వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

America 9/11 ట్విన్ టవర్స్ కేసు, జో బైడెన్ దెబ్బతో షాక్, ఇరకాటంలో సౌదీ, ఆల్ ఖైదా, తాలిబన్లకు !

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్/ కాబూల్/ సౌదీ అరేబియా: అమెరికాలోని ట్విన్ టవర్స్ ను నేలమట్టం చేసిన ఆల్ ఖైదాకు, ఆ సంస్థ ఉగ్రవాదులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఆర్థికంగా సహాయం చేసిన వారి బండారం మొత్తం బయట పెట్టాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డిసైడ్ అయ్యారు. ఇంతకాలం 2001 సెప్టెంబర్ 11వ తేదీ (9/11) దాడులపై జరిపిన విచారణ పత్రాలు మొత్తం బయట పెట్టాలని ఆమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎఫ్ బీఐ అధికారులకు, న్యాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద ఆల్ ఖైదా ఉగ్రవాదులు దాడులు చెయ్యడానికి సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా సహకరించిందని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే బాధితుల కుటుంబాలు కొన్ని లక్షల కోట్ల డాలర్ల నష్టపరిహారం కోరుతూ సౌదీ అరేబియా ప్రభుత్వం మీద దావా వేశారు. అఫ్గానిస్తాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో అక్కడి నుంచి అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిపోయాయి. అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద దాడి చేసి 20 ఏళ్లు పూర్తి అవుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక పత్రాలు బహిర్గతం చెయ్యడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఎఫ్ బీఐ అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యడం కలకలం రేపింది. అమెరికాకు ఇటీవల సవాలు చేసిన తానిబన్లకు, ఆల్ ఖైదాకు చుక్కలు చూపించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డిసైడ్ అయ్యారని తెలిసింది.

Illegal affair: నా ప్రియురాలు శాడిస్టు, భర్తనే వదల్లేదు, నన్ను టార్చర్ పెట్టి కోరికలు తీర్చుకుంది!Illegal affair: నా ప్రియురాలు శాడిస్టు, భర్తనే వదల్లేదు, నన్ను టార్చర్ పెట్టి కోరికలు తీర్చుకుంది!

 వారం రోజులు ఉంటే 20 సంవత్సరాలు

వారం రోజులు ఉంటే 20 సంవత్సరాలు

ఆల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికాలోని ట్విన్ టవర్స్ ను 2001 సెప్టెంబర్ 9వ తేదీన కూల్చి వేసిన విషయం తెలిసిందే. ఆల్ ఖైదా దాడులు చెయ్యడంతో వేలాది మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సుమారు 20 వేల మందికిపై బాధితులు తీవ్రగాయాలై ఇప్పటికీ బాదపడుతున్నారు. అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద ఆల్ ఖైదా దాడులు చేసి సుమారు 20 సంవత్సరాలు అవుతోంది. వారం రోజుల్లో అమెరికా ట్విన్ టవర్స్ మీద దాడులు చేసి 20 సంవత్సరాలు పూర్తి అవుతోంది.

Recommended Video

అది బెస్ట్ డెసిషన్.. వాళ్లే దేశాన్ని Talibans చేతుల్లో పెట్టారు..! - Joe Biden || Oneindia Telugu
 అమెరికాకు బాధితుల లేఖలు

అమెరికాకు బాధితుల లేఖలు

అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద దాడులు జరిగిన కేసులను ఆదేశంలోని అత్యున్నత విచారణ సంస్థ ఎఫ్ బీఐ విచారణ చేసింది. ట్విన్ టవర్స్ మీద దాడులు చేసిన వివరాలను గోప్యంగా ఉంచారని, వాటి వివరాలను బయట పెట్టాలని ఇప్పటికే సుమారు 3 వేల మందికి పైగా బాధిత కుటుటంబాలు అమెరికా ప్రభుత్వానికి ఘాటుగా లేఖలు రాశాయి. అయితే భద్రత కారణాల రీత్య అమెరికా విచారణ జరిగిన పత్రాలను రహస్యంగానే పెట్టింది. అమెరికా కావాలనే ట్విన్ టవర్స్ దాడుల విషయాలు దాచిపెడుతోందని బాధితుల కుటుంబాలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నాయి.

 ఎన్నికల ముందు హామీ ఇచ్చాను...... ఇప్పుడు చెయ్యాలి

ఎన్నికల ముందు హామీ ఇచ్చాను...... ఇప్పుడు చెయ్యాలి

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో తాను 9/11 దాడుల విపయంలో ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చానని, ఇప్పుడు తాను అధ్యక్షుడు అయిన తరువాత ఆ హామీలను నెరవేర్చాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంటున్నారు. నేను చెప్పినట్లు 9/11 దాడులకు సంబంధించి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (FBI) దర్యాప్తు చేసిన పత్రాలు అన్ని బయట పెట్టడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంబంధిత న్యాయశాఖ అధికారులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

 అరు నెలలు మాత్రమే టైమ్

అరు నెలలు మాత్రమే టైమ్

వచ్చే ఆరు నెలల్లోపు 9/11 దాడులకు సంబంధించి ఇప్పటి వరకు ఎఫ్ బీఐ ఎన్నికోణాల్లో విచారణ చేసి ఆధారాలు సేకరించింది. తప్పు చేసిన వారు ఎవరు ?, ఆల్ ఖైదా ఉగ్రవాదులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారు ఎవరు అనే పూర్తి సమాచారంతో సేకరించిన పత్రాలు మొత్తం బయటపెట్టాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డిసైడ్ అయ్యారని వెలుగు చూసింది.

 ఇరకాటంలో సౌదీ అరేబియా ?

ఇరకాటంలో సౌదీ అరేబియా ?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయంతో దాదాపుగా 1,700 మంది ప్రత్యక్షంగా ఈ కేసుతో ప్రభావితం అవుతారని సూచించింది. 9/11 దాడుల కేసు విచారణ 2004లో పూర్తి అయ్యింది. అప్పట్లో ఎఫ్ బీఐ అధికారులు జరిపిన విచారణలో సౌదీ ప్రభుత్వం

ఆల్ ఖైదా ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిందని అధికారులు అంటున్నారు. ఇదే విషయంలో ఇప్పుడు జో బైడెన్ ఆదేశాలతో సౌదీ ప్రభుత్వం ఇరకాటంలో పడే అవకాశం ఉందని తెలిసింది.

 ఒక్క దెబ్బతో ఝలక్ ఇచ్చిన జో బైడెన్

ఒక్క దెబ్బతో ఝలక్ ఇచ్చిన జో బైడెన్

9/11 దాడులకు సంబంధించి ఇంతకాలం ఎఫ్ బీఐ దగ్గర ఉన్న రహస్య సమాచారం మొత్తం ఇప్పుడు ప్రజల చేతికి రానుందని. జో బైడెన్ ఆదేశాలు జారీ చేసిన కొంతసేటికే ఆ దిశగా చర్యలు తీసుకోవాడానికి అమెరికా న్యాయశాఖ అధికారులు చకచకా పనులు మొదలు పెట్టారని తెలిసింది. ఇంతకాలం ఆల్ ఖైదా దాడులకు సంబంధించి ఎఫ్ బీఐ అంత రహస్యంగా సమాచారం ఎందుకు దాచి పెట్టింది ? అనే విషయం ఆరు నెలల్లో అమెరికా ప్రజలతో పాటు ప్రపంచ దేశాల ప్రజలకు చెప్పడానికి అమెరికా ప్రభుత్వం సిద్దం అవుతోంది.

 అంతా సౌదీ మాయ

అంతా సౌదీ మాయ

2001 సెప్టెంబర్ 9వ తేదీ అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద దాడి చేసిన 19 మందికి సౌదీ ప్రభుత్వం ఏమైనా సహాయం చేసిందా ?, వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహరించి ఆర్థికంగా సహాయం చేసిందా అనే కోణంలో విచారణ చేసిన ఎఫ్ బీఐఅధికారులు ఇప్పుడు ఆ సత్యాన్ని ప్రజల ముందు పెట్టడానికి సిద్దం అయ్యారు. 2001 సెప్టెంబర్ 9వ తేదీన ఆల్ ఖైదా ఉగ్రవాదులు నాలుగు వాణిజ్య (కమర్షియల్) విమానాలను హైజాక్ చేశారు. తరువాత అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లలోకి దూసుకెళ్లిన విమానాలు ఆ భవనాలను కుప్పకూల్చేశాయి. హైజాక్ అయిన నాలుగవ వాణిజ్య విమానం యూఎస్ క్యాపిటల్ భవనాన్ని లక్షంగా చేసుకుని దాడులు చెయ్యడానికి ప్రయత్నించడంతో ఆ విమానం పెన్సిల్వేనియాలో కుప్పకూలిపోయిందని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

 తాలిబన్ల సవాలుకు అమెరికా కౌంటర్ ?

తాలిబన్ల సవాలుకు అమెరికా కౌంటర్ ?

అఫ్గానిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తానిబన్లు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద ఆల్ ఖైదా, ఒసామా బిన్ లాడెన్ దాడులు చేశారని సాక్షాలు ఉంటే బయట పెట్టాలని సవాలు విసిరారు. తాలిబన్లు సవాలు చేసి 10 రోజులు కూడా పూర్తి కాకముందే అమెరికా అధ్యక్షుడు జో బైడన్ సంచలన నిర్ణయం తీసుకోవడం, అధికారులు ఆదిశగా చర్యలు ప్రారంభించడంతో కథ రసవత్తరంగా మారింది.

English summary
America 9/11: US President Joe Biden orders declassification of 9/11 investigation documents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X