నట్లు ప్రొఫెసర్ అర్రెడోండోకి చెప్పారు.

అమెరికా అంటు రోగాల నియంత్రణ సంస్థ గణాంకాల ప్రకారం, 15 నుంచి 19 ఏళ్లున్న ప్రతి 1000 మంది మహిళలలో 2020లో 15 మంది పిల్లలకు జన్మనిచ్చారు.

ఈ డేటాలో 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారి పిల్లల్ని చేర్చలేదు.

మొత్తంగా దేశవ్యాప్తంగా చిన్న వయసులోనే తల్లులవుతోన్న వారు తగ్గుతున్నప్పటికీ, టెక్సాస్‌లో మాత్రం ఈ సంఖ్య అధికంగా ఉంటుంది.

చిన్న వయసులోనే పిల్లలకి జన్మనిస్తున్న టాప్ 10 రాష్ట్రాలలో టెక్సాస్ మొదటి స్థానంలో ఉంటోంది.

లింకన్ హైస్కూల్

సెక్స్ ఎడ్యుకేషన్

బాలికల గర్భధారణ రేట్లలో చాలా అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కానీ, టెక్సాస్‌ రాష్ట్రం చాలా కఠినంగా అబార్షన్ చట్టాలను అమలు చేయడం, పాఠశాలలో సెక్స్ ఎడ్యుకేషన్ తప్పనిసరి కాకపోవడంతో ఆ ప్రాంతంలో అత్యధికంగా చిన్న వయసులోనే బాలికలు తల్లులవుతున్నారు.

బాలికలతో ఈ సమాచారం పంచుకోకపోతే, వారికి దీనిపై అవగాహన రాదని లింకన్ పార్క్ హైస్కూల్ ప్రిన్సిపల్ సింథియా కార్డెనాస్ చెప్పారు.

వారికి దీని ప్రభావాలు తెలుసుకునేందుకు కనీసం అవకాశం ఇవ్వడం లేదన్నారు.

టెక్సాస్‌లో గర్భిణీలయ్యే బాలికలకు తప్పనిసరిగా ప్రజారోగ్య సదుపాయాలను అందించాలని లేదంటే ప్రెగ్నెన్సీ తీసేసుకోవాలనుకుంటే వారు కఠినమైన అబార్షన్ చట్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.

ఇతర రాష్ట్రలకు వెళ్లి అబార్షన్ సర్వీసులు పొందడం తక్కువ ఆదాయం గల మహిళలకు కష్టమవుతుంది.

తాను గర్భం దాల్చినట్టు తెలియగానే హెలెన్ రెండు విషయాల గురించి ఆలోచించారు. అబార్షన్ చేయించుకోవాలా? లేదంటే ఎవరికైనా తన బిడ్డను దత్తత ఇవ్వాలా? అని. తనే నిర్ణయం తీసుకున్న కూడా సపోర్టు చేస్తానని తన తల్లి హెలెన్‌కు మద్దతుగా నిలిచారు.

చివరికి హెలెన్ తన పండంటి బిడ్డకు జన్మించారు. తనతోనే తన కూతుర్ని కూడా ఉంచుకోవాలనుకున్నారు.

''నాకు ఇప్పటి వరకు జరిగిన అన్ని మంచి విషయాల్లో నా కూతురు ఎంతో అద్భుతమైంది. నా చేతుల్లో నా ప్రేమ ఉంది. నాకన్నీ నా కూతురే’’ అని హెలెన్ చెప్పారు.

లింకన్ హైస్కూల్

హెలెన్ తన హై స్కూల్ పూర్తి చేసేందుకు ఇంకా ఒక్క ఏడాదే ఉంది.

తనకి యూనివర్సిటీలో చదువుకోవాలని ఉందని హెలెన్ అన్నారు. అప్పుడైతేనే తన కూతురికి మంచి భవిష్యత్‌ను అందించగలుగుతానని తెలిపారు.

చిన్న వయసులోనే తల్లులైన వారిలో సగం మంది హై స్కూల్ పూర్తి చేశారని, కొందరు కాలేజీ డిగ్రీలను పొందినట్లు అమెరికా సీడీసీ తెలిపింది.

లింకన్ పార్కులో ఒకవేళ అడ్మిషన్ దొరకకపోతే ఎక్కడి వెళ్లే వారని హెలెన్‌ను అడగగా.. ''నిజంగా నాకసలు ఐడియా లేదు. నేను నా బిడ్డతో ఇంట్లోనే పోరాటం చేసేదాన్నేమో’’ అని అన్నారు.

మాతృత్వం పొందిన తొలి నాళ్లలో ఎదురయ్యే ఇబ్బందులు కాస్త కష్టంగానే ఉంటాయి. టీనేజ్ తల్లులు ఒత్తిడికి గురవుతూ ఉంటారు.

లింకన్ పార్కులో చదువుకునే తల్లులు ఎదుర్కొంటున్న ఈ ఒత్తిడి సమస్యలు, పేదరికం వల్ల పాఠశాల చదువులపై ఆసక్తి కోల్పోతున్నారు.

కొంతమంది చంటి పాపతో లేదా బాబుతో ఉన్నత చదువులు కొనసాగించడం అసాధ్యమని భావిస్తున్నారు.

వారికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, లింకన్ పార్కు ముఖ్య ఉద్దేశ్యాలలో ఒకటేమిటంటే.. విద్యార్థులు కాలేజీకి వెళ్లేలా ప్రోత్సహించడమేనని ఆ స్కూల్ ప్రిన్సిపల్ సింథియా కార్డెనాస్ అన్నారు.

టీనేజ్ తల్లుల్ని విజయవంతుల్ని చేసి, వారి పిల్లలకి కూడా బంగారు భవిష్యత్ ఉందని నేర్పుతున్నామని చెప్పారు.

కార్డెనాస్ దగ్గరికి వచ్చిన విద్యార్థులు ఆమెను పిల్లలతో ఎలా మెలగాలి, తల్లిగా ఎలాంటి పాత్ర పోషించాలి వంటి విషయాల్లో సలహాలు తీసుకుంటున్నారు.

ఇంట్లో నుంచి గెంటివేసిన టీనేజ్ తల్లులకు ఆమె ఆశ్రయమిస్తున్నారు.

పిల్లల్ని ఎలా పెంచాలో కూడా కొన్నిసార్లు వారికి తెలియదన్నారు కార్డెనాస్.

ఎడ్యుకేటర్లులాగా తాము వారి భవిష్యత్‌ను తమ చేతుల్లోకి తీసుకుంటున్నామని, సరైన మార్గంలో తాము ఈ కర్తవ్యం నిర్వర్తించాల్సి ఉందన్నారు.

సుప్రీంకోర్టు అబార్షన్ నిషేధ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత వచ్చిన రాజకీయ, సామాజిక మార్పుల నేపథ్యంలో లింకన్ పార్క్ లాంటి పాఠశాలలకు మద్దతు లభిస్తుందని కార్డెనాస్ భావిస్తున్నారు.

ఈ నిర్ణయం ప్రత్యేకమైనది, కానీ ఇది యువతపై ఎక్కువగా ప్రభావం చూపనుందని పిల్లల సంక్షేమంపై దృష్టిసారించే అమెరికా రీసెర్చ్ గ్రూప్ చైల్డ్ ట్రెండ్స్ తెలిపింది.

అబార్షన్లను ఎక్కువగా కోరుకుని, ఆ తర్వాత గర్భధారణ గురించి తెలుసుకునే టీనేజ్ పిల్లలు, సపోర్టు దొరకక ఇబ్బందులు పడుతున్నారు.

''మిడిల్, హై స్కూల్‌లో సెక్స్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించాలని మేము ఆశిస్తున్నాం. గర్భస్రావానికి ఇచ్చిన హక్కును సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవడంతో, ఒకవేళ ఎక్కువ మంది టీనేజ్ అమ్మాయిలు పిల్లలకి జన్మిస్తే.. ఆ తర్వాత అనుసరించాల్సిన ప్రణాళికను మేము సిద్ధం చేస్తాం’’ అని కార్డెనాస్ చెప్పారు.

''అన్ని పాఠశాలలు ఇలాంటివి ఆఫర్ చేయవు. ఇది అవసరమా? అని నన్ను మీరెడగితే, అవుననే చెబుతాను. 10 మంది బాలికల జీవితాలను మార్పులు తీసుకొచ్చారా? అంటే అవును. ఈ అమ్మాయిల సాధారణ క్యాంపస్‌ల ద్వారా సాధించలేనిది ఇక్కడ పొందారు’’ అని కార్డెనాస్ తెలిపారు.

ఈ పాఠశాల హాల్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న ముందటి తరగతులకు చెందిన విద్యార్థినుల ఫోటోలున్నాయి. ఈ ఫోటోలలో వారు ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు.

కెరీర్ గెస్ట్ స్పీకర్ సిరీస్‌లో భాగంగా ప్రతి వారం స్థానిక నిపుణులు వచ్చి విద్యార్థినులకు బోధిస్తూ ఉంటారు.

''తల్లిగా బిడ్డను పట్టుకుని స్కూల్‌కు వచ్చి ఏం చేస్తుంటారు? నిజంగా చాలా కష్టం కదా’’ అని ఒక ప్రజెంటర్ వారితో అన్నారు.

''మనం ఇప్పుడు ఏం చేస్తే, ప్రతిఫలం కూడా అదే వస్తుందని తెలుసుకోండి’’ అని సూచించారు.

ఇవి కూడా చదవండి:

English summary
All the students in that school are teenage mothers...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X