Amazon.com ఆగమాగం: గ్లోబల్‌గా నిలిచిన సేవలు -గంటల్లోనే పునరుద్దరణ -బెజోస్ దిగిపోయాక రెండోసారి
ఈ-కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ స్ట్రీమింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇలా అరడజను దాకా సేవలందించే ప్రపంచ ప్రఖ్యాత టెక్ సంస్థ 'అమెజాన్' అనూహ్య పరిణామాలను ఎదుర్కొంది. గ్లోబల్ గా ఆ సంస్థ సేవలు నిలిచిపోయాయి. ఆదివారం సాయంత్ర నుంచి సోమవారం దాకా కొన్ని గంటలపాటు Amazon.com వెబ్ సైట్ పనిచేయలేదు. దీంతో..
షాపింగ్, స్ట్రీమింగ్, ఏఐ, ఐటీ సర్వీసులు పొందే కస్టమర్లు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలుత అమెరికాలో మొదలైన ఆన్ లైన్ ఇబ్బందులు ఇండియా సహా యూరప్, ఆసియా దేశాల్లోనూ చోటుచేసుకున్నాయి. పెద్ద సంఖ్యలో కస్టమర్లు అమెజాన్ డౌన్ అంటూ సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టారు. వినియోగ దారుల నుంచి ఫిర్యాదులు రావడంతో..

ఆన్ లైన్ సేవల్లో అంతరాయంపై అమెజాన్ సంస్థ స్పందించింది. తాజాగా ఆ సంస్థ ప్రతినిధి ఓ అధికారిక ప్రకటన విడదల చేశారు. ఆన్ లైన్ సేవల్లో ఇబ్బందులు తలెత్తినమాట వాస్తవమేనని, వెంటనే సమస్యలను పరిష్కరించామని, ప్రస్తుతం అంతా సజావుగా నడుస్తోందని తెలిపారు. అయితే, ఈ స్థాయిలో ఇబ్బందులకు గల కారణాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు.
అమెజాన్ డాట్ కామ్, అలెక్సా సేవల్లో ఇబ్బందులపై దాదాపు 40వేల మంది వినియోగదారులు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. జూన్ చివరి వారం నుంచి ఇప్పటిదాకా అమెజాన్ ఆన్ లైన్ సేవల్లో చోటుచచేసుకున్న రెండవ విస్తృత అంతరాయం ఇది. సరిగ్గా, జెఫ బెజోస్ స్థానంలో అమెజాన్ సీఈవోగా ఆండీ జెస్సీ బాధ్యతలు తీసుకున్న సమయంలోనే ఇలాంటి అవాంతరాలు ఏర్పడటం గమనార్హం. ప్రస్తుతం అమెజాన్ సేవలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతున్నాయి..












Click it and Unblock the Notifications