వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా హెచ్చరికలపై అమెరికా భగ్గు: దేనికైనా రెఢీ: తైవాన్ అధ్యక్షురాలితో భేటీ: ఆ హామీలు

|
Google Oneindia TeluguNews

తైపే: ఒకవంక చైనా హెచ్చరికలు.. దానికి అనుగుణంగా దుందుడుకు చర్యలు.. యుద్ధసన్నాహాక చర్యలు.. మరోవంక తైవాన్‌లో అమెరికా అత్యున్నత హోదాలో స్పీకర్ న్యాన్సీ పెలోసీ పర్యటనతో ఆసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. న్యాన్సీ పెలోసీ చేపట్టిన తైవాన్ పర్యటనపై చైనా తీవ్ర అభ్యంతరాలు, హెచ్చరికలను జారీ చేయడానికి పరిమితం కావట్లేదు. ఏకంగా యుద్ధ సన్నాహాలకు దిగింది. ఆర్మీ డ్రిల్‌ను మొదలు పెట్టింది.

ఆయా చర్యలన్నింటినీ అమెరికా తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. అదే సమయంలో తాము తొలుత చర్చలకే ప్రాధాన్యత ఇస్తామని, అవాంఛనీయ పరిస్థితులకు తాము మొదటి కారణం కాబోమనీ హామీ ఇచ్చింది. ఇదివరకు తైవాన్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికీ తాము కట్టుబడి ఉన్నామనీ స్పష్టం చేసింది. ఎవ్వరి బెదిరింపులకూ లొంగబోమని తేల్చి చెప్పింది.

 Always stand with Taiwan: Nancy Pelosi meets President of Taiwan Tsai Ing-wen in Taipei

ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య న్యాన్సీ పెలోసీ- తన తైవాన్ పర్యటనలో కీలక ఘట్టాన్ని ఆవిష్కరించారు. రాజధాని తైపేలో కొద్దిసేపటి కిందటే తైవాన్ అధ్యక్షురాలు సై ఇంగ్-వెన్‌తో సమావేశం అయ్యారు. ఆ దేశాధ్యక్షురాలి అధికారిక భవనంలో ఈ భేటీ ఏర్పాటయింది. తనవెంట వచ్చిన ప్రతినిధులతో కలిసి ఇంగ్-వెన్‌ను కలిశారు. అధ్యక్షురాలి భవనంలోకి తైవాన్ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇంగ్-వెన్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో న్యాన్సీ పెలోసీని గౌరవించారు. ది ఆర్డర్ ఆఫ్ ప్రొపిటియస్ క్లౌడ్స్ పురస్కారాన్ని అందజేశారు. అనంతరం జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తైవాన్‌ను తాము దూరం పెట్టట్లేదని, సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తోన్న దౌత్య, సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నామని న్యాన్సీ పెలోసీ స్పష్టం చేశారు. ఇదివరకు తైవాన్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రాధాన్యత ఇస్తామని తేల్చి చెప్పారు.

 Always stand with Taiwan: Nancy Pelosi meets President of Taiwan Tsai Ing-wen in Taipei

తైవాన్‌తో అన్ని రకాలుగా సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి గర్వపడుతున్నామనీ పెలోసీ వ్యాఖ్యానించారు. తియాన్మెన్ స్క్వేర్ ఊచకోత అంశం కూడా న్యాన్సీ పెలోసీ-ఇంగ్ వెన్ మధ్య చర్చకు వచ్చింది. మానవ హక్కులను పరిరక్షించడానికి అమెరికా ఎప్పుడు ముందు ఉంటుందని స్పష్టం చేశారు. తైవాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకూ అవకాశం ఇవ్వబోమనీ పరోక్షంగా చైనాను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు.

English summary
US House Speaker Nancy Pelosi meets President of Taiwan Tsai Ing-wen in Taipei. She said that America has made a bedrock promise to always stand with Taiwan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X