ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్‌లు కలిగిన దేశం ఏదో తెలుసా..?
ప్రస్తుతం ప్రపంచంలో డ్రోన్ టెక్నాలజీ అధికంగా పెరిగిపోతోంది. ఆధునిక యుద్ధాల్లో వీటి పాత్ర అధికంగా ఉంది. ఇటీవల జరిగిన భారత్- పాక్ యుద్ధంలో పాకిస్థాన్ నుంచి దూసుకొచ్చిన 600కు పైగా డ్రోన్ లను భారత్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కుప్పకూల్చింది. ఈ డ్రోన్ లను పాకిస్థాన్ కు టర్కీ చేరవేసింది. అటు రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఇరు దేశాలు డ్రోన్ టెక్నాలజీనే వాడుతున్నాయి. అలానే ప్రపంచ దేశాలు ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీని అలవరచుకుంటున్నాయి.
డ్రోన్ లు అంటే చిన్న లేదా మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి. వీటిని మానవరహిత వైమానిక వాహనాలు(UAV) అని కూడా అంటారు. వీటిని రిమోట్ కంట్రోల్ ద్వారా లేదా ఆటోమేటిక్ గా ఆపరేట్ చేస్తారు. ఈ వాహనాలు రోబోటిక్స్, ఏరోనాటిక్స్ టెక్నాలజీ అనుసంధానం చేయడం ద్వారా పనిచేస్తాయి. ఇక డ్రోన్ లను ఫొటోగ్రఫీ, వీడియో, మ్యాపింగ్, నిఘా, వ్యవసాయం, ప్యాకేజింగ్, పరిశోధన.. తదితర రంగాల్లో అత్యధికంగా వినియోగిస్తారు.
మరి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్ లు కలిగిన దేశాలు ఏంటో తెలుసా..? అగ్రరాజ్యం అమెరికా వద్ద ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్ ఉంది. ఈ డ్రోన్ ను MQ-9 రీపర్ అంటారు. MQ-9 రీపర్ ను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, అధునాతన డ్రోన్ గా పరిగణిస్తారు. దీనిని అమెరికా సొంత టెక్నాలజీతో నిర్మించింది.
ఈ డ్రోన్ లను శత్ర స్థావరాలను గుర్తించడానికి, గూఢచర్యం చేయడానికి, దాడి చేయడానికి వినియోగిస్తారు. ఈ డ్రోన్ ప్రత్యేకత ఏంటంటే.. ఎక్కవ సేపు గాలిలో ఉండగలదు. చాలా ఎత్తులో ఎగరలదు. అత్యంత కచ్చితత్వంతో శత్రువును గుర్తించి.. హతమార్చే శక్తి ఈ డ్రోన్ సొంతం. MQ-9 రీపర్ 19 వేల కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. అంతేకాక 50 వేల అడుగుల ఎత్తులో కూడా ప్రయాణించగలదు. ఇవి ఒక్కోటి దాదాపు రూ. 125 కోట్ల నుంచి రూ. 250 కోట్ల వరకు ధర ఉంటాయి.

అత్యంత ప్రమాదకరమైన డ్రోన్స్ లో టర్కీ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం టర్కీ వద్ద బేరక్తార్ TB2, అకిన్సీ డ్రోన్ లు ఉన్నాయి. ఇవి తక్కువ ధరలో అధిక నాణ్యతను కలిగి ఉన్నాయి. ఈ డ్రోన్ లనే పాకిస్థాన్ కు టర్కీ చేరవేసింది. అయితే ఈ డ్రోన్ లను భారత్ కూల్చేసింది.
డ్రోన్ టెక్నాలజీలో చైనా మూడో స్థానంలో ఉంది. చైనా వద్ద ప్రత్యేకమైన డ్రోన్ లు ఉన్నాయి. డ్రాగన్ కు చెందిన వింగ్ లూంగ్ 2 మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ డ్రోన్. ఈ డ్రోన్ ను నిఘా వ్యవస్థ, గూఢచర్యానికి వాడుతోంది చైనా. ఇక ఇజ్రాయెల్ నాలుగో స్థానంలో ఉంది. ఇజ్రాయెల్ వద్ద హీరోన్ టీపీ అనే డ్రోన్ ఉంది. 12.5(41వేల అడుగులు) కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణిస్తుంది. 27 గంటల వరకు ఏకధాటిగా ఈ డ్రోన్ ఆపరేట్ చేయవచ్చు. ఈ హీరోన్ టీపీ డ్రోన్ లను భారత్ కొనుగోలు చేసింది. ఇవి భారత ఆర్మీ సమర్థవంతంగా వినియోగిస్తోంది.
డ్రోన్ టెక్నాలజీలో భారత్ ఐదో స్థానంలో ఉంది. భారత్ వద్ద రుస్తోమ్- 2(తపాస్) డ్రోన్ లు ఉన్నాయి. రుస్తోమ్- 2ను తపాస్- బీహెచ్ డ్రోన్ లు అని కూడా పిలుస్తారు.TAPAS అనగా టాక్టికల్ ఎయిర్ బార్న్ ప్లాట్ ఫార్మ్ ఫర్ ఏరియల్ సర్వీలెన్స్ అని అర్థం. ఇవి మానవ రహిత వాహనాలు. ఈ డ్రోన్ లకు ఆయుధాలు, రాడార్లు, ఇతర యుద్ధ సామాగ్రిని మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది.












Click it and Unblock the Notifications